Lucky Person: పెయింటర్ ను వరించిన అదృష్టం..! రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు..! ఎలా అంటే.. !
Lucky Person: లక్ ఉండాలే కానీ.. అరటి పండు కూడా బంగారం అవుతుంది అంటారు. ఒక వేళ అదృష్టం లేకపోతే.. అదే అరటిపండి తింటే పన్ను ఇరుగుతుంది అనేది పెద్దలు చెబుతున్న మాట. ఇలా అదృష్టం అనేది ఎవరిని, ఎప్పుడు ఎలా వరిస్తుందో చెప్పలేం. అలాంటిది ఓ వ్యక్తికి లాటరీ రూపంలో లచ్చిందేవి వచ్చిపడింది. అసలు ఆ కథేంటో తెలుసుకుందాం.
మన దేశంలో లాటరీల ద్వారా డబ్బులు రావడం అనేవి తక్కువ కానీ.. విదేశాల్లో ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిన వాళ్లు ఎంతో మంది ఉన్నారు. ముఖ్యంగా అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల్లో ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. వారి బిజినెస్ కు సంబంధించి ప్రమోషన్ల కోసం ఇలాంటివి పెడుతుంటారు.
అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో జూదం, లాటరీలాంటికి నిషేధించారు. కానీ మహారాష్ట్ర, బిహార్, కేరళ లాంటి రాష్ట్రాల్లో ఇలాంటి లాటరీలు పెడుతుంటారు. లాటరీ టికెట్లను బహిరంగంగానే అమ్ముతుంటారు. ఇలా లాటరీ టికెట్ తగిలి ఎంతో మంది రిక్షావాలాలు, డ్రైవర్లు కోటీశ్వరులు అయ్యారు. తాజాగా అదే లాటరీ టికెట్ కేరళకు చెందిన ఓ పెయింటర్‌ను కోటీశ్వరుడిని చేసింది.
అతడి పేరు సదానందన్ ఒలిపరంబిళ్. పెయింటింగ్ వర్క్ చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. ఇక అతడికి ఎక్కువగా లాటరీ టికెట్లు కొనుక్కునే అలవాటు ఉంది. ఇటీవల అతడు కొన్ని కొన్న ఒక లాటరీ టికెట్ అతడిని కోటీశ్వరుడిని చేసింది. ఎప్పుడు కొన్నా లాటరీ తగలకపోవడంతో.. తాను ఇక లాటరీ టికెట్లను కొనొద్దు అనుకున్నాడట. ఇప్పుడు తగిలిన ఈ లాటరీ టికెట్ ను అతడు అనుకోకుండా కొన్నాడట. అతడి ఓ షాప్ కు వెళ్లగా అక్కడ 500 నోట్ చూపించి తనకు కావాల్సిన అవసరాలు తీసుకున్నాడు. కానీ ఆ షాప్ యజమాని దగ్గర చిల్లర లేదు. దీంతో అతడు లాటరీ టికెట్ కొన్నానని చెబుతున్నాడు. అనుకోని రీతిలో ఆ రోజు మధ్యానానికే రిజల్ట్స్ వచ్చాయని.. అప్పుడు ఈ విషయాన్ని తానే నమ్మలేకపోయానని అంటున్నాడు. ఇక లాటరీలో అతడికి వచ్చిన అమౌంట్ ఎంతో తెలుసా.. అక్షరాల రూ.12 కోట్లు. అయితే అందులో 30 శాతానికి పైగా ట్యాక్స్ పోను మిగిలిన డబ్బుతో ఇల్లు కట్టుకుంటానని చెబుతున్నాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…