భర్తను అతికిరాతంగా చంపి.. తన ఇంట్లోనే బాత్రూంలో పాతిపెట్టిన భార్య.. చివరకు..!

భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. ఆ గొడవలో తన భార్య క్షణికావేశంలో భర్తను చంపి.. తన ఇంట్లోనే బాత్ రూంలో పాతిపెట్టింది. దీంతో తిన్నిగా వెళ్లి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త కనిపించడం లేదంటూ.. ఆమె చెప్పగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తర్వాత విచారణ చేపట్టిన పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు.

నెల రోజుల తర్వాత అసలు విషయం బయటపడింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్​నగర్​ జిల్లా నవాబుపేట మండలం మొరంబావి గ్రామానికి చెందిన 45 ఏళ్ల చెన్నయ్య రాములమ్మ దంపతులు. వారికి రెండు ఎకరాలు పొలం ఉంది. ఆ రెండు ఎకరాల పొలంలో ఒక ఎకరం పొలం అమ్మి వచ్చిన డబ్బులతో కొత్త ఇల్లు కట్టుకుంటున్నారు.

అయితే.. తన సోదరుడు కనిపించడకుండా పోయాడంటూ.. అతడి అక్కలు.. ఉడిత్యాల వెంకటమ్మ, దొండ్లపల్లి పెంటమ్మ, చెల్లెలు చెన్నమ్మ గ్రామానికి చేరుకుని వదిన రాములమ్మను నిలదీశారు. ఆమె ప్రవర్తనలో అనుమానం రావడంతో చెన్నమ్మ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆమెను విచారించగా.. భర్తను తానే చంపినట్లు ఒప్పుకుంది.

మిగిలిన ఎకరా పొలాన్ని కూడా అమ్ముతానని గొడవ చేస్తుండడంతో కొడుకు రమేశ్, అదే గ్రామానికి చెందిన తన అక్క భర్త పెంటయ్య, చెల్లెలి భర్త రఘుతో కలిసి చెన్నయ్యను చంపేసినట్లు చెప్పింది. కొత్తగా కడుతున్న ఇంట్లోని బాత్​రూంలో శవాన్ని పాతిపెట్టామని పేర్కొంది. దీంతో ఆ గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.