ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలందరి సరసన నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ శ్రియ శరన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరుస సినిమాలతో విజయ పథంలో దూసుకుపోతున్న శ్రియ కొన్ని రోజుల పాటు ఇండస్ట్రీ దూరమైనప్పటికీ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అయ్యారు.
ఈ క్రమంలోనే శ్రియ సంజన రావు దర్శకత్వంలో క్రియ ఫిల్మ్ కార్ప్, కలి ప్రొడక్షన్స్ బ్యానర్లపై రమేష్ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్ వి.ఎస్ సంయుక్తంగా నిర్మించిన గమనం చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించారు. ఇందులో ప్రియాంక జవాల్కర్ నిత్యామీనన్, శివ కందుకూరి కూడా కీలక పాత్రలు పోషించారు.
ఈ సినిమా డిసెంబర్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడంతో ఈ సినిమా చూడటానికి ఒక సాధారణ వ్యక్తిలా ఎలాంటి హంగు ఆర్బాటాలు లేకుండా ఆటోలో మల్లికార్జున థియేటర్ కి ఆటోలో ప్రయాణం చేసి ప్రేక్షకుల మధ్యలో కూర్చుని సినిమా వీక్షించారు.ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి.
ఈ ఫోటోలు చూసిన కొందరు నెటిజన్లు శ్రియ సింప్లిసిటీకి ఫిదా అవుతున్నారు. ఒక స్టార్ హీరోయిన్ అయ్యుండి ఇలా సాధారణ వ్యక్తిలా సినిమాకు ఆటోలు వెళ్లడం పట్ల అందరూ ఈమె పై ప్రశంసలు కురిపిస్తున్నారు. గమనం సినిమాలో శ్రియ దివ్యాంగురాలి పాత్రలో నటించి అందరిని మెప్పించారు. ఇక ఈమె నటించిన RRR సినిమా జనవరి 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…