Tag Archives: Kushi Movie

Kushi Movie: నిఖిల్ 18 పేజస్ కలెక్షన్లపై దెబ్బ కొట్టిన పవన్ ఖుషి చిత్రం… భారీగా పడిపోయిన కలెక్షన్స్!

Kushi Movie: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ నటించిన తాజా చిత్రం 18 పేజెస్. ఈ సినిమా డిసెంబర్ 23వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇదే రోజే రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చి రెండు సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. అయితే నిఖిల్ 18 పేజస్ సినిమా కార్తికేయ 2 రేంజిలో కలెక్షన్లను రాబట్టుకోలేకపోయింది.

ఇలా 18 పేజీ సినిమా 13 కోట్ల టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలో దిగింది. అయితే ఈ సినిమా 11 రోజులు పూర్తయ్యేసరికి వరల్డ్ వైడ్ గా రూ.9.73 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.ఈ క్రమంలోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే మరో కోటి రూపాయలకు పైగా కలెక్షన్లు రాబట్టాల్సి ఉంది. కానీ ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధిస్తుంది అనుకునే లోపు పవన్ కళ్యాణ్ సినీ కెరియర్లో క్లాసికల్ హిట్ సినిమాగా నిలిచిన ఖుషి సినిమా విడుదల అయింది.

ఈ సినిమా డిసెంబర్ 31వ తేదీ పలు థియేటర్లలో రీ రిలీజ్ అయినప్పటికీ రూ.6 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను రాబట్టింది.ఇలా ఖుషి సినిమా విడుదల కావడంతో నిఖిల్ 18 పేజీ సినిమాపై కోలుకోలేని దెబ్బ పడిందని తద్వారా ఈ సినిమా కలెక్షన్లు మొత్తం భారీగా పడిపోయాయని చెప్పాలి.ఒకవేళ ఖుషి సినిమా విడుదల కాకుండా ఉంటే ఈ సినిమాకు వచ్చే కలెక్షన్లన్నీ కూడా 18 పెజస్ సినిమాకు వచ్చి చాలా సునాయసంగా బ్రేక్ ఈవెన్ సాధించేదని పలువురు భావిస్తున్నారు.

Kushi Movie: 18 పేజీస్ కలెక్షన్ల పై ప్రభావం చూపిన ఖుషి…

ఇకపోతే ఈ వారంలో నైనా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందని భావించినప్పటికీ మహేష్ బాబు హీరోగా నటించిన ఒక్కడు సినిమా రీ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రభావం కూడా నిఖిల్ 18 పేజెస్ సినిమాపై పడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఏదిఏమైనా 18 పేజీస్ సినిమా కార్తికేయ 2రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అలాగే కమర్షియల్ గా కూడా ఈ సినిమా కార్తికేయ 2రేంజ్ లో కలెక్షన్లను సాధించలేకపోయిందని చెప్పాలి.