Tag Archives: jagan mohan reddy

Ramgopal Varma: వర్మ పై చర్యలు తీసుకోవాలంటూ సీఎంకు వీహెచ్ లేక.. “తాత మీరు ఇంకా ఉన్నారా..” అంటూ ఆర్జీవీ కౌంటర్!

Ramgopal Varma: సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏదో ఒక విషయం ద్వారా తరచూ వార్తలో నిలుస్తూ ఉంటారు. అయితే తాజాగా ఈయన ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరిగినటువంటి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా రాంగోపాల్ వర్మ విద్యార్థులను ఉద్దేశిస్తూ చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపుతున్నాయి.

ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన మహిళలను కించపరుస్తూ మాట్లాడటంతో పలువురు మహిళా సంఘాల నేతలు వర్మ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఈ క్రమంలోనే తెలంగాణ పిసిసి మాజీ అధ్యక్షుడు వి హనుమంతరావు ఈ ఘటనపై స్పందిస్తూ చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈయన మాట్లాడుతూ.. రామ్ గోపాల్ వర్మ మహిళలను ఉద్దేశించి మాట్లాడిన మాటలు సరైనవి కాదని తెలిపారు.

ఇప్పటివరకు ఈ విషయంపై పరిశ్రమకు చెందిన ఏ ఒక్కరు కూడా స్పందించలేదు. ఇలానే వదిలేస్తే మహిళలను అవమానించడం ఆనవాయితీగా మారుతుంది. వర్మకు దమ్ముంటే ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీకి వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడమనండి అంటూ సవాల్ చేశారు. ఇలా వర్మ చేసిన ఈ వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకొని వర్మపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఈయన లేక రాశారు.

Ramgopal Varma: మీలాంటి వారి వళ్లే కాంగ్రెస్ కు ఆ పరిస్థితి…

ఇక వి హనుమంతరావు వర్మపై ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడంతో వర్మ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ క్రమంలోనే వర్మ ఈ విషయంపై స్పందిస్తూ.. ఓ తాతగారు మీరు ఇంకా ఉన్నారా?NASA యాక్ట్ వర్తించదు,TADA యాక్ట్ 1995 లోనే తీసేశారు ఇది కూడా తెలియని మీలాంటి లీడర్స్ మూలంగానే కాంగ్రెస్ కి ఆగతి..ఒకసారి డాక్టర్ కి చూపించు కొండి అంటూ వర్మ కామెంట్ చేశారు. అయితే ఈ కామెంట్ పై పలువురు స్పందిస్తూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

ఏపీ విద్యార్థులకు శుభవార్త.. అమ్మఒడి ల్యాప్ టాప్ ఫీచర్లు ఇవే..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ విద్యార్థులకు వచ్చే ఏడాది నుంచి అమ్మఒడి స్కీమ్ లో భాగంగా ల్యాప్ టాప్ లను పంపిణీ చేయనున్న సంగతి తెలిసిందే. 9వ తరగతి, ఆపై తరగతులు చదివే విద్యార్థులు అమ్మఒడి స్కీమ్ ద్వారా ల్యాప్ టాప్ లను పొందే అవకాశం ఉంటుంది. కరోనా మహమ్మారి విజృంభణ తరువాత ఆన్ లైన్ క్లాసులకు ప్రాధాన్యత పెరిగిన నేపథ్యంలో ల్యాప్ టాప్ ల వల్ల విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కంప్యూటర్ నైపుణ్యాలను పెంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ల్యాప్ టాప్ లను పంపిణీ చేయడానికి సిద్ధమవుతోంది. ప్రభుత్వం విద్యార్థుల కోసం తెచ్చే ల్యాప్ టాప్ లకు మూడు సంవత్సరాల వారంటీ కూడా ఉంటుందని ప్రభుత్వం కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే అమ్మఒడి ల్యాప్ టాప్ ఫీచర్లకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

తెలుస్తున్న సమాచారం ప్రకారం విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంతో పని చేసే ఈ ల్యాప్ టాప్ లో 4జీబీ ర్యామ్, 512 జీబీ హార్డ్ డిస్క్ ఉంటుందని తెలుస్తోంది. నేటి కంప్యూటర్ యుగంలో విద్యార్థులు వెనుకబడకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేందుకు ఈ ల్యాప్ టాప్ లను అందుబాటులోకి తీసుకురానుంది. మార్కెట్ లో ఈ ల్యాప్ టాప్ ల ధర 25,000 రూపాయల నుంచి 27,000 రూపాయల మధ్య ఉంటుంది.

అయితే ప్రభుత్వం ఈ ల్యాప్ టాప్ లను కేవలం 18,500 రూపాయలకే అందుబాటులోకి తీసుకురానుందని తెలుస్తోంది. జగన్ సర్కార్ డిగ్రీ విద్యార్థులకు కూడా ల్యాప్ టాప్ లు అందించే దిశగా అడుగులు వేస్తోందని తెలుస్తోంది. రివర్స్ టెండరింగ్ ప్రక్రియ ద్వారా ల్యాప్ టాప్ ల ధరలను తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలుస్తోంది. తక్కువ ధరకే ల్యాప్ టాప్ లు లభిస్తూ ఉండటం వల్ల విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.