Tag Archives: joint pains

మోకాళ్ళ నొప్పులతో బాధ పడుతున్నారా.. అయితే ఈ సర్జరీ ఎంతో ఉత్తమం!

సాధారణంగా వయసు పైబడిన తర్వాత చాలామంది బాధపడే సమస్యలలో మోకాళ్ళ నొప్పుల సమస్య ఒకటి. చాలామంది మోకాళ్ళ నొప్పి సమస్యతో బాధపడుతున్న కూడా అప్పటికప్పుడు తక్షణ ఉపశమన మార్గాలను ఎంచుకొని ఇలాంటి నొప్పులను నిర్లక్ష్యం చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఈ నొప్పి మరింత బలంగా మారి తీవ్ర బాధకు కారణం అవుతుంది. ఈ విధంగా నొప్పి తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు వైద్యుని సంప్రదించగా చికిత్స చేయాలంటే ఎంతో కష్టంతో కూడుకొని ఉంటుంది. అందుకే ఈ వ్యాధి తీవ్రత కొద్దిగా ఉన్నప్పుడే వైద్యుని సంప్రదించి సరైన చికిత్స తీసుకోవటం వల్ల పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు.

ఈ క్రమంలోనే అధిక మోకాలు నొప్పి సమస్యతో బాధపడే వారిలో మోకాళ్ళ మార్పిడి శస్త్రచికిత్స చేయాలని చెబుతుంటారు.ఎవరికైతే ఈ విధమైనటువంటి శస్త్ర చికిత్స చేయాల్సి వస్తుందో వారు నొప్పి తీవ్రతను అనుభవించిన తరువాత వైద్యుల్ని సంప్రదిస్తున్నారని డాక్టర్లు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా జాయింట్ పెయిన్స్, బోన్ ప్రాబ్లమ్స్ వంటి సమస్యలకు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సరైన సమయంలో చికిత్స చేయించుకోవాలని వైద్యులు చెబుతున్నారు.

చాలామందికి మోకాలిలో అధిక సమస్య ఉండటం చేత వారికి మోకాళ్ళ మార్పిడి శస్త్రచికిత్స చేయాలని వైద్యులు సూచిస్తారు. ఈ విధంగా సర్జరీ చేయించుకునే వారికి Total Knee Replacement లేదా TKR చికిత్స చేయించుకోవడం ఎంతో మంచిది.ఈ చికిత్సా విధానం ద్వారా ఎక్కడైతే నొప్పి ఉంటుందో అది మాత్రమే కాకుండా మొత్తం పూర్తిగా మెకానిక్స్ పైన ఇది మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ సర్జరీ ద్వారా నడిచేటప్పుడు కూర్చున్నప్పుడు నిలబడినప్పుడు కలిగే నొప్పి కూడా జాయింట్ స్టేబుల్‌గా ఉండి అవి సక్రమంగా పని చేయడానికి వీలవుతుంది.

కీళ్ల నొప్పులు తగ్గించుకోవాలంటే పాటించాల్సిన చిట్కాలు..!

ఈ మధ్య కాలంలో ఎంతోమంది ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య కీళ్లనొప్పుల సమస్య.వయసుతో తారతమ్యం లేకుండా అతి చిన్న వయస్సు నుంచి ఈ సమస్యతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఇందుకు గల కారణం ఎముకలలో క్యాల్షియం లోపం కావచ్చు.లేదా మారుతున్న మన ఆహారపు అలవాట్లు జీవన శైలి కూడా ఇందుకు కారణమని చెప్పవచ్చు. అయితే ఒక్క సారిగా ఈ కీళ్లనొప్పుల బారిన పడితే వాటి నుంచి కోలుకోవడం ఎంతో కష్టంతో కూడుకున్న పని. ఈ కీళ్ల నొప్పులకు ఎలాంటి మందులు వాడినా కేవలం కొంత సమయం వరకు మాత్రమే ఉపశమనం కలిగిస్తుంది. దీర్ఘకాలికంగా కీళ్ళ నొప్పులతో బాధపడే వారికి ఆ సమస్య నుంచి విముక్తి పొందడానికి పాటించాల్సిన కొన్ని చిట్కాలను ఇక్కడ తెలుసుకుందాం.

కీళ్లనొప్పుల సమస్యతో బాధపడేవారు ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలి. వీటితోపాటు తాజా పండ్లు, కూరగాయలను వారి ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. ముఖ్యంగా ఎముకలు దృఢంగా ఉంటే ఈ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎముకలు దృఢంగా ఉండాలంటే క్యాల్షియం అధికంగా లభించే ఆహార పదార్థాలను తీసుకోవాలని నిపుణులు తెలియజేస్తున్నారు.

కీళ్ల నొప్పులు ఎక్కువగా ఉన్న చోట వెల్లుల్లిరసంతో బాగా మర్దన చేయడం ద్వారా ఈ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. కీళ్ల నొప్పులతో బాధపడేవారు వీలయినంతవరకు మాంసానికి దూరంగా ఉండడం ఎంతో మంచిది. ఎక్కువగా చేపలు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారపదార్థాలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ప్రతిరోజు సరైన ఆహారం తీసుకుంటూ శరీరానికి తగిన వ్యాయామాలు చేయడం ద్వారా కీళ్ల నొప్పులు సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ విధంగా కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా కీళ్లనొప్పి సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.