Tag Archives: mallikarjuna theater

సాధారణ వ్యక్తిలా ఆటోలో థియేటర్ కి వెళ్ళిన నటి శ్రియ… ప్రేక్షకుల మధ్యలో సినిమా చూస్తూ..!

ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలందరి సరసన నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ శ్రియ శరన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరుస సినిమాలతో విజయ పథంలో దూసుకుపోతున్న శ్రియ కొన్ని రోజుల పాటు ఇండస్ట్రీ దూరమైనప్పటికీ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అయ్యారు.

ఈ క్రమంలోనే శ్రియ సంజన రావు దర్శకత్వంలో క్రియ ఫిల్మ్ కార్ప్, కలి ప్రొడక్షన్స్ బ్యానర్లపై రమేష్ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్ వి.ఎస్ సంయుక్తంగా నిర్మించిన గమనం చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించారు. ఇందులో ప్రియాంక జవాల్కర్ నిత్యామీనన్, శివ కందుకూరి కూడా కీలక పాత్రలు పోషించారు.

ఈ సినిమా డిసెంబర్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడంతో ఈ సినిమా చూడటానికి ఒక సాధారణ వ్యక్తిలా ఎలాంటి హంగు ఆర్బాటాలు లేకుండా ఆటోలో మల్లికార్జున థియేటర్ కి ఆటోలో ప్రయాణం చేసి ప్రేక్షకుల మధ్యలో కూర్చుని సినిమా వీక్షించారు.ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి.

ఈ ఫోటోలు చూసిన కొందరు నెటిజన్లు శ్రియ సింప్లిసిటీకి ఫిదా అవుతున్నారు. ఒక స్టార్ హీరోయిన్ అయ్యుండి ఇలా సాధారణ వ్యక్తిలా సినిమాకు ఆటోలు వెళ్లడం పట్ల అందరూ ఈమె పై ప్రశంసలు కురిపిస్తున్నారు. గమనం సినిమాలో శ్రియ దివ్యాంగురాలి పాత్రలో నటించి అందరిని మెప్పించారు. ఇక ఈమె నటించిన RRR సినిమా జనవరి 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.