Tag Archives: kitchen

Nagarjuna: నాగార్జునకు కోపం వస్తే అలాంటి పని చేస్తారా… నాగార్జున సీక్రెట్ బయటపెట్టిన అఖిల్!

Nagarjuna: టాలీవుడ్ నటు సామ్రాట్ అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాగార్జున ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మన్మధుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని ఎంతో మంది మహిళ అభిమానులను సొంతం చేసుకున్నారు.. ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఇప్పటికి పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

మరోవైపు బిగ్ బాస్ కార్యక్రమానికి కూడా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.ఇక నాగార్జునను మనం ఎలాంటి పరిస్థితులలో చూసిన ఆయన మొహంపై చిరునవ్వు ప్రశాంతత మాత్రమే కనబడుతూ ఉంటాయి. ఎప్పుడు కూడా తాను సీరియస్ గా అయినటువంటి సందర్భాలను కూడా మనం చూడలేదు.ఇలా ఎప్పుడు సరదాగా ఉండే నాగార్జునకు కోపం వస్తే ఊహించని విధంగా రియాక్ట్ అవుతారని తెలుస్తుంది.

ఎప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉండే నాగార్జునకు కూడా కోపం వస్తుందా అన్న సందేహాలను నెటిజన్స్ వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈయన కూడా మనిషే కదా తనకు కూడా కోపం వస్తుందని ఆ కోపం వస్తే నాగార్జున ఏం చేస్తారో అనే విషయాలను ఒకానొక సందర్భంలో అఖిల్ బయట పెట్టారు.ఈ సందర్భంగా అఖిల్ తన తండ్రి కోపం గురించి మాట్లాడుతూ నాన్నకు కోపం వస్తే ఆయన వెంటనే కిచెన్లోకి వెళ్లిపోతారని తెలిపారు.

Nagarjuna: నాన్నకు కోపం వస్తే వంట వండుతారు..

ఇలా కిచెన్ లోకి వెళ్లి వివిధ రకాల ఆహార పదార్థాలను తయారు చేస్తారని నాన్న చాలా అద్భుతంగా కుకింగ్ చేస్తారు అంటూ అఖిల్ తెలియజేశారు. ఇక తాను ఎప్పుడైనా షూటింగ్ నుంచి ఇంటికి వచ్చే సమయానికి నాన్న కిచెన్ లో ఉన్నారు అంటే ఇంట్లో ఏదో జరిగిందని అందుకే నాన్న సీరియస్ గా ఉన్నారని తనకు అర్థమయ్యే కొంత సమయం పాటు నాన్నతో ఏమీ మాట్లాడమని ఈ సందర్భంగా తెలియజేశారు.

Chiranjeevi: సురేఖ కారణంగా సొంత ఇంట్లోనే దొంగగా మారిన చిరు… అసలేం జరిగిందంటే?

Chiranjeevi: సాధారణంగా ప్రతి ఒక్కరికి ప్రతి విషయంలోను చిన్న చిన్న కోరికలు ఉంటాయి అయితే ఆ కోరికలు తీరకపోతే చాలా నిరుత్సాహ పడుతుంటారు. ఇలా కొందరి కారణంగా కొందరు పెట్టే రిస్ట్రిక్షన్స్ వల్ల చిన్న చిన్న కోరికలను కూడా తీర్చుకోలేనటువంటి వారు ఆ కోరికలను తీర్చడం కోసం ఎప్పుడూ చేయని పనులను చేయాల్సి వస్తుంది. ఇలా చిన్న కోరికను తీర్చడం కోసం మెగాస్టార్ చిరంజీవి కూడా దొంగగా మారాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇండస్ట్రీని శాసించే మెగాస్టార్ చిరంజీవి దొంగగా మారాల్సిన అవసరం ఏంటి ఆయన చిటికేస్తే ఏదైనా ఆయన ముందు వాలుతుంది. అలాంటిది చిరంజీవి దేనికోసం దొంగగా మారారు అన్న సందేహం అందరిలోనూ కలుగుతుంది. మరి చిరంజీవి దొంగగా మారడానికి కారణం ఏంటో ఇక్కడ తెలుసుకుందాం…సినిమా హీరోలు ఎప్పుడు ఆకర్షణ గాను చాలా ఫీట్ గా ఉంటేనే వారికి అవకాశాలు వస్తాయి ఈ క్రమంలోనే చాలామంది కఠినమైన డైట్ ఫాలో అవుతూ ఉంటారు.

ఇక చిరంజీవి ఫుడ్ విషయంలో అసలు కంట్రోల్ చేసుకోరట ముఖ్యంగా గులాబ్ జామ్ కనుక కనపడితే తాను ఒక హీరో అన్న విషయం కూడా మరిచిపోయి ఫుల్లుగా లాగించేస్తారు.అయితే గులాబ్ జామ్ చేసినప్పుడు మాత్రం సురేఖ చిరంజీవిని చాలా కంట్రోల్లో పెడతారట ఆయనకు కేవలం రెండు మూడు జామున్స్ మాత్రమే ఇస్తారని తెలుస్తోంది.

Chiranjeevi: సొంత ఇంట్లోనే దొంగగా మారిన చిరు…


ఇలా తనకెంతో ఇష్టమైనటువంటి ఈ గులాబ్ జామ్ తినడం కోసం అందరూ పడుకున్న తర్వాత అర్ధరాత్రి కిచెన్లోకి వెళ్లి మనస్ఫూర్తిగా గులాబ్ జామ్స్ తింటారట ఇలా గులాబ్ జామ్ తినడానికి ఈయన దొంగగా మారిపోయారు.అయితే అర్ధరాత్రి పూట దొంగచాటుగా చిరంజీవి గులాబ్ జామ్స్ తింటారు అన్న విషయం సురేఖకు తెలిసినప్పటికీ తెలియనట్టుగానే ఉంటారట.

వాస్తు శాస్త్రం ప్రకారం కిచెన్ లో సింక్ ఈ దిశలో అస్సలు ఉండకూడదు..!

మన భారతీయులు ఎన్నో ఆచార వ్యవహారాలను మాత్రమే కాకుండా వాస్తు శాస్త్రాన్ని ఎంతో బలంగా నమ్ముతారు. ఈ క్రమంలోనే మనం చేసే ప్రతి పనిని అదే విధంగా మనం ఇంటి నిర్మాణం చేపట్టిన కూడా తప్పనిసరిగా వాస్తు చూసి వాస్తు ప్రకారమే నిర్మాణాన్ని చేపడతారు. ఈ క్రమంలోనే వాస్తు పరంగా ఇంటిని నిర్మించడమే కాకుండా ఇంటిలో అలంకరించుకుని వస్తువులను కూడా వాస్తు ప్రకారమే అలంకరించుకుంటారు.

ఈ విధంగా మన ఇంట్లో వాస్తును అనుసరించడం వల్ల ఇంట్లోకి వచ్చిన నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్లి ఇంట్లో పాజిటివ్ వాతావరణం ఏర్పడుతుంది. తద్వారా కుటుంబంలో ఎలాంటి కలహాలు గొడవలు లేకుండా ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా హాయిగా ఆనందంగా గడపవచ్చు.ఈ క్రమంలోనే మన ఇంట్లో కిచెన్ ఏ విధంగా ఉండాలి కిచెన్ లో ఏ వస్తువు ఎక్కడ ఉండాలి అనే విషయాలను గురించి ఇక్కడ తెలుసుకుందాం..

ప్రతి ఒక ఇంటిలో వంట గది ఎంతో అవసరమైనది అని చెప్పవచ్చు. మరి వంటగదిని ఏ విధంగా నిర్మించాలి వంటగదిలో ఏ వస్తువులను ఎక్కడ ఉంచాలి అనే విషయానికి వస్తే వంటగదిలో ఎప్పుడూ కూడా మనం ఏర్పాటు చేసుకున్న సింక్ వంట గ్యాస్ పక్కన ఉండకూడదు. ఈ విధంగా ఉండటం వల్ల మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీని గ్రహిస్తుంది. అదేవిధంగా వంటగదిలో ఎల్లప్పుడూ చీకటి ప్రదేశాలలో కూరగాయలను ఉంచకూడదు.అలాగే గది మూలాలలో కూడా కూరగాయలు నిల్వ చేసుకోకూడదని వాస్తుశాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా మన ఇంటిలో ఉన్న వైబ్రేషన్స్ అన్ని వంటగదిలో ఎక్కువగాఉంటాయి కనుక వంటగదిలో గాలి, అగ్ని, వెలుతురు,నీరు సమానంగా ఉండేలా చూసుకోవాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.