కొన్ని కుటుంబాల్లో అత్తాకోడళ్లు తల్లి కూతురులా ఉంటారు. మరి కుటుంబాల్లో అత్తా కోడళ్ల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గమనేలా ఉంటారు. అయితే తన కొడుకు ముందు కోడలు అత్తతో బాగానే మెసులుతుంది. భర్త అలా వెళ్లగానే ఏదో ఒక చిన్న కారణంతో మళ్లీ రణరంగం మొదలవుతుంది. ఇలా గుంటూరు జిల్లాలో చపాతీ కర్రతో అత్త పై దాడి చేసిన ఘటన మరువకముందే మరో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటన రాజస్థాన్ లోని జైపూర్ లో జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. జైపూర్లోని భంక్రోటాకు చెందిన అత్తాకోడళ్లు.. 62 ఏళ్ల మోహిని దేవి.. తన కుమారుడికి 14 ఏళ్ల కిందట 35 ఏళ్ల మమతా దేవితో తో వివాహం జరిపించింది. మొదట్లో వారిద్దరు బాగానే ఉన్నా.. రానురాను మరింత వైరం పెరిగింది. ఒకరంటే.. ఒకరికీ అస్సలు పడేది కాదు.
ఈ నేపథ్యంలో ఓ రోజు కోడలు కూరగాయలు కోస్తుండగా.. అదేం కూరగాయలు కోసుడు.. మంచిగా కొయ్యి అంటూ .. కోడలిపై రుసురుసులాడింది. దీంతో ఆమెకు పట్టలేని కోపం వచ్చింది. ఇక తట్టుకోలేని కోడలు క్షణికావేశంలో కూరగాయలు కోస్తున్న కత్తితోనే అత్త పై దాడికి పాల్పడింది. ఏకంగా ఇరవై ఆరు చోట్ల పొడవడంతో మోహిని దేవి కి తీవ్ర గాయాలయ్యాయి.
ఒక్కసారిగా ఉలిక్కిపడిన కోడలు.. తన పిల్లలకు తీసుకొని అక్కడ నుంచి పారిపోయింది. చుట్టుపక్కల ఉన్న స్థానికులు అతడి కొడుకుకు సమాచారం అందించడంతో ఎస్ఎంఎస్ ఆస్పత్రికి తరలించాడు. ఆమె అక్కడ చికిత్స పొందుతూ అదే రోజు మరణించింది. భర్త ఫిర్యాదు మేరకు మమతను పోలీసులు అరెస్టు చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…