Movie News

అడవి శేష్ ‘మేజర్’ కోసం ఏకంగా ఆరు భారీ సెట్స్.. వాటి ఖర్చు ఎన్ని కోట్లో తెలుసా..??

టాలీవుడ్ లో విభిన్న కథా చిత్రాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అడవి శేష్.. ఇటీవల గూఢచారి117 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ హీరో ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘మేజర్’. శశి కిరణ్‌ తిక్క దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మహేష్ బాబు జిఎమ్‌బి ఎంటర్టైన్మెంట్ మరియు ఏప్లస్ఎస్‌ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మిస్తోంది. 26/11 ముంబై నగరంలో జరిగిన టెర్రర్ ఎటాక్స్‌లో తన ప్రాణాలను పణంగా పెట్టి.. ప్రజలను కాపాడిన ఆర్మీ ఆఫీసర్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రను పోషిస్తున్నారు హీరో అడివి శేష్‌. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా టీజర్ అన్ని భాషలలో మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే.

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా మేజర్ విడుదలకు సిద్ధమవుతోంది.నిజ ఘటనల ఆధారంగా చేసుకుని డైరెక్టర్ శశికిరణ్ తిక్క అండ్ టీమ్ ఈ స్క్రిప్ట్‌ను తయారు చేసుకున్నారు. అందుకు తగినట్లు భారీ సెట్స్‌ను వేసి సినిమాను చిత్రీకరిస్తున్నారు. మహానటి వంటి నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీకి ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేసిన అవినాష్ కొల్ల, మేజర్ సినిమాలోని సన్నివేశాలను రియలిస్టిక్‌గా కళ్లకు కట్టినట్లు చూపించబోతున్నారు.అందుకోసం ఆయన ఆరు భారీ సెట్స్ వేశారు. అందులో ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా సెట్.. ఎన్ఎస్‌జీ కమాండో సెట్‌లను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు స్టూడియోలో వేశారు. ఇక ఈ సినిమాకు వేసిన భారీ సెట్స్‌లో తాజ్ హోటల్‌ ప్యాలెస్ సెట్ హైలెట్ అని చెప్పుకుంటున్నారు.

2008లో జరిగిన టెర్రర్ ఎటాక్ తాజ్ హోటల్‌లోనే జరిగింది. ఈ సన్నివేశాలను చిత్రీకరించేటప్పుడు ప్రేక్షకులకు రియల్ లొకేషన్ ఫీలింగ్‌ కలిగించడానికి రియల్ హోటల్ ఎలా ఉందో అలాంటి సెట్‌నే వేశామని తాజాగా ఆర్ట్ డైరెక్టర్‌ అవినాష్ కొల్ల తెలిపారు. వాస్తవానికి ముంబైలోని తాజ్ హోటల్‌లోనే చిత్రీకరణ జరపాలని యూనిట్ అనుకున్నప్పటికీ వారికి అనుమతులు లభించకపోవడంతో.. సెట్‌ను వేయక తప్పలేదు. నాలుగైదు రోజుల పాటు చిత్ర యూనిట్ తాజ్ హోటల్ ఆర్కిటెక్చర్‌ను పరిశీలించారు. ప్రతి చిన్న విషయాన్ని కూడా సునిశితంగా పరిశీలించడమే కాకుండా, సెట్‌ను వేయడానికి ఎంతో రీసెర్చ్ చేశామని.. ఐదు వందల మంది దాదాపు పది రోజుల పాటు శ్రమించి ఈ భారీ సెట్‌ను నిర్మించామని అవినాష్‌ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా అవినాష్ కొల్ల మాట్లాడుతూ.. ”మేజర్ సినిమా కోసం ఆరు భారీ సెట్స్ వేశాం. ప్రతి సెట్ వేసే క్రమంలో మా టీమ్ ఎంతో రీసెర్చ్ చేసుకుని, డిజైన్స్ తయారు చేసుకుని ముందుకెళ్లాం. ముఖ్యంగా తాజ్ పాలెస్ సెట్ వేయడానికి బాగా కష్టపడ్డాం. అడివి శేష్‌, స్టోరిని నెరేట్ చేసేటప్పుడు తాజ్ హోటల్ ప్రాధాన్యతను వివరించారు. సినిమాలో అదొక సెట్ ప్రాపర్టీలాగా కాకుండా క్యారెక్టర్‌లా ఊహించుకోవాలని చెప్పాడు. శేష్‌, చెప్పిన ప్రతి చిన్న విషయాన్ని నోట్ చేసుకుని, రియల్ తాజ్ ప్యాలెస్‌లా మా సెట్‌ను వేశాం. అంతేకాదు 120 అడుగుల ఎత్తుతో ఐదు ఫ్లోర్స్ హోటల్ సెట్‌ను ఫైబర్‌, ఉడ్‌, ఐరన్ ఉపయోగించి తయారు చేశాం అని అన్నారు..!!

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago