Movie News

Actress Shanthi Priya: పెళ్లి చేసుకోవడం వల్లే సినిమాలకు దూరమయ్యాను… నటి శాంతి ప్రియ షాకింగ్ కామెంట్స్!

Actress Shanthi Priya: ప్రముఖ నటి భానుప్రియ సోదరిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు నటి శాంతి ప్రియ.మహర్షి సినిమాతో తెలుగులోకి వచ్చినటువంటి ఈమె ఎన్నో సినిమాలలో నటించి మెప్పించారు. కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా తమిళం బాలీవుడ్ సినిమాలలో కూడా నటించి మెప్పించారు.

ఇలా ఇండస్ట్రీలో నటిగా ఎంతో బిజీగా గడుపుతున్న సమయంలో ఈమె ఇండస్ట్రీకి దూరమయ్యారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి శాంతి ప్రియ తన వ్యక్తిగత విషయాల గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా శాంతి ప్రియ మాట్లాడుతూ తాను కేవలం సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా పనిచేశానని తెలిపారు.

బాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు ఏడాదిన్నర పాటు ఐదు సినిమాలలో నటించానని ఆ సమయంలోనే తాను సిద్ధార్థ్ రాయ్ తో ప్రేమలో పడ్డానని తెలిపారు.ఇలా ప్రేమలో ఉన్న తామిద్దరం పెళ్లి చేసుకున్నామని పెళ్లి తర్వాత తాను సినిమాలలో నటించకూడదని తనకి ఎవరు ఎలాంటి కండిషన్లు పెట్టలేదని అయితే తానే గృహిణిగా ఉండటం కోసం పెళ్లి తర్వాత సినిమాలకు దూరమయ్యానని తెలిపారు.


Actress Shanthi Priya: భర్త మరణం తర్వాత షాక్ లో ఉండిపోయా…

ఇక నా భర్త చనిపోయిన తర్వాత నేను పెద్ద షాక్ లో ఉండిపోయాను. నాకు ముంబైలో ఎవరూ తెలియదు అందుకే ఇంటి నుంచి బయటకు వచ్చేదాన్ని కాదు ఆ సమయంలో తన అక్క తల్లి సోదరుడు తనకు ఎంతో మద్దతుగా నిలబడ్డారు. అయితే వాళ్ళు చెన్నైకి రమ్మని చెప్పినప్పటికీ తాను మాత్రం ఎవరి అండదండలు లేకుండా ఒంటరి మహిళగా బతుకుతున్నటువంటి అమ్మను చూసి ఎంతో ధైర్యం తెచ్చుకొని తన కాళ్లపై తాను నిలబడాలని నిర్ణయించుకున్నాను. ఇక చాలా కాలం తర్వాత ధారవి బ్యాంక్ అనే వెబ్ సిరీస్ ద్వారా రీఎంట్రీ ఇచ్చానని తెలిపారు. ఇక తనకు వెంకటేష్ తో నటించాలని కోరికగా ఉండేది కానీ ఆ కోరిక నెరవేరే లేదని తెలిపారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago