Puneeth Raj Kumar: కన్నడ దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటుడిగా మాత్రమే కాకుండా మంచి మనసున్న వ్యక్తిగా ఎందరికో ఎన్నో సహాయ సహకారాలు చేస్తూ మంచి మనసున్న వ్యక్తిగా పేరు సంపాదించుకున్న పునీత్ రాజ్ కుమార్ 2021 అక్టోబర్ 29వ తేదీ గుండెపోటుతో మరణించిన విషయం మనకు తెలిసిందే. ఇలా ఈయన మరణ వార్త నుంచి ఇప్పటికి కన్నడ అభిమానులు బయటపడలేకపోతున్నారు.
ఇక మార్చి 17వ తేదీ పునీత్ రాజ్ కుమార్ పుట్టినరోజు కావడంతో అభిమానులు సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. పునీత్ రాజ్ కుమార్ కేవలం హీరోగా మాత్రమే కాకుండా ఎందరికో ఎన్నో విధాలుగా సహాయం చేయడంతో కన్నడ నాట అభిమానులు ఈయనని దేవుడిగా భావించారు. దీంతో ఈయన పుట్టినరోజు సందర్భంగా మార్చి 1వ తేదీ నుంచి 17వ తేదీ వరకు అభిమానులు అప్పు మాల ధరించాలని భావించారు. ఈ క్రమంలోనే ఓ కరపత్రం కూడా విడుదల చేశారు.
హోస్పేటలోని పునీత్ రాజ్‌కుమార్ సర్కిల్‌లో పూలమాలలు ధరించి, వ్రతాన్ని ఆచరించి, ప్రత్యేక పూజలు చేసి, మార్చి 18న ఆయన మందిరానికి వెళ్లి దర్శనం చేసుకున్న తర్వాత హంపి పుణ్య నదిలో స్నానం ఆచరించి అనంతరం విరూపాక్షేశ్వర స్వామికి పూజలు చేసి పూలమాల వేయాలని కరపత్రంలో సూచించారు. దీంతో పాటు మాల వేసుకున్న తర్వాత ఎలాంటి నియమాలను పాటించాలో కూడా ఇందులో పేర్కొన్నారు.
అప్పు పై ఉన్న అభిమానంతో కొందరు 11 రోజులపాటు కొందరు ఐదు రోజులపాటు లేదా ఒక్కరోజు పాటు కూడా మాల ధరించవచ్చని సూచించారు. ఈ మాల ధరించిన వారు కాషాయపు రంగు చొక్కా పంచె కండువా ధరించాలి.ఉదయం సూర్యోదయానికి ముందు సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత తప్పనిసరిగా స్నానం చేసి ఆయన ఫోటోకి పూజ చేసుకున్న అనంతరమే వారి అల్పాహారం చేయాలని తెలిపారు.
ఈ విధంగా అప్పు మాల ధరించినటువంటి భక్తులు ఎవరు కూడా చెడు అలవాట్ల అంటే మద్యం తాగడం, సిగరెట్ కాల్చడం, మాంసం తినడం వంటివి చేయకూడదని సూచించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…