Tag Archives: makeup

Saipallavi: అందుకే నేను మేకప్ వేసుకోను… ఆసక్తికర విషయాలను తెలియచేసిన సాయి పల్లవి!

Saipallavi:సాయి పల్లవి ప్రేమమ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె తెలుగులో ఫిదా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి సినిమాతోనే అందరిని తన నటనతో డాన్స్లతో ఫిదా చేశారు. ఇలా సహజ సిద్ధంగా నటిస్తూ గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలను చేసుకుంటూ పోతున్నటువంటి సాయి పల్లవి అతి తక్కువ సమయంలోనే ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

ఇకపోతే ఈమె గత ఏడాది గార్గి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా తర్వాత సాయి పల్లవి ఎలాంటి సినిమాలను ప్రకటించలేదు దీంతో సాయి పల్లవి ఇండస్ట్రీకి దూరమవుతారని పెళ్లి చేసుకుంటున్నారంటూ ఎన్నో రకాల వార్తలు వచ్చాయి.అయితే గత ఏడాది నుంచి కూడా పెద్దగా ఎక్కడ ఇంటర్వ్యూలకు హాజరు కానటువంటి సాయి పల్లవి తాజాగా ముంబైలో జరిగిన ఒక ఈవెంట్ లో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె తన గురించి కొన్ని విషయాలను తెలియచేశారు. తనకు ప్రేమమ్ సినిమాలో అవకాశం వచ్చినప్పుడు చాలా భయపడ్డానని తెలిపారు. తన ముఖంపై మొటిమలు ఉండడం అలాగే తన గొంతు కూడా బాగా లేకపోవడంతో నేను సినిమాలో నటిస్తే అందరూ ఆదరిస్తారా అనే భయం తనని వెంటాడిందని తెలిపారు. అయితే ఈ సినిమా విడుదల అయ్యి మంచి హిట్ అయింది.


Saipallavi:డైరెక్టర్లు బలవంతం చేయలేదు

ఈ సినిమా మంచి హిట్ అవడంతో ప్రేక్షకులు నన్ను ఆదరించారని తనలో మరింత ఆత్మవిశ్వాసం పెరిగిందని సాయి పల్లవి తెలిపారు.ఇకపోతే ఈ సినిమాలో తాను ఎలాంటి మేకప్ వేసుకోలేదు తనకు మేకప్ వేసుకోవడం చాలా ఇన్ సెక్యూర్ గా ఉంటుందని తెలియజేశారు. నేను మేకప్ వేసుకోను అని చెప్పినప్పుడు కూడా డైరెక్టర్లు ఈ విషయంలో తనని బలవంతం చేయలేదని తెలిపారు. ఇలా మేకప్ లేకుండా నటించిన ప్రేమమ్ సినిమా ఎంతో మంచి సక్సెస్ అవడంతో అప్పటినుంచి తాను మేకప్ వేసుకోవడం లేదని ఈ సందర్భంగా సాయి పల్లవి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇలా చేస్తే మీ నగలు ఎప్పటికీ మెరిసిపోతాయ్!

ఆడవారి అందాన్ని రెట్టింపు చేసేది నగలు మాత్రమే. ఎంతో అందంగా ముస్తాబైనప్పటికీ మెడలో నగలు లేకపోతే ఏదో పోయినట్టు ఉంటుంది. అందుకే మహిళలు ఎక్కువగా నగలను కొనడానికి ఇష్టపడతారు. ఈ విధంగా మార్కెట్లోకి వచ్చే వివిధ రకాల డిజైన్లను వారి అభిరుచికి తగ్గట్టుగా కొంటూ ఉంటారు. అయితే ఈ విధంగా కొన్న నగల పట్ల మనం శ్రద్ధ చూపకపోతే అవి తొందరగా పాడవుతాయి. ఎంత ఖరీదు చేసి కొన్న నగలు పాడైతే మనకు చాలా బాధ కలుగుతుంది. ఈ క్రమంలోనే మన నగలు పాడవకుండా ఎప్పటికీ కొత్తవాటిలా మెరిసిపోవాలంటే తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. మరి ఆ జాగ్రత్తలు ఏమిటో తెలుసుకుందాం..

మనం ఏదైనా కార్యానీకి వెళ్తున్నప్పుడు అందంగా నగలు ధరించి వెళ్తాము. అయితే ఈవెంట్ ని బట్టి నగలను ఎంపిక చేసుకోవాలి.మనం ఏదైనా శుభకార్యానికి ముస్తాబవుతున్న అప్పుడు ముందుగా మేకప్ వేసుకున్న తరువాత చివరికి నగలను ధరించాలి. ముందుగా మనం మేకప్ వేసుకుని మేకప్ ఆరనివ్వాలి.లేదంటే మేకప్ లో ఉపయోగించే కొన్ని రసాయనాలు బంగారు నగలకు తగలడం ద్వారా నగలు రంగు కోల్పోయే ప్రమాదం ఉంటుంది.

మనం జాగ్రత్తగా ఎత్తి పెట్టిన నగలను ఎలా పడితే అలా కాకుండా.. కాటన్ లో లేదా టిష్యూ పేపర్ లో పెట్టి ఒక బాక్స్ లో భద్రపరచుకోవాలి. ఈ విధంగా భద్రపరచుకున్నప్పుడు ఎటువంటి దుమ్ము ధూళి నగలపై చేరకుండా ఎంతో కొత్తవిగా మెరిసిపోతాయి. అదేవిధంగా నగలపై దుమ్ము ధూళి చేరినప్పుడు మనం వాటిపై అధిక ఒత్తిడిని కలుగజేసి శుభ్రం చేయకూడదు. ఇలా చేస్తే నగలు విరిగిపోయే ప్రమాదం ఉంటుంది.

మనకు మన బంగారు నగలను శుభ్రం చేయడం తెలియకపోతే ఒకసారి మనం నగలు కొన్న షాప్ వారి సలహా తీసుకొని నగలను శుభ్రపరచుకోవాలి. ముఖ్యంగా నగలను ఎక్కువగా ఎండ తగిలే ప్రదేశాలలో ఉంచకూడదు. ఈ విధంగా నగల పట్ల తరచూ జాగ్రత్తలు తీసుకుంటే మన నగలు ఎప్పుడు కొత్త వాటిలా మెరిసి పోతుంటాయి.