నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా డిసెంబర్ 2వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి విశేష ఆదరణ దక్కించుకుంది.ఇక ఈ సినిమా ద్వారా నటుడు శ్రీకాంత్ వరదరాజులు అనే విలన్ పాత్రలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇదిలా ఉండగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాలను అందుకుని దూసుకుపోతోంది.
ఈ సినిమా విజయం సాధించడంతో వైజాగ్ లో సినిమా విజయోత్సవ వేడుకను ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో భాగంగా శ్రీకాంత్ ఎన్నో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వైజాగ్ తో నాకు చాలా అనుబంధం ఉందని నా మొదటి సినిమా షూటింగ్ ఇక్కడే ప్రారంభించాము అలాగే అఖండ సినిమా విజయోత్సవ వేడుకను ఇక్కడ ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.
బోయపాటి దర్శకత్వంలో రెండు సినిమాలు చేశాను బాలయ్యతో కలిసి రెండు సినిమాలు చేయడం ఎంతో ఆనందంగా ఉంది ఆయనతో పని చేస్తున్నంతసేపు మనకు అలుపంటూ ఉండదు బాలకృష్ణ గారు ఇప్పటికీ ఎంతో ఎనర్జిటిక్ గా పని చేస్తారని ఈ సందర్భంగా శ్రీకాంత్ తెలిపారు.
ఇక వరదరాజులు పాత్ర నాకన్నా ఆయనకి ఎక్కువ నమ్మకం ఉందని తప్పకుండా అందరినీ ఆకట్టుకుంటుందని ఎన్నోసార్లు తెలిపినట్లు శ్రీకాంత్ వెల్లడించారు.ఇక ఇందులో బాలకృష్ణ ఎంతో అద్భుతంగా నటించారని సాక్షాత్తు శివుడే బాలకృష్ణ రూపంలో ఈ సినిమాలో నటించారా అనేంతగా బాలకృష్ణ పాత్రలో ఒదిగిపోయారని శ్రీకాంత్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో అఖండ సినిమాకు ఇంత అద్భుతమైన విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రతి ఒక్క సినిమాను ఆదరించాలని ఈ సందర్భంగా శ్రీకాంత్ తెలిపారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…