Tag Archives: Lord Virupaksheswara

Puneeth Raj Kumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మాల ధరించనున్న అభిమానులు… వైరల్ అవుతున్న న్యూస్!

Puneeth Raj Kumar: కన్నడ దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటుడిగా మాత్రమే కాకుండా మంచి మనసున్న వ్యక్తిగా ఎందరికో ఎన్నో సహాయ సహకారాలు చేస్తూ మంచి మనసున్న వ్యక్తిగా పేరు సంపాదించుకున్న పునీత్ రాజ్ కుమార్ 2021 అక్టోబర్ 29వ తేదీ గుండెపోటుతో మరణించిన విషయం మనకు తెలిసిందే. ఇలా ఈయన మరణ వార్త నుంచి ఇప్పటికి కన్నడ అభిమానులు బయటపడలేకపోతున్నారు.

ఇక మార్చి 17వ తేదీ పునీత్ రాజ్ కుమార్ పుట్టినరోజు కావడంతో అభిమానులు సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. పునీత్ రాజ్ కుమార్ కేవలం హీరోగా మాత్రమే కాకుండా ఎందరికో ఎన్నో విధాలుగా సహాయం చేయడంతో కన్నడ నాట అభిమానులు ఈయనని దేవుడిగా భావించారు. దీంతో ఈయన పుట్టినరోజు సందర్భంగా మార్చి 1వ తేదీ నుంచి 17వ తేదీ వరకు అభిమానులు అప్పు మాల ధరించాలని భావించారు. ఈ క్రమంలోనే ఓ కరపత్రం కూడా విడుదల చేశారు.

హోస్పేటలోని పునీత్ రాజ్‌కుమార్ సర్కిల్‌లో పూలమాలలు ధరించి, వ్రతాన్ని ఆచరించి, ప్రత్యేక పూజలు చేసి, మార్చి 18న ఆయన మందిరానికి వెళ్లి దర్శనం చేసుకున్న తర్వాత హంపి పుణ్య నదిలో స్నానం ఆచరించి అనంతరం విరూపాక్షేశ్వర స్వామికి పూజలు చేసి పూలమాల వేయాలని కరపత్రంలో సూచించారు. దీంతో పాటు మాల వేసుకున్న తర్వాత ఎలాంటి నియమాలను పాటించాలో కూడా ఇందులో పేర్కొన్నారు.


Puneeth Raj Kumar: అప్పు మాల దీక్షలో అభిమానులు….

అప్పు పై ఉన్న అభిమానంతో కొందరు 11 రోజులపాటు కొందరు ఐదు రోజులపాటు లేదా ఒక్కరోజు పాటు కూడా మాల ధరించవచ్చని సూచించారు. ఈ మాల ధరించిన వారు కాషాయపు రంగు చొక్కా పంచె కండువా ధరించాలి.ఉదయం సూర్యోదయానికి ముందు సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత తప్పనిసరిగా స్నానం చేసి ఆయన ఫోటోకి పూజ చేసుకున్న అనంతరమే వారి అల్పాహారం చేయాలని తెలిపారు.
ఈ విధంగా అప్పు మాల ధరించినటువంటి భక్తులు ఎవరు కూడా చెడు అలవాట్ల అంటే మద్యం తాగడం, సిగరెట్ కాల్చడం, మాంసం తినడం వంటివి చేయకూడదని సూచించారు.