Tag Archives: Kavya Kalyan Ram

Kavya Kalyan Ram: తెలుగమ్మాయి కావడమే నాకు ప్లస్ అయింది.. కావ్య కళ్యాణ్ రామ్ కామెంట్స్ వైరల్!

Kavya Kalyan Ram: హీరో శ్రీ సింహ కోడూరి కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ఉస్తాద్. ఈ సినిమాలో శ్రీ సింహ కావ్యా కళ్యాణ్ రామ్ హీరో హీరోయిన్లుగా నటించారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆగస్టు 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో భారీ స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి కావ్య కళ్యాణ్ రామ్ ఈ సినిమా గురించి ఎన్నో విశేషాలను అభిమానులతో పంచుకున్నారు.

ఈ సందర్భంగా కావ్య కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ ఉస్తాద్ సినిమాకథపై మాకు ఎంతో నమ్మకం ఉంది. ఈ సినిమా తప్పకుండా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని ఈమె ఆశాభావం వ్యక్తం చేశారు .ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా పలు కాలేజీలకు వెళ్ళగా అక్కడ మాకు భారీ స్థాయిలో స్పందన లభించిందని తెలియజేశారు. ఇక ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తెలుగు హీరోయిన్స్ గురించి కావ్య మాట్లాడుతూ పలు విషయాలను తెలియచేశారు. తెలుగు వారికి హీరోయిన్గా అవకాశాలు రాలేదన్న వార్త ఇండస్ట్రీలో తరచూ వినపడుతూనే ఉంటుంది.

ఇలా తెలుగు వారికి సినిమా అవకాశాలు ఉండవు అనే విషయం గురించి తాజాగా కావ్య కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ…ఇలా తెలుగువారికి హీరోయిన్గా అవకాశాలు రావడంలేదని ఎందుకు అంటున్నారో నాకైతే అర్థం కాలేదని తెలిపారు.ఎందుకంటే సావిత్రి శ్రీదేవి వంటి ఎంతో గొప్ప నటీమణులు కూడా తెలుగు వారే ఇండియాలో ఇప్పటికీ వీరికన్నా అద్భుతంగా నటించిన, వీరికన్నా అద్భుతమైన సక్సెస్ చూసినటువంటి నటీమణులు లేరు.

Kavya Kalyan Ram: ఓకే భాషకే పరిమితం కాకూడదు…


ఇక నా విషయానికి వస్తే నేను తెలుగు అమ్మాయి కావడం నా అదృష్టం. నేను చేసిన మూడు సినిమాలలోని దర్శకులు కూడా తెలుగు అమ్మాయి అయితే బాగుంటుందని ఆ సినిమాలకు నన్ను ఎంపిక చేశారు. భాష వస్తే చాలు అవకాశం వస్తుందనుకోవడం పొరపాటు.నటీనటులు ఎప్పుడూ కూడా ఒకే భాషకు పరిమితం కాకూడదు అంటూ ఈ సందర్భంగా కావ్య కళ్యాణ్ రామ్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Kavya Kalyan Ram: బలగం సినిమా హీరోయిన్ చిరంజీవి సినిమాలో నటించిన మీకు తెలుసా?

Kavya Kalyan Ram: బలగం సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నటి కావ్య కళ్యాణ్ రామ్.బాలనటిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈమె మసూద్ సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అనంతరం బలగం సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.అయితే ఈమె హీరోయిన్ కాకముందు ఇండస్ట్రీలో బాలనటిగా పలు సినిమాలలో నటించి సందడి చేశారు.

అల్లు అర్జున్ హీరోగా నటించిన గంగోత్రి సినిమాలో నటించిన కావ్య కళ్యాణ్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సినిమాలలో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. అలాగే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన సినిమాలో కూడా తాను చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించానని తెలియజేశారు.

మరి ఈమె మెగాస్టార్ చిరంజీవి నటించిన ఏ సినిమాలో నటించారు అనే విషయానికి వస్తే..వివి వినాయక్ దశకత్వంలో మెగాస్టార్ చిరంజీవి శ్రేయ, జ్యోతిక నటించిన చిత్రం ఠాగూర్. ఈ సినిమా అప్పట్లో ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే.
ఇక ఈ సినిమాలోచిరంజీవి కొంతమంది పిల్లలను తన దగ్గర పెంచుకుంటూ ఉంటారు వీరిలో ఒకరిగా నటించారు.

Kavya Kalyan Ram:పిల్లి కళ్ళు అంటూ గుర్తుపట్టారు…

తాజాగా చిరంజీవి గారిని కలిసినప్పుడు ఒకసారి నేను మీ సినిమాలో నటించాను గుర్తుపట్టారా అని అడగగానే వెంటనే ఆయన పిల్లి కళ్ళు అంటూ తనని గుర్తుపట్టారని అప్పుడే ఇంత పెద్ద వాళ్ళు అయిపోయారు మిమ్మల్ని చూస్తుంటే మాకు వయసు అయిపోయింది అనిపిస్తుందనీ అన్నారని కావ్య తెలిపారు.ఇలా ఈమె మెగాస్టార్ నటించిన ఠాగూర్ సినిమాలో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు ఇక మసూద్ సినిమా ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.

Balagam Movie: మొదటి రోజే కాపీ వివాదాలను ఎదుర్కొంటున్న బలగం… అసలు ఈ బలగం కథ ఎవరిదీ!

Balagam Movie: సాధారణంగా కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాలుగా విడుదలై మంచి విజయాలను అందుకుంటాయి. అలాగే కొన్ని సినిమాలు విడుదలైన తర్వాత పెద్ద ఎత్తున కాపీ వివాదాలను కూడా ఎదుర్కొంటున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే చిన్న సినిమాగా విడుదలై ఎంతో మంచి విజయాన్ని అందుకున్నటువంటి బలగం సినిమా మొదటి రోజే కాపీ వివాదంలో చిక్కుకుంది.

జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకుడిగా మారి ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ జంటగా దిల్ రాజు నిర్మాణంలో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి చిత్రం బలగం. తెలంగాణ యాసలో రూపొందిన ఈ చిత్రం విడుదలకు ముందే ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. ఇలా విడుదలైన అనంతరం ఈ సినిమా అంచనాలను చేరుకోవడమే కాకుండా కాపీ వివాదాలను కూడా ఎదుర్కొంటుంది.

బలగం సినిమా కథ నాదేనని నా కథను కాపీ కొట్టి ఈ సినిమా చేశారు అంటూ ప్రముఖ జర్నలిస్ట్ గడ్డం సతీష్ ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొని ఈ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా గడ్డం సతీష్ మాట్లాడుతూ 2011వ సంవత్సరంలో తాను పచ్చికి అనే కథను రాసాను. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ యాసకు నిరాధారణకు గురికావడంతో.. ఈ కథ ప్రచూరణకు నోచుకోలేదు.

అప్పటి నుంచి నేను తెలంగాణ యాసలో కథలు రాయాలని నిర్ణయించుకున్నాను.2014వ సంవత్సరంలో నమస్తే తెలంగాణ పత్రికలో బతుకమ్మ మ్యాగ్జైన్లో అచ్చు వేసారని ఈయన తెలిపారు. ఇక ఈ కథ ఏంటి అనే విషయానికి వస్తే గత కొన్ని దశాబ్దాలుగా మనుషులు వ్యవహరిస్తున్నటువంటి సాంప్రదాయాల విషయానికి వస్తే ఒక మనిషి చనిపోతే ఆయన చనిపోయిన మూడవరోజు ఐదవ రోజు 11వ రోజు కర్మలు చేస్తుంటారు. ఇందులో భాగంగా పక్షులకు ఆహారం పెడతారు.

Balagam Movie: బలగం సినిమా క్రెడిట్ నాకే ఇవ్వాలి…

ఇలా పెట్టినటువంటి ఆహారాన్ని కాకులు వచ్చి కనుక తింటే చనిపోయిన వ్యక్తి ఆత్మ శాంతిస్తుందని విశ్వసిస్తారు. ఇప్పటికీ ఇదే ఆచారాన్ని ఫాలో అవుతూ చనిపోయిన ప్రతి ఒక్క వ్యక్తి కర్మకాండలో ఇలా చేస్తూ ఉంటారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కథ రాశానని అయితే నేను రాసిన ఈ కథని 90% బలగం సినిమాలో పెట్టి 10% మాత్రమే మార్పులు చేశారు అంటూ గడ్డం సతీష్ ఆరోపించారు.ఈ విషయంపై దిల్ రాజు చొరవ చూపించి ఈ కథ క్రెడిట్ మొత్తం తనకు ఇప్పించాలని అలాకాని పక్షంలో తాను చట్టపరంగా ముందుకు వెళ్తానంటూ సతీష్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.