Tag Archives: Kannada Film

Rishabh Shetty: కాంతార హీరో రిషబ్ శెట్టి గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

Rishabh Shetty: కన్నడ చిత్ర పరిశ్రమలో హీరోగా దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటుడు రిషబ్ శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కన్నడ చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాలలో నటించిన ఈయన పలు సినిమాలకు దర్శకుడిగా కూడా పనిచేశారు. ఇక తాజాగా ఈయన స్వీయ దర్శకత్వంలోనే కాంతార సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి క్రేజ్ సంపాదించుకుందో మనకు తెలిసిందే.

దర్శకుడిగా హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి రిషబ్ శెట్టి గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.. రిషబ్ శెట్టి అసలు పేరు ప్రశాంత్ శెట్టి ఈయన 1983 జులై 7న కర్ణాటకలోని కుందాపూర్ లో జన్మించారు. ఈయన హిందూ కుటుంబానికి చెందిన వ్యక్తి ఈయనకు మరో సోదరుడు కూడా ఉన్నారు. ఫిలిం డైరెక్షన్లో డిప్లమో చేసినటువంటి రిషబ్ శెట్టి కెరియర్ మొదట్లో ఏఎంఆర్ రమేష్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు.

అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నటువంటి రిషబ్ శెట్టి 2010 సంవత్సరంలో నటుడిగా మారాడు ‘నామ్ ఓరీలి ఒండినా’ చిత్రంలో ఓ చిన్న పాత్రలో నటించారు.ఇలా చిన్న చిన్న పాత్రలలో నటించినటువంటి ఈయన దర్శకత్వంపై ఇష్టం ఉండటంతో మొదటి సినిమా ‘రిక్కీ’ 2016 లో రిలీజ్ అయింది. ఈ సినిమా తర్వాత రక్షిత్ శెట్టి హీరోగా కీరిక్ పార్టీ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం కల్పించారు.

Rishabh Shetty: డైరెక్షన్ పై మక్కువతోనే…

ఇలా ఈ సినిమాతో సక్సెస్ కావడంతో ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు దర్శకత్వం చేస్తూ ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందారు. ఇక తాజాగా తాప్సి నటించిన మిషన్ ఇంపాజిబుల్ సినిమాలో కూడా ఈయన కీలక పాత్రలో నటించారు. ఇక రిషబ్ శెట్టి2017లో ప్రగతి శెట్టి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ విధంగా ఇండస్ట్రీలో దర్శకుడిగా నిర్మాతగా ఎంతో బిజీగా ఉన్నారు.

షూటింగ్‌లో కరెంట్ షాక్.. ఒకరు మృతి..!

ప్రతి చోట ప్రమాదాలు పొంచి ఉంటాయి. దేవుడు దయ తప్పించుకుంటే ఓకే లేకపోతే వాటి పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. తాజాగా ఓ షూటింగ్ జరిగిన ప్రమాదంలో కరెంట్‌ షాక్‌తో సహాయ ఫైటర్‌ మృతి చెందాడు. వివేక్‌ (28)జోగనదొడ్డి వద్ద షూటింగ్‌ చేస్తుండగా కరెంట్‌ షార్ట్‌ సర్క్యూట్‌ జరిగి ప్రాణాలు కోల్పోగా.. ఇద్దరు సహాయకులు గాయపడ్డారు. గాయ‌ప‌డ్డ వారిని బెంగ‌ళూరులోని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఈ ప్రమాదం తర్వాత దర్శకుడు శంకర్‌రాజ్, నిర్మాత గురుదేశ్‌పాండెను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.

సినిమా షూటింగ్‌లో తరుచు ప్రమాదాలు జరుగుతునే ఉన్నాయి. ఇటీవలే శంక‌ర్ తెర‌కెక్కిస్తున్న భార‌తీయుడు 2 షూటింగ్ ప్రమాదంలో భారీ క్రేన్ విరిగడంతో ముగ్గురు మృతి చెందారు. మరో 10 మందికి గాయాలయ్యాయి. క‌మ‌ల్‌ హాసన్, శంక‌ర్, కాజ‌ల్ ఈ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు.