Tag Archives: Major

Bimbisara Child Artist: బింబిసార సినిమాలో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరో తెలుసా?

Bimbisara Child Artist: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్టులకు ఏమాత్రం కొదవ లేదు. ఇండస్ట్రీకి ఎంతోమంది చైల్డ్ ఆర్టిస్టులు ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో అఖండ సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న చిన్నారి ప్రస్తుతం తెలుగులో పలు సినిమాలలో నటిస్తున్నారు.

 

ఇలా హీరో హీరోయిన్ చిన్నప్పటి పాత్రలో నటించడానికి ఎంతోమంది చైల్డ్ ఆర్టిస్టులను ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు.ఇకపోతే తాజాగా అందరి దృష్టి కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ పై పడింది. ఇందులో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఈ చిన్నారి తన నటనతో అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. ఇకపోతే ఈ చిన్నారి అసలు పేరు శ్రీదేవి.అయితే ఈ శ్రీదేవి ఎవరు తన బ్యాగ్రౌండ్ ఏంటి తనకు సినిమా అవకాశాలు ఎలా వచ్చాయనే విషయానికి వస్తే..

ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ శ్రీదేవి శాంభవి అనే పాత్రలో నటించి సందడి చేశారు. అయితే ఈ చిన్నారి ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో కనిపించారు. అయితే ఈ చిన్నారికి ఈ సినిమా డెబ్యూ సినిమా కాదు ఈమె ఇదివరకే రామారావు ఆన్ డ్యూటీ మేజర్ వంటి సినిమాలలో నటించడమే కాకుండా, ప్రేమ యమలీల కల్యాణ వైభోగమే అనే సీరియల్స్ లో కూడా నటించారు.

Bimbisara Child Artist: శ్రీదేవి తండ్రి కూడా ఆర్టిస్టే..

ఇక ఈమె ఇండస్ట్రీలోకి తన తండ్రి శ్రీహరి గౌడ్ ద్వారా అడుగు పెట్టారు. ఈయన కూడా ఇండస్ట్రీలో ఆర్టిస్టుగా వ్యవహరించడమే కాకుండా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పని చేస్తున్నారు.ఈ విధంగా తన తండ్రి సహాయంతో శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు అయితే వీరి సొంత గ్రామం బేతంచర్ల అయినప్పటికీ సినిమా షూటింగ్లో నిమిత్తం హైదరాబాద్లోనే నివసిస్తున్నారు.

అడవి శేష్ ‘మేజర్’ కోసం ఏకంగా ఆరు భారీ సెట్స్.. వాటి ఖర్చు ఎన్ని కోట్లో తెలుసా..??

టాలీవుడ్ లో విభిన్న కథా చిత్రాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అడవి శేష్.. ఇటీవల గూఢచారి117 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ హీరో ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘మేజర్’. శశి కిరణ్‌ తిక్క దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మహేష్ బాబు జిఎమ్‌బి ఎంటర్టైన్మెంట్ మరియు ఏప్లస్ఎస్‌ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మిస్తోంది. 26/11 ముంబై నగరంలో జరిగిన టెర్రర్ ఎటాక్స్‌లో తన ప్రాణాలను పణంగా పెట్టి.. ప్రజలను కాపాడిన ఆర్మీ ఆఫీసర్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రను పోషిస్తున్నారు హీరో అడివి శేష్‌. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా టీజర్ అన్ని భాషలలో మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే.

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా మేజర్ విడుదలకు సిద్ధమవుతోంది.నిజ ఘటనల ఆధారంగా చేసుకుని డైరెక్టర్ శశికిరణ్ తిక్క అండ్ టీమ్ ఈ స్క్రిప్ట్‌ను తయారు చేసుకున్నారు. అందుకు తగినట్లు భారీ సెట్స్‌ను వేసి సినిమాను చిత్రీకరిస్తున్నారు. మహానటి వంటి నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీకి ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేసిన అవినాష్ కొల్ల, మేజర్ సినిమాలోని సన్నివేశాలను రియలిస్టిక్‌గా కళ్లకు కట్టినట్లు చూపించబోతున్నారు.అందుకోసం ఆయన ఆరు భారీ సెట్స్ వేశారు. అందులో ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా సెట్.. ఎన్ఎస్‌జీ కమాండో సెట్‌లను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు స్టూడియోలో వేశారు. ఇక ఈ సినిమాకు వేసిన భారీ సెట్స్‌లో తాజ్ హోటల్‌ ప్యాలెస్ సెట్ హైలెట్ అని చెప్పుకుంటున్నారు.

2008లో జరిగిన టెర్రర్ ఎటాక్ తాజ్ హోటల్‌లోనే జరిగింది. ఈ సన్నివేశాలను చిత్రీకరించేటప్పుడు ప్రేక్షకులకు రియల్ లొకేషన్ ఫీలింగ్‌ కలిగించడానికి రియల్ హోటల్ ఎలా ఉందో అలాంటి సెట్‌నే వేశామని తాజాగా ఆర్ట్ డైరెక్టర్‌ అవినాష్ కొల్ల తెలిపారు. వాస్తవానికి ముంబైలోని తాజ్ హోటల్‌లోనే చిత్రీకరణ జరపాలని యూనిట్ అనుకున్నప్పటికీ వారికి అనుమతులు లభించకపోవడంతో.. సెట్‌ను వేయక తప్పలేదు. నాలుగైదు రోజుల పాటు చిత్ర యూనిట్ తాజ్ హోటల్ ఆర్కిటెక్చర్‌ను పరిశీలించారు. ప్రతి చిన్న విషయాన్ని కూడా సునిశితంగా పరిశీలించడమే కాకుండా, సెట్‌ను వేయడానికి ఎంతో రీసెర్చ్ చేశామని.. ఐదు వందల మంది దాదాపు పది రోజుల పాటు శ్రమించి ఈ భారీ సెట్‌ను నిర్మించామని అవినాష్‌ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా అవినాష్ కొల్ల మాట్లాడుతూ.. ”మేజర్ సినిమా కోసం ఆరు భారీ సెట్స్ వేశాం. ప్రతి సెట్ వేసే క్రమంలో మా టీమ్ ఎంతో రీసెర్చ్ చేసుకుని, డిజైన్స్ తయారు చేసుకుని ముందుకెళ్లాం. ముఖ్యంగా తాజ్ పాలెస్ సెట్ వేయడానికి బాగా కష్టపడ్డాం. అడివి శేష్‌, స్టోరిని నెరేట్ చేసేటప్పుడు తాజ్ హోటల్ ప్రాధాన్యతను వివరించారు. సినిమాలో అదొక సెట్ ప్రాపర్టీలాగా కాకుండా క్యారెక్టర్‌లా ఊహించుకోవాలని చెప్పాడు. శేష్‌, చెప్పిన ప్రతి చిన్న విషయాన్ని నోట్ చేసుకుని, రియల్ తాజ్ ప్యాలెస్‌లా మా సెట్‌ను వేశాం. అంతేకాదు 120 అడుగుల ఎత్తుతో ఐదు ఫ్లోర్స్ హోటల్ సెట్‌ను ఫైబర్‌, ఉడ్‌, ఐరన్ ఉపయోగించి తయారు చేశాం అని అన్నారు..!!