Tag Archives: Lottery ticket

Lucky Person: పెయింటర్ ను వరించిన అదృష్టం..! రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు..! ఎలా అంటే.. !

Lucky Person: లక్ ఉండాలే కానీ.. అరటి పండు కూడా బంగారం అవుతుంది అంటారు. ఒక వేళ అదృష్టం లేకపోతే.. అదే అరటిపండి తింటే పన్ను ఇరుగుతుంది అనేది పెద్దలు చెబుతున్న మాట. ఇలా అదృష్టం అనేది ఎవరిని, ఎప్పుడు ఎలా వరిస్తుందో చెప్పలేం. అలాంటిది ఓ వ్యక్తికి లాటరీ రూపంలో లచ్చిందేవి వచ్చిపడింది. అసలు ఆ కథేంటో తెలుసుకుందాం.

Lucky Person: పెయింటర్ ను వరించిన అదృష్టం..! రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు..! ఎలా అంటే.. !

మన దేశంలో లాటరీల ద్వారా డబ్బులు రావడం అనేవి తక్కువ కానీ.. విదేశాల్లో ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిన వాళ్లు ఎంతో మంది ఉన్నారు. ముఖ్యంగా అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల్లో ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. వారి బిజినెస్ కు సంబంధించి ప్రమోషన్ల కోసం ఇలాంటివి పెడుతుంటారు.

అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో జూదం, లాటరీలాంటికి నిషేధించారు. కానీ మహారాష్ట్ర, బిహార్, కేరళ లాంటి రాష్ట్రాల్లో ఇలాంటి లాటరీలు పెడుతుంటారు. లాటరీ టికెట్లను బహిరంగంగానే అమ్ముతుంటారు. ఇలా లాటరీ టికెట్ తగిలి ఎంతో మంది రిక్షావాలాలు, డ్రైవర్లు కోటీశ్వరులు అయ్యారు. తాజాగా అదే లాటరీ టికెట్ కేరళకు చెందిన ఓ పెయింటర్‌ను కోటీశ్వరుడిని చేసింది.


ఈ లాటరీ టికెట్ ను అతడు అనుకోకుండా కొన్నాడట..

అతడి పేరు సదానందన్ ఒలిపరంబిళ్. పెయింటింగ్ వర్క్ చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. ఇక అతడికి ఎక్కువగా లాటరీ టికెట్లు కొనుక్కునే అలవాటు ఉంది. ఇటీవల అతడు కొన్ని కొన్న ఒక లాటరీ టికెట్ అతడిని కోటీశ్వరుడిని చేసింది. ఎప్పుడు కొన్నా లాటరీ తగలకపోవడంతో.. తాను ఇక లాటరీ టికెట్లను కొనొద్దు అనుకున్నాడట. ఇప్పుడు తగిలిన ఈ లాటరీ టికెట్ ను అతడు అనుకోకుండా కొన్నాడట. అతడి ఓ షాప్ కు వెళ్లగా అక్కడ 500 నోట్ చూపించి తనకు కావాల్సిన అవసరాలు తీసుకున్నాడు. కానీ ఆ షాప్ యజమాని దగ్గర చిల్లర లేదు. దీంతో అతడు లాటరీ టికెట్ కొన్నానని చెబుతున్నాడు. అనుకోని రీతిలో ఆ రోజు మధ్యానానికే రిజల్ట్స్ వచ్చాయని.. అప్పుడు ఈ విషయాన్ని తానే నమ్మలేకపోయానని అంటున్నాడు. ఇక లాటరీలో అతడికి వచ్చిన అమౌంట్ ఎంతో తెలుసా.. అక్షరాల రూ.12 కోట్లు. అయితే అందులో 30 శాతానికి పైగా ట్యాక్స్ పోను మిగిలిన డబ్బుతో ఇల్లు కట్టుకుంటానని చెబుతున్నాడు.

ఉద్యోగం పోయింది.. రూ.7 కోట్లు సంపాదించినా వ్యక్తి!

కరోనా ఈ ప్రపంచం మొత్తం వ్యాపించడంతో అన్ని దేశాల ప్రభుత్వాలు లాక్ డౌన్ అమలు చేశాయి. దీంతో అన్ని ప్రైవేటు రంగాలు మూతపడడంతో ఎంతోమంది నిరుద్యోగులుగా మారిపోయారు. లాక్ డౌన్ సమయంలో ఇంటికి పరిమితం కావడంతో ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కరోనా వ్యాపించి అందరికీ ఎన్నో కష్టాలను తెచ్చిందని చాలామంది భావిస్తుంటారు. కానీ ఈ కరోనా కొందరికి మాత్రం ఎంతో మేలు చేసిందని చెప్పవచ్చు. ఇలాంటి కోవకు చెందిన వ్యక్తి నవనీత్ సజీవన్‌కు.

కేరళలోని కసర్‌గాడ్‌కు చెందిన నవనీత్ సజీవన్‌ గత నాలుగేళ్లుగా అబుదాబిలో ఉంటున్నాడు.కరోనా వ్యాపించడంతో ఉన్నఫలంగా అతని ఉద్యోగం ద్వారా వచ్చే వేతనంతో ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. ఉద్యోగుల సంఖ్య క్రమంగా తగ్గిస్తూ వస్తున్న ఆ కంపెనీ అతడిని నోటీసు పీరియడ్ కింద పని చేయించుకుంటూ ఉంది.చాలీచాలని జీతంతో ఎన్నో బాధలు అనుభవిస్తున్న నవనీత్ తన జీతంలో కొంత డబ్బుతో లాటరీ టికెట్ కొన్నాడు.

లాటరీ టికెట్ కొంటూ తనకు అదృష్టం కొంచమైనా ఉందో లేదో అని భావించి లాటరీ టికెట్లు కొనుగోలు చేశాడు.ఆదివారం దుబాయి డ్యూటీ ప్రీ మిలీనియం మిలియనీర్ డ్రా నిర్వాహకులు నవనీత్‌కు ఫోన్ చేసి లాటరీ టికెట్ ద్వారా 7.4 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ గెలుచుకున్నారని చెప్పడంతో ఎంతో ఆశ్చర్యానికి గురయ్యారు. నవంబర్ 22న ఆన్లైన్ ద్వారా లాటరీ టికెట్ కొన్న నవనీత్ లాటరీ గెలవడంతో తన కష్టాలన్నీ తీరిపోయాయని ఎంతో సంబరపడ్డాడు. తన గెలుచుకున్న ప్రైజ్ మనీతో తన కుటుంబ అవసరాలను తీర్చడంతో పాటు తన స్నేహితులకు, సహోద్యోగుల అవసరాలకు కొంత డబ్బును వినియోగిస్తున్నట్లు నవనీత్ సజీవన్‌ తెలిపారు. లాటరీ ద్వారా ఒకే సారి ఇంత మొత్తంలో డబ్బులు గెలవటం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.