కొబ్బరి మొక్కలోని ప్రతి భాగం మానవాళికి ఎంతో ఉపయోగకరంగా ఉండి ఎంతో విశిష్ట స్థానంలో కొనసాగుతోంది. అందుకే కొబ్బరి చెట్టును కల్పవృక్షంతో సమానమైనదిగా భావిస్తారు.అందుకే ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 2 వ తేదీని ప్రపంచ కొబ్బరి దినోత్సవంగా జరుపుకుంటారు.కొబ్బరి ఆకుల నుంచి కొబ్బరి నూనె వరకు ,కొబ్బరి కాయ నుంచి కొబ్బరి బెరడు వరకు కొబ్బరి చెట్టు లోని ప్రతి భాగము మనకు ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుంది.
ముఖ్యంగా మన ఆరోగ్యాన్ని, సౌందర్యాన్ని రక్షించడంలో కొబ్బరికాయ కీలక పాత్ర పోషిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.లేత కొబ్బరిలో యాంటీ బాక్టీరియల్, వైరల్ గుణాలు పుష్కలంగా ఉండటంతో పాటు ఫైబర్, విటమిన్ సి, ఈ, ఖనిజ లవణాలు మెండుగా ఉండటం వల్ల మన శరీరానికి కావల్సిన శక్తిని ఇవ్వడంతోపాటు రోగ నిరోధక శక్తి పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
పచ్చికొబ్బరిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించి గుండె పనితీరును మెరుగుపరుస్తుంది.కొబ్బరిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల భవిష్యత్తులో వచ్చే అల్జీమర్స్ వంటి వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.కొబ్బరిలో ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది దాంతో జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.
అలాగే కొబ్బరి నీళ్లలో పోషక విలువలతో పాటు ఔషధగుణాలు మెండుగా ఉన్నాయి. ముఖ్యంగా కొబ్బరినీటిలో అత్యధికంగా సోడియం, ఐరన్, పొటాషియం,మెగ్నీషియం, కాపర్,ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్‌లు, వంటి మినరల్స్ ఉండటంతో హైడ్రేషన్ సమస్య అనేది ఏర్పడదు,రక్తపోటు, గుండెపోటు వంటి ప్రమాదాలను తగ్గించటానికి కూడా ఉపయోగపడతాయి.కొబ్బరి నీళ్లలో ఉండే ట్రాన్స్-జేజిటిన్ జ్ఞాపకశక్తిని పెంపొందించగలదు
సాధారణంగా కొబ్బరి నూనె జుట్టుకు మంచి కండిషనర్ లాగా ఉపయోగపడి జుట్టు మృదువుగా, ఆరోగ్యంగా ఉండటానికి సహకరిస్తుంది. అలాగే కొబ్బరి నూనెలో ఉన్నటువంటి లారిక్ ఆమ్లం,యాంటీ ఆక్సిడెంట్లు చర్మంను పొడిబారకుండా మృదువుగా ఉంచుతాయి.ఇందుకోసం తాజా కొబ్బరి నూనెను తీసుకొని అందులో అర టేబుల్‌స్పూన్ నిమ్మరసం,ఒక టేబుల్‌స్పూన్ పెరుగును బౌల్లో వేసి బాగా కలిపి ముఖానికి మృదువుగా పట్టించి కొన్ని నిమిషాల తర్వాత కడిగేస్తే ముఖంపై జిడ్డు తొలగి ఆరోగ్య వంతమైన చర్మం మీ సొంతమవుతుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…