Tag Archives: kailash

Kailasa parvatham mistery : కైలాస పర్వతంపై శివుడు నిజంగా ఉన్నాడా?? ఎందుకని ఎవరూ ఆ పర్వతం ఎక్కలేకపోతున్నారు…!

Kailasa parvatham mistery : ప్రపంచంలోని ఎత్తయిన పర్వాతాలను చాలా మంది అధిరోహించారు. ఏకంగా ఎవరెస్టును కూడా అధిరోహించారు. కానీ ఎవెరెస్టు కంటే తక్కువ ఎత్తులో ఉండే కైలాస పర్వతాన్ని మాత్రం ఇప్పటికీ ఏ ఒక్కరూ ఎందుకు ఎక్కలేకపోయారు. అక్కడ అతీత శక్తులు ఉన్నాయా అనే సందేహం చాలా మందికి కలుగుతుంది. మన భారతీయ సంస్కృతి రామాయణం, మహా భారతంను దాటి పక్కకు పోదు. చిన్నతనం నుండి మనం ఏదో ఒక సందర్బంలో రామాయణ, మహా భారత గాధలనే కథలుగా వింటూనే ఉన్నాం. అలా రామాయణంలో రావణుడి గురించి తెలుసుకున్నాం. రావణుడు శివని అపరభక్తుడు. ఆయన ఆత్మలింగాన్ని పొందడానికి ఆయన పది తలలను శివునికి అర్పించారు. ఈ విషయం మనం కథలలో తెలుసుకున్న ఆ ప్రాంతం ఎక్కడ ఉంది అన్న విషయం చాలామందికి తెలియదు. అది మరెక్కడో కాదు ఈ కైలాస పర్వతం మీదనే.

కైలాస పర్వతం మీద నిజంగానే శివుడు ఉన్నాడా…

కైలాస పర్వతంకి అసలు ఆ పేరు ఎలా వచ్చిందంటే, కౌలస అనే సంస్కృత పదం నుండి వచ్చింది. కౌలస అనగా స్పటికం అని అర్థం. కైలాస పర్వతం ఇప్పటి టిబెట్ ప్రాంతంలో అనగా నేడు చైనా ఆక్రమిత టిబెట్ లో ఉంది. దాదాపు ఎన్నో కోట్లమంది ప్రజలు ఈ కైలాస పార్వతంను ఆధ్యాత్మిక ప్రాంతంగా భావించి పూజిస్తున్నారు. ఇక ఈ పర్వతం ఎత్తు 6.6 కిలోమీటర్లు. ప్రపంచంలోని ఎన్నో ఎత్తయిన పర్వతాలలో ఇదీ ఒకటి. ఇక ఈ పర్వతాన్ని ఇప్పటివరకు ఎవరూ అధిరోహించలేదు కానీ పర్వతపు మొదలుకు వెళ్లి పూజలు చేస్తారు. అక్కడ ఉన్న రెండు సరస్సులు ఒకటి మానస సరోవర్ మరొకటి రాక్షస్థల్. మానస సరోవరం బ్రహ్మ మనసు నుండి పుట్టింది. ఇక ఇక్కడ మునక వేస్తే ఏడు జన్మల పాపాలు పోతాయని నమ్మకం. ఇది సూర్యుని వెలుగుకు ప్రతీక కాగా పక్కన ఉన్న రాక్షస్థల్ ఉప్పు నీటి సరస్సు. ఇది చంద్రుని ఆకారంలో ఉంటుంది. ఇందులో రావణాసురుడు తన ఒక్కోతలను ఒక్కోరోజు బలిగా శివునికి అర్పించాడని పురాణాలు చెబుతాయి. అందుకే ఈ సరస్సులో ఎవరూ మునగరు.

ఇక మానస సరోవరం లో బ్రహ్మ ముహూర్తం సమయంలో అంటే వేకువ జామున కైలాస పర్వతం నుండి శివుడు వచ్చి స్నానం చేస్తారని పురాణాలు చెబుతున్నాయి. దీనికి సాక్ష్యంగా కైలాస పర్వతం నుండి ఆ సమయంలో మానస సరోవరం కు ఒక వెలుగు రావడం చూశామని చాలా మంది భక్తులు చెప్పారు. అయితే ఈ వెలుగు ఎందుకు వస్తోందో శాస్త్రవేత్తలు ఇప్పటికీ కనిపెట్టలేకపోయారు. ఇక ఈ పర్వతం వద్ద వృద్దాప్యం త్వరగా వస్తుంది, రెండు వారాలలో పెరగాల్సిన గోర్లు, వెంట్రుకలు 12 గంటలలోనే పెరుగుతాయి దీనికి కారణం ఇప్పటికీ అంతుచిక్కలేదు. ఇది కూడా ఈ పర్వతాన్ని అధిరోహించక పోవడానికి కారణం. రేడియేషన్ అధికంగా ఉండే ఈ పర్వతం అధిరోహించడానికి ప్రయత్నించిన ఎంతో మంది విఫలం అయ్యారు. చైనా ప్రభుత్వం హెలీకాప్టర్ ద్వారా ఈ పర్వతం ఎక్కాలని ప్రయత్నించినా హెలీకాప్టర్ కూలిపోయింది. రెండు సార్లు పర్వతారోహకులకు ఎక్కడానికి అవకాశం కల్పించినా వారు విఫలమయ్యారు. అక్కడికి చేరుకున్న ఎంతో మంది మార్గం మధ్యలోనే అదృశ్యమయ్యారు. దీంతో ఇక ఇప్పుడు ఈ పర్వతాన్ని ఎక్కడాన్ని నిషేదించారు. ఎంతో మంది మత విశ్వాసాలకు భంగం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు.