Categories: FeaturedMovie News

Senior actor Narasimharaju : ఆ సినిమాలో నేను హీరో ఆయన విలన్… తరువాత చిరంజీవి సినిమాలో నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేయాల్సి వచ్చింది : సీనియర్ నటుడు నరసింహారాజు

Senior actor Narasimharaju : తెలుగులో జానపద హీరోగా బాగా గుర్తింపు తెచ్చుకున్న నటుల్లో నరసింహ రాజు గారు ఒకరు. 1970 లలో అనేక జానపద సినిమాలలో నటించిన ఆయన విఠలాచార్య సినిమా ‘జగన్మోహిని’ ద్వారా సూపర్ హిట్ అందుకున్నారు. అప్పట్లో నరసింహ రాజు, హీరోయిన్ ప్రభ హిట్ పెయిర్ గా నిలిచారు. సినిమాల మీద మక్కువతో నరసింహారాజు గారు మద్రాస్ వెళ్లి ప్రయత్నం చేయడంతో అవకాశాలు వచ్చాయి. ‘నీడలేని ఆడది’ సినిమాతో కెరీర్ మొదలు పెట్టిన నరసింహ రాజు గారు, విఠలాచర్య గారి పరిచయంతో ఆయన కెరీర్ మారిపోయింది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం గ్రామానికి చెందిన నరసింహరాజు గారు దాదాపుగా 110 సినిమాల్లో నటించారు.

ఆ సినిమాలో నేను హీరో చిరంజీవి విలన్…

జానపద సినిమాలతో బాగా పేరు అభిమానుల్స్ని సంపాదించిన నరసింహరాజు గారు, ఇక నీడలేని ఆడది వంటి సినిమాలలో కూడా మంచి నటన కనబరిచారు. ఇక అప్పట్లో నరసింహారాజు గారు దాసరి నారాయణ రావు గారి శిష్యుడుగా ఉండేవారు. ఇక అదే గ్రూప్ లో మోహన్ బాబు, ఈశ్వర్ రావు, చిరంజీవి అందరూ ఉండేవారు. పునాదిరాళ్లు, పున్నమి నాగు వంటి సినిమాల్లో వారితో కలిసి నటించారు నరసింహ రాజుగారు. అయితే అప్పటి సినిమాల్లో అందరి ఇమేజ్ దాదాపు సమానం అయినా ఒకింత నరసింహ రాజు హీరో చిరంజీవి గారు నెగెటివ్ షేడ్ లాంటి పాత్ర ఉండేవి.

ఆ తరువాత కాలంలో చిరంజీవి హీరో గా చేసిన సినిమాలో నరసింహారాజు గారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించారు. ‘మగధీరుడు’ సినిమాలో చిరంజీవి హీరో అయితే నరసింహరాజు గారు ఒక పాత్రలో నటించారు. కానీ దీనికి కారణం విజయ బాపినీడు గారు అడగడం వల్ల స్నేహం కొద్ది చేశారట నరసింహారాజు గారు. 1985 వరకు సినిమాల్లో చాలా బిజీగా ఉండి మంచి అవకాశాలను అందుకున్న ఆయన ఆ తరువాత రేస్ లో వెనుకబడిపోయానంటూ చెప్పారు. ఒకరిని వెళ్లి అవకాశాలు అడగాలన్నా మొహమాటం కొద్ది అడగలేక మనకు ఉన్నది చాలు కదా అని సరిపెట్టుకున్నానంటూ చెప్పారు నరసింహారాజు గారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

4 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago