Rishabh Shetty: కన్నడ చిత్ర పరిశ్రమలో హీరోగా దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటుడు రిషబ్ శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కన్నడ చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాలలో నటించిన ఈయన పలు సినిమాలకు దర్శకుడిగా కూడా పనిచేశారు. ఇక తాజాగా ఈయన స్వీయ దర్శకత్వంలోనే కాంతార సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి క్రేజ్ సంపాదించుకుందో మనకు తెలిసిందే.
దర్శకుడిగా హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి రిషబ్ శెట్టి గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.. రిషబ్ శెట్టి అసలు పేరు ప్రశాంత్ శెట్టి ఈయన 1983 జులై 7న కర్ణాటకలోని కుందాపూర్ లో జన్మించారు. ఈయన హిందూ కుటుంబానికి చెందిన వ్యక్తి ఈయనకు మరో సోదరుడు కూడా ఉన్నారు. ఫిలిం డైరెక్షన్లో డిప్లమో చేసినటువంటి రిషబ్ శెట్టి కెరియర్ మొదట్లో ఏఎంఆర్ రమేష్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు.
అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నటువంటి రిషబ్ శెట్టి 2010 సంవత్సరంలో నటుడిగా మారాడు ‘నామ్ ఓరీలి ఒండినా’ చిత్రంలో ఓ చిన్న పాత్రలో నటించారు.ఇలా చిన్న చిన్న పాత్రలలో నటించినటువంటి ఈయన దర్శకత్వంపై ఇష్టం ఉండటంతో మొదటి సినిమా ‘రిక్కీ’ 2016 లో రిలీజ్ అయింది. ఈ సినిమా తర్వాత రక్షిత్ శెట్టి హీరోగా కీరిక్ పార్టీ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం కల్పించారు.
ఇలా ఈ సినిమాతో సక్సెస్ కావడంతో ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు దర్శకత్వం చేస్తూ ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందారు. ఇక తాజాగా తాప్సి నటించిన మిషన్ ఇంపాజిబుల్ సినిమాలో కూడా ఈయన కీలక పాత్రలో నటించారు. ఇక రిషబ్ శెట్టి2017లో ప్రగతి శెట్టి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ విధంగా ఇండస్ట్రీలో దర్శకుడిగా నిర్మాతగా ఎంతో బిజీగా ఉన్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…