Tag Archives: luck

Bappi Lahairi: బప్పి లహరికి బంగారంతోనే కలిసి వచ్చిందా…అందుకే బంగారం ధరించేవారా?

మ్యూజిక్ లెజెండ్ బప్పి లహరి మరణించడం యావత్ దేశ చలనచిత్ర రంగాన్ని శోఖసంద్రంలో ముంచింది. ఎంతో హిట్ సాంగ్స్ ఇచ్చిన ఆయన మరణించడం అందర్ని షాక్ కు గురిచేసింది. హిందీ, తెలుగు, కన్నడ, బెంగాళీ, తమిళ సినిమాలకు సాంగ్స్ అందించినా… ఎక్కువగా హిందీపైనే కాన్సన్ట్రేట్ చేశారు. తెలుగులో బప్పి లహరి మ్యూజిక్ అందించిన సింహాసనం, నిప్పురవ్వ, గ్యాంగ్ లీడర్ సినిమాల సాంగ్స్ ఎన్నో రికార్డులు క్రియేట్ చేశాయి. ముఖ్యంగా గ్యాంగ్ లీడర్ సినిమాలోని సాాంగ్స్ అప్పట్టో ట్రెండ్ సెట్టర్ గా నిలిచాయి. 

Bappi Lahairi: బప్పి లహరికి బంగారంతోనే కలిసి వచ్చిందా…అందుకే బంగారం ధరించేవారా?

80వ దశకంలో బప్పిలహరి మ్యూజిక్ ఓ సెన్సెషన్. ఆయన సంగీతం, గాత్రంతో పాటు ఆయన ఆహార్యంతో కూడా చాలా ఫేమస్ అయ్యారు. ఒంటి నిండా బంగారంతో ఉంటే ఆయన రూపంతో చాలా పాపులర్ అయ్యారు. 

Bappi Lahairi: బప్పి లహరికి బంగారంతోనే కలిసి వచ్చిందా…అందుకే బంగారం ధరించేవారా?

అయితే బప్పిలహరి ఒంటినిండా బంగారం ధరించడానికి ఓ హాలీవుడ్ నటుడు కారణం అంటూ.. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఎల్వీఎస్ ప్రెస్లీ అనే హాలీవుడ్ నటుడు ఎపుడు మెడలో ఓ గోల్డ్ చెయిన్ వేసుకునే వారు.. ఆయన ఆహార్యంతో ఇంప్రెస్ అయి.. అప్పటి నుంచి తను కూడా ఒంటి నిండా నగలు వేసుకోవడం మొదలు పెట్టినట్టు చెప్పారు బప్పిలహరి. 

బంగారంతోనే లక్ కలిసి వచ్చిందన్న బప్పి లహరి:

ఒంటి నిండా బంగాారం వేసుకున్న తరువాతే తనకు లక్ కలిసి వచ్చిందన్నారు బప్పి లహరి. తనకు వరసగా విజయాలు అందాయన్నారు. అప్పటి నుంచి నగలు ధరించడం సెంటిమెంట్ గా మారిందని గతంలో బప్పి లహరి అన్నారు. గోల్డ్ ఈజ్ మై గాడ్.. అని పలు సందర్భాల్లో ప్రస్తావించారు కూడా. ఓ సారి ’జక్మీ’ పాటల రికార్డిండ్ సమయంలో దేవుడి పేరుతో ఉన్న లాకెట్ ఉన్న బంగారు గొలుసును మా అమ్మ నాకు బహుమతిగా ఇచ్చింది. అపుడు ఆ ఆల్బమ్ సూపర్ హిట్టైయిందన్నారు. ఆ తరువాత మా అమ్మ మరో చైన్ ఇవ్వడంతో వెంటనే పెళ్లి జరిగిందని అన్నారు. ఇలా బంగారం కొనడం నాకు జీవితంలో భామైందని అని ఆ ఇంటర్వ్యూలో గతంలో వెల్లడించారు. బప్పి లహరి గోల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు తెచ్చుకున్నారు.

Wooden Chair: అదృష్టం అంటే ఇదేనేమో..రూ.500 పెట్టి చెక్క కుర్చీ కొన్నారు… వేలంలో 16 లక్షలు గెలుచుకున్నారు!

Wooden Chair: కొన్నిసార్లు ఎవరూ ఊహించని విధంగా కొందరికి అదృష్టం తలుపు తడుతుంది.ఇలా అదృష్టం తలుపు తట్టినప్పుడు వృధాగా పడేసిన వస్తువులకు కూడా అధిక డిమాండ్ పెరుగుతుందని ఎన్నోసార్లు రుజువైంది. తాజాగా ఒక పాత కుర్చీ విషయంలో కూడా ఇలాగే జరిగింది.

ఒక పాత సామాన్ల దుకాణంలో వేస్ట్ గా పడి ఉన్న ఒక కుర్చీని చూసి మంత్ర ముద్దురాలైనా ఓ మహిళ అతనికి 500 రూపాయలు ఇచ్చి ఆ కుర్చీని సొంతం చేసుకుంది. అయితే ఆ కుర్చీ ప్రాముఖ్యత ఏమిటో ఆ మహిళకు కూడా తెలియదు. ఒకరోజు ఒక వ్యక్తిని కలిసిన ఆమె ఆ కుర్చీ విలువ ఎంత ఉంటుందో చెప్పమని అడగగా ఆ వ్యక్తి ఆ కుర్చీని పరిశీలించి ఎంతో ఆశ్చర్యపోయాడు.

ఈ క్రమంలోనే ఆ వ్యక్తి అది ఆస్ట్రియాలోని వియన్నాలో ఉన్న అవాంట్ గార్డ్ ఆర్ట్ స్కూల్‌కు చెందినదని ఈ కుర్చీ ఎక్కువ మొత్తానికి అమ్ముడు పోతుందని తెలిపారు.1902లో ప్రముఖ చిత్రకారుడు కోలోమన్ మోసెర్ రూపొందించినట్టు తెలిపారు. దీంతో ఆ మహిళఈ కుర్చీని వేలానికి పెట్టింది ఆ మహిళ.

కేవలం ఫోటో చూసి 16 లక్షలు చెల్లించిన వ్యక్తి..

ఈ కుర్చీని వేలంలో పెట్టగా ఆస్ట్రియాకు చెందిన ఒక డీలర్ దీన్ని రూ.16 లక్షలకు కొనుగోలు చేశాడు. కనీసం కుర్చీని నేరుగా చూడకుండా కేవలం సెల్ ఫోన్ లో ఫోటో చూసి ఏకంగా 16 లక్షల రూపాయలు చెల్లించి సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియాకు చెందిన ఈ కుర్చీ బ్రిటన్ కి ఎలా వెళ్ళింది అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఏది ఏమైనా ఈ కుర్చీ ఇంత ధర పలకడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో చర్చనీయాంశం గా మారింది.