Tag Archives: Mahabubnagar

సార్.. మా తమ్ముడి ఫోన్ పేలింది.. ఏం చేయమంటారు..?

భారతదేశంలో కొన్నాళ్ల నుంచి స్మార్ట్‌ఫోన్‌ లు పేలుతున్నాయి. Vivo, OnePlus స్మార్ట్ 5 జీ ఫోన్లు పేలిన సందర్భాలు చాలా ఉన్నాయి. తర్వాత ఇప్పడు ఆ జాబితా Poco పేరు కూడా చేరింది. మహేష్ అనే వినియోగదారుడు పోకో ఎం3 స్మార్ట్‌ఫోన్ 5జీ పేలిందని.. దానికి సంబంధించి బ్యాక్ ప్యానెల్ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

దీనిపై అతడి సోదరుడు స్పందిస్తూ.. తన తమ్ముడు ఫోన్ Poco M3 బ్లాస్ట్ అయిందని అతను ట్విట్టర్ లో రాశాడు. ఫోన్‌లో పేలడానికి గల కారణం ఏంటి అనేది మాత్రం స్పష్టంగా తెలపలేదు. దీనిని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మహేష్ ఈ ట్వీట్ చేశాడు.

అయితే ఈ ట్వీట్‌ చేసిన కొన్ని నిమిషాలకే అతడు తొలగించాడు. కానీ అప్పటికే అది ఎక్కువగా షేర్ చేయబడింది. దానికి సంబంధించి స్క్రీన్ షాట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. నవంబర్ 27 మధ్యాహ్నం 12:33 గంటలకు మహేష్ ఈ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ స్క్రీన్ షాట్ 91మొబైల్స్ ద్వారా షేర్ చేయబడింది. అయితే అప్పటికే పోకో ఫోన్‌ పేలింది అంటూ సౌరబ్‌ హతి అనే ట్విట్టర్‌ యూజర్‌ మహేష్‌ ట్వీట్‌ను షేర్‌ చేశారు.

సౌరబ్‌ హతి ట్వీట్‌పై పోకో ప్రతినిధులు స్పందించారు. భారతదేశంలో కస్టమర్ల భద్రత కంపెనీకి అత్యంత ముఖ్యమైన విషయం. ఇలాంటి విషయాలను సీరియస్‌గా తీసుకుంటాం. కారణాన్ని తెలుసుకోవడానికి మా బృందం దీనిని పరిశీలిస్తోందన్నారు. త్వరలోనే సమస్యకు పరిష్కారం చూపెడతామన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మహబూబ్ నగర్ చిన్నారులను ఆదుకోవాలని కలెక్టర్ కు ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్!

సాధారణంగా చిన్నపిల్లలకు తెలిసీ తెలియని వయసులో తల్లిదండ్రులు అండగా ఉండాలీ. కానీ అలాంటి పసిపిల్లలను అనాధలను చేసి ఆ తల్లిదండ్రులు అనంతలోకాలకు వెళ్లిపోతే.. ఆ పిల్లల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తల్లిదండ్రులు ఇక లేరు, ఇకపై తిరిగి రారన్న విషయం తెలియక ఆ చిన్నారులు పడే మనోవేదన వర్ణనాతీతం. అయితే ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. విద్యుత్ షాక్ తో దంపతులు ఇద్దరు మృతి చెందడంతో వారి పిల్లలు అనాథలుగా మారారు. అసలేం జరిగిందంటే…

మహబూబాబాద్ జిల్లాకు చెందిన దంపతులు విద్యుత్ షాక్‌తో మృతి చెందడంతో వారి ఇద్దరు అమ్మాయిలు అనాథలయ్యారు. దీనికి సంబంధించి వార్త ఓ పత్రికలో రావడంతో ఇదే కథనాన్ని ట్యాగ్ చేస్తూ ఆ చిన్నారులను ఆదుకోవాలని తెలంగాణ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులకు, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్‌కు మంత్రి కేటీఆర్ ట్వీట్ ద్వారా విజ్ఞప్తి చేశారు.

ఆ చనిపోయిన ఆ దంపతులు మహబూబాబాద్ జిల్లాలోని సింగారం గ్రామంలోని ఎస్సీ కాలనీలో నివాసం ఉండేవారు.అనపర్తి ఉపేందర్(32), తిరుపతమ్మ(32) దంపతులకు శ్యామల(8), బిందు(6) అనే ఇద్దరమ్మాయిలు కూడా ఉన్నారు.అయితే శుక్రవారం రోజు రాత్రి తిరుపతమ్మ బట్టలను ఆరేసే క్రమంలో జీఐ వైర్‌కు విద్యుత్ షాక్ ప్రసారం అవ్వడంతో షాక్ తగిలింది.ఇది చూసిన ఆమె భర్త ఉపేందర్ ఆమె కాపాడటానికి ప్రయత్నించాడు.

అయితే ఈ క్రమంలోనె ఆమెని కాపాడే ప్రయత్నంలో ఉపేందర్ కూడా విద్యుత్ షాక్ తగిలి చనిపోయాడు. ఇద్దరు దంపతులు విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ దంపతులు కుమార్తెలు శ్యామల, బిందు కలసి తన తల్లిదండ్రుల అంత్యక్రియలలో ముందు నడిచారు. ఆ చిన్నారుల మనోవేదన చూసి ఇరుగు పొరుగు వారు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ తల్లిదండ్రుల పై పడి ఆ చిన్నారులు గుండెలవిసేలా రోదించారు. ఇక ఇదే విషయంపై వీరిద్దరి అంత్యక్రియల్లో శ్యామల, బిందునే ముందు నడిచారు.దీనితో ఆ ఇద్దరు చిన్నారులకు అండగా నిలవాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్‌కు మంత్రి కేటీఆర్ ట్వీట్ ద్వారా విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ ఆదేశంతో పలువురు అతని పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

భర్తను అతికిరాతంగా చంపి.. తన ఇంట్లోనే బాత్రూంలో పాతిపెట్టిన భార్య.. చివరకు..!

భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. ఆ గొడవలో తన భార్య క్షణికావేశంలో భర్తను చంపి.. తన ఇంట్లోనే బాత్ రూంలో పాతిపెట్టింది. దీంతో తిన్నిగా వెళ్లి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త కనిపించడం లేదంటూ.. ఆమె చెప్పగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తర్వాత విచారణ చేపట్టిన పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు.

నెల రోజుల తర్వాత అసలు విషయం బయటపడింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్​నగర్​ జిల్లా నవాబుపేట మండలం మొరంబావి గ్రామానికి చెందిన 45 ఏళ్ల చెన్నయ్య రాములమ్మ దంపతులు. వారికి రెండు ఎకరాలు పొలం ఉంది. ఆ రెండు ఎకరాల పొలంలో ఒక ఎకరం పొలం అమ్మి వచ్చిన డబ్బులతో కొత్త ఇల్లు కట్టుకుంటున్నారు.

అయితే.. తన సోదరుడు కనిపించడకుండా పోయాడంటూ.. అతడి అక్కలు.. ఉడిత్యాల వెంకటమ్మ, దొండ్లపల్లి పెంటమ్మ, చెల్లెలు చెన్నమ్మ గ్రామానికి చేరుకుని వదిన రాములమ్మను నిలదీశారు. ఆమె ప్రవర్తనలో అనుమానం రావడంతో చెన్నమ్మ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆమెను విచారించగా.. భర్తను తానే చంపినట్లు ఒప్పుకుంది.

మిగిలిన ఎకరా పొలాన్ని కూడా అమ్ముతానని గొడవ చేస్తుండడంతో కొడుకు రమేశ్, అదే గ్రామానికి చెందిన తన అక్క భర్త పెంటయ్య, చెల్లెలి భర్త రఘుతో కలిసి చెన్నయ్యను చంపేసినట్లు చెప్పింది. కొత్తగా కడుతున్న ఇంట్లోని బాత్​రూంలో శవాన్ని పాతిపెట్టామని పేర్కొంది. దీంతో ఆ గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

దేవుడి గుట్టపై మేకలు మాయం.. ఏంటా అని చూస్తే భారీ షాక్!

తెలంగాణలోని అటవీ ప్రాంతంలో ఉన్న జిల్లాల్లోని ప్రజలను గత కొద్ది రోజుల నుంచి చిరుత తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది. అయితే ఈ చిరుత కొన్ని రోజులు కనిపించక పోవడంతో తిరిగి అడవిలోకి వెళ్ళిపోయిందని ప్రజలు భావించారు. తాజాగా మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపురం గ్రామశివారులో చిరుత పులి తిరుగుతుండడంతో ఆ గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. గ్రామ శివారులోనే కాకుండా కురుమూర్తి స్వామి గుట్టపై కూడా ఈ చిరుత ప్రభావం ఉన్నట్టు కనబడుతుంది.

పేదల తిరుపతిగా భావించే ఈ గుట్టపై గత వారం రోజుల నుంచి చిరుత సంచరిస్తున్నట్లు స్థానికులు తెలియజేస్తున్నారు. ఈ గుట్టపైకి కొందరు గొర్రెల కాపరులు గొర్రెలు మేకలను అటవీ ప్రాంతంలోనికి మేత కోసం తీసుకెళ్ళేవారు. అయితే రోజు మేకలు మాయమవడంతో కాపరులకు విషయం అంతుపట్టడం లేదు. ఈ క్రమంలోనే ఒకరోజు వారికి ఆ గుట్ట పరిసర ప్రాంతాలలో చిరుత కనిపించడంతో ఆందోళన చెందారు.

ఆ చిరుత సంచరిస్తున్న ప్రదేశాలను కాపరులు సెల్ ఫోన్ లలో బంధించి స్థానిక గ్రామ ప్రజలకు చూపించగా ప్రజలు భయాందోళనలకు గురై ఇంటి నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితులలో ఉన్నారు.చుట్టుపక్కల గ్రామాలలో పొలాల్లోకి వెళ్లి పనులు చేసుకోవడానికి కూడా రైతులు భయపడుతున్నారు.

అదేవిధంగా ఎప్పుడూ భక్తులతో రద్దీగా ఉండే కురుమూర్తి స్వామి ఆలయాన్ని దర్శించుకోవాలన్న భక్తులు భయంతో వెనకడుగు వేస్తున్నారు. ఈ విషయంపై అటవీ అధికారులు స్పందించి చిరుతను బంధించి తమ గ్రామ ప్రజలను కాపాడాలని గ్రామస్తులు పేర్కొన్నారు.