Tag Archives: kapil dev

Kapil Dev: చోకర్స్ అంటూ టీమిండియా పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్?

Kapil Dev: టి20 ప్రపంచ కప్ మ్యాచ్లలో భాగంగా టీమిండియా సెమీఫైనల్స్ వరకు వెళ్లి ఇంగ్లాండ్ చేతిలో దారుణంగా ఓటమిపాలై ఇంటిదారి పట్టారు. ఇలా ఫైనల్ కు వెళ్లి కప్పు కొడుతుందని భావించిన వారికి టీమిండియా షాక్ ఇచ్చిందని చెప్పాలి.ఇలా సెమీఫైనల్స్ లో ఇంగ్లాండ్ చేతిలో ఓటమిపాలు కావడంతో ఎంతోమంది ఇండియన్ కాకుండా ఇతర దేశాల క్రికెటర్లు సైతం టీమిండియా పై విమర్శలు కురిపిస్తున్నారు.

ఈ సిరీస్ కి ముందు ఇండియా తప్పనిసరిగా కప్ అందుకుంటుందని ఎంతోమంది ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే చివరికి నిరాశతో వెనుతిరగాల్సి వచ్చింది. ఈ ఓటమిపై ఇండియన్ క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ స్పందించారు.ఈ సందర్భంగా ఆయన ఈ మ్యాచ్ గురించి మాట్లాడుతూ టీమ్ ఇండియాని చోకర్స్ అంటూ కామెంట్ చేశారు.

కపిల్ దేవ్ ఒక ఇంగ్లీష్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొని టీం ఇండియా పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే టీమ్ ఇండియాను చోకర్స్ అంటూ ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి అయితే చోకర్స్అంటే ఏంటి అనే విషయానికి వస్తే క్రికెట్ భాషలో టోర్నీలో కీలకమైన మ్యాచులలో అధిక ఒత్తిడిని తట్టుకోలేక ఓడిపోయే జట్టులను చోకర్స్ అంటారు.

Kapil Dev: విమర్శలు పాలవుతున్న టీమిండియా…


ఇలా ఈ పదాన్ని ఇదివరకు సౌత్ ఆఫ్రికాకు ఎక్కువగా ఉపయోగించేవారు. సౌత్ ఆఫ్రికా సైతం ఇలాంటి టోర్నమెంట్స్ లో ఫైనల్స్ వరకు వెళ్లి ఓటమితో వెనుతిరిగేది అయితే తాజాగా కపిల్ దేవ్ సైతం ఈ పదాన్ని టీమిండియాని ఉద్దేశిస్తూ చెప్పడంతో ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. టీమిండియా సైతం 2007 నుంచి నాలుగు సార్లు సెమీస్ కి చేరుకుంటే కేవలం ఒక్కసారి మాత్రమే కప్పు గెలిచిందని, ఇలా ఎక్కువసార్లు ఓటమిపాలు కావడంతో కపిల్ దేవ్ టీమ్ ఇండియాని చోకర్స్ అంటూ వ్యాఖ్యానించారు.

Kapil Dev: సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్…ట్వీట్ వైరల్!

Kapil Dev: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.భారత క్రికెట్ దేవుడిగా భావించే సచిన్ టెండూల్కర్ ప్రస్తుతం క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇకపోతే అర్జున్ టెండూల్కర్ క్రికెట్ కోసం ఎంతోమంది అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఆయన ఐపీఎల్ లో అయిన బ్యాట్ చేతపట్టి ఆడితే చూడాలని అభిమానులు ఆశపడుతున్నారు.

ఈ క్రమంలోనే 2021 ఐపీఎల్ మినీ వేలంలో అర్జున్ టెండూల్కర్ ను ముంబై ఇండియన్స్ 20 లక్షలకు కొనుగోలు చేసింది. కానీ ఆ సీజన్లో అర్జున్ టెండూల్కర్ కేవలం బెంజ్ కే పరిమితమయ్యారు పోనీ ఈ ఏడాది ఐపిఎల్ లో అయినా అర్జున్ టెండూల్కర్ బ్యాట్ చేత పడతానని ఎంతోమంది అభిమానులు ఆశ పడిన ఈ ఏడాది కూడా అభిమానుల ఆశ నెరవేరే లేదనే చెప్పాలి.

ఈ క్రమంలోనే అర్జున్ టెండూల్కర్ క్రికెట్ ఎంట్రీ గురించి భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ షాకింగ్ కామెంట్ చేశారు. అర్జున్ ఎంట్రీ గురించి కపిల్ దేవ్ మాట్లాడుతూ అర్జున్ ఇంకా చిన్న కుర్రాడే… ఒకవేళ అతను క్రికెట్ లో రాణించాలి అనుకుంటే తన తండ్రి ఆడిన ఆటలో కనీసం 50 శాతం ఆటతీరును కనబర్చిన సరిపోతుంది. పదేపదే అర్జున్ గురించి, అతనికి ఎంట్రీ గురించి మాట్లాడుతున్నారు.

నీ ఆట నువ్వు ఆడు…


ఆయన సచిన్ టెండూల్కర్ కొడుకు అయినప్పటికీ తనకి కాస్త స్వేచ్ఛ కావాలి. తన ఆటను తనని ఆడుకో నివ్వండి. అర్జున్ పేరు చివర టెండూల్కర్ అని ఉండటంతో అతనికి ఎన్ని లాభాలు ఉన్నాయో అన్ని నష్టాలు కూడా ఉన్నాయని ఈ సందర్భంగా కపిల్ దేవ్ తెలియజేశారు. ఆయన పేరు చివర టెండూల్కర్ అని ఉండటంతో అతను కూడా టెండూల్కర్ మాదిరి ఆట ఆడాలని అతనిపై ఒత్తిడి చేయకూడదు. అర్జున్ ఇంకా చిన్న కుర్రాడు. అర్జున్ కి చెప్పేది ఒకటే నీ ఆట నువ్వు ఆడు ఎవరి దగ్గర ప్రూఫ్ చేసుకోవాల్సిన పని లేదు. మీ నాన్న ఆడే ఆట తీరులో 50% ఆడిన చాలు అంటూ ఈ సందర్భంగా అర్జున్ టెండూల్కర్ గురించి కపిల్ దేవ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

Kapil Dev: మొదటి వరల్డ్ కప్ క్షణాలు మన కళ్ల ముందుకు..కపిల్ దేవ్ భావోద్వేగపూరిత వ్యాఖ్యలు..!

Kapil Dev: ఇండియాలో క్రికెట్ క్రేజ్ గురించి ప్రత్యేకం చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా 1983లో జరిగిన వరల్డ్ కప్ లో ఇండియా ఘన విజయం సాధించిన తర్వాత  ఈ క్రేజ్ మరింతగా పెరింగింది. ప్రస్తుతం 1983 లో వరల్డ్ కప్ బ్యాక్ డ్రాప్ లో  వస్తున్న మూవీ ’83‘ విడుదలకు సిద్ధమైంది. కపిల్‌ దేవ్‌గా రణ్‌వీర్‌ సింగ్, కపిల్‌ సతీమణి రూమీ భాటియాగా దీపికా పదుకోన్‌ నటించారు.

Kapil Dev: మొదటి వరల్డ్ కప్ క్షణాలు మన కళ్ల ముందుకు..కపిల్ దేవ్ భావోద్వేగపూరిత వ్యాఖ్యలు..!

1983జూన్ 25న జరిగిన వరల్డ్ కప్ పోటీలో ఇండియా విశ్వ విజేతగా నిలిచిపోవడం మరవలేని క్షణాలని క్రికెట్ లెజెండ్ కపిల్ దేశ్ అన్నారు. 38 ఏళ్ల తర్వాత ‘83’ ద్వారా మరోసారి ఆ క్షణాలను వెండితెరపై ప్రేక్షకులతో కలిసి చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. కబీర్ ఖాన్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌ సమర్పణలో 83 మూవీ నేడు విడుదల అవుతోంది.

Kapil Dev: మొదటి వరల్డ్ కప్ క్షణాలు మన కళ్ల ముందుకు..కపిల్ దేవ్ భావోద్వేగపూరిత వ్యాఖ్యలు..!

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ హైదరాబాద్లో జరిగింది. ప్రెస్ మీట్ లో హీరో నాగార్జున మాట్లాడుతూ.. 83లో నిజంగా కపిల్ దేవే నటించాడా.. అన్న రీతితో రణ్ వీర్ సింగ్ ఒదిగిపోయాడని పొగడ్తలు కురిపించారు. 83 హీరో రణ్ వీర్ సింగ్ మాట్లాడుతప.. కపిల్ దేవ్ లాంటి లెజెండ్ పాత్ర చేయడం గర్వంగా ఉందన్నారు. మాజీ క్రికెటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో నా పాత్రను జీవా అద్భుతంగా చేశారని అన్నారు

రణ వీర్ సింగ్,దీపికా 83:

మరో ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పకొచ్చారు శ్రీకాంత్.. నాగార్జున నేను ఇంజనీరింగ్ లో క్లాస్ మెట్స్ .. కాలేజీలో సైలెంట్ గా ఉన్న నాగ్.. శివతో వైలెంట్ ట్రెండ్ సెట్ చేశారన్నారు. చిత్ర దర్శకుడు కబీర్ ఖాన్ మాట్లాడుతూ.. ఈసినిమా కోసం కపిల్ తో పాటు అప్పటి టీం ను కలిసి సలహాలు తీసుకున్నామన్నారు. 1983లో వరల్డ్ కప్ గెలుచుకున్న తర్వాత క్షణాలను, పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపించామన్నారు. ముఖ్యంగా నేటి యువతరం చూడాల్సిన సినిమా అన్నారు

కపిల్ దేవ్, సారికల బ్రేకప్ లవ్ స్టోరీ తెలుసా..? ఎన్ని మలుపులో..

కపిల్ దేవ్.. క్రికెట్ ప్రేమికులకు సుపరిచితమైన పేరు. 1959లో జన్మించిన కపిల్.. ప్రస్తుతం హర్యానాలో ఉంటున్నారు. అతడు 1979 లో రోమీ భాటియాతో పరిచయం ఏర్పడి.. 1980లో వివాహం చేసకున్నాడు. ఆ దంపతులకు కూతురు అమియాదేవ్ పుట్టింది. కపిల్ దేవ్ కు మొదట ఓ ప్రేమాయాణం నడిచిందట. అదేంటో.. ఆ విషయాలను తెలుసుకుందాం.. బాలీవుడ్ బ్యూటీ సారిక అందరికీ తెలిసిందే. ఒక రోజు ఓ పార్టీలో సారికను కపిల్ దేవ్ కు పరిచయం చేసింది.. వెటరన్ స్టార్ మనోజ్ కుమార్ భార్య. అలా వారి స్నేహం మొదలై ప్రేమగా మారింది.

ఇక వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు హల్ చల్ చేశాయి. ఈ నేపథ్యంలో అతడు ఓ రోజు సారికను తన ఇంటికి తీసుకెళ్లాడు. తల్లిదండ్రులకు పరిచయం చేశాడు. ఇక పెళ్లి చేసుకోవడమే.. తరువాయి అనుకున్నారు. కానీ అతడు సారికతో బంధాన్ని తెంచుకున్నాడు. ఎందుకంటే.. దీని కంటే ముందు జరిగిన ఘటన తెలుసుకోవాలి..

అదేంటంటే.. సారిక కపిల్ తో పరిచయం కాకుముందే కపిల్ కు రోమీ భాటియాకు మధ్య ప్రేమాయాణం నడిచింది. సునీల్ భాటియానే రోమీని.. కపిల్ కు పరిచయం చేశారు. ఆ రోజు నుంచి ఇద్దరు స్నేహం చేసి.. ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఇలా వారిద్దరి మధ్యలో కొన్ని రోజులకు మనస్పర్థలు వచ్చాయి. ఆమె మీద కోపంతోనే సారికకు దగ్గరయ్యాడని.. కపిల్ స్నేహితులు చెప్పారు. అయితే రోమీతో అప్పటికే లవ్ లో ఉన్న కపిల్ .. సారిక ను పక్కన పెట్టేశాడు.

వీళ్లిద్దరి మధ్య లవ్ నడుస్తున్నట్లు వార్తలు రావడంతో.. ఇక వదిలేస్తే తనకు దక్కకుండా పోతాడనే భావనతో మళ్లీ కపిల్, రోమీ ఒక్కటయ్యారని చెప్పారు. ఇంత జరిగిందా అంటూ.. విషయం తెలుసుకొని సారిక బాధ పడిందట. కపిల్ దేవ్ తన లవ్ ప్రపోజల్ ను ఒక ట్రైన్ లో చెబుతాడు. కిటికీలోంచి ఒక అందమైన ప్రదేశాన్ని చూపిస్తే.. ఇక్కడ నా ఫొటో తీస్తావా.. భవిష్యత్ లో మన పిల్లలకు ఈ ఫొటోలోని ప్రదేశాన్ని చూపించొచ్చు అనగానే ఆమెకు కపిల్ లవ్ చేస్తున్నట్లు అర్థం అయిపోంది. ఇక 1980లో వీళ్లు వివాహ బంధంతో దగ్గర అయ్యారు.