Kushi Movie: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ నటించిన తాజా చిత్రం 18 పేజెస్. ఈ సినిమా డిసెంబర్ 23వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇదే రోజే రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చి రెండు సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. అయితే నిఖిల్ 18 పేజస్ సినిమా కార్తికేయ 2 రేంజిలో కలెక్షన్లను రాబట్టుకోలేకపోయింది.
ఇలా 18 పేజీ సినిమా 13 కోట్ల టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలో దిగింది. అయితే ఈ సినిమా 11 రోజులు పూర్తయ్యేసరికి వరల్డ్ వైడ్ గా రూ.9.73 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.ఈ క్రమంలోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే మరో కోటి రూపాయలకు పైగా కలెక్షన్లు రాబట్టాల్సి ఉంది. కానీ ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధిస్తుంది అనుకునే లోపు పవన్ కళ్యాణ్ సినీ కెరియర్లో క్లాసికల్ హిట్ సినిమాగా నిలిచిన ఖుషి సినిమా విడుదల అయింది.
ఈ సినిమా డిసెంబర్ 31వ తేదీ పలు థియేటర్లలో రీ రిలీజ్ అయినప్పటికీ రూ.6 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను రాబట్టింది.ఇలా ఖుషి సినిమా విడుదల కావడంతో నిఖిల్ 18 పేజీ సినిమాపై కోలుకోలేని దెబ్బ పడిందని తద్వారా ఈ సినిమా కలెక్షన్లు మొత్తం భారీగా పడిపోయాయని చెప్పాలి.ఒకవేళ ఖుషి సినిమా విడుదల కాకుండా ఉంటే ఈ సినిమాకు వచ్చే కలెక్షన్లన్నీ కూడా 18 పెజస్ సినిమాకు వచ్చి చాలా సునాయసంగా బ్రేక్ ఈవెన్ సాధించేదని పలువురు భావిస్తున్నారు.
ఇకపోతే ఈ వారంలో నైనా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందని భావించినప్పటికీ మహేష్ బాబు హీరోగా నటించిన ఒక్కడు సినిమా రీ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రభావం కూడా నిఖిల్ 18 పేజెస్ సినిమాపై పడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఏదిఏమైనా 18 పేజీస్ సినిమా కార్తికేయ 2రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అలాగే కమర్షియల్ గా కూడా ఈ సినిమా కార్తికేయ 2రేంజ్ లో కలెక్షన్లను సాధించలేకపోయిందని చెప్పాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…