నాగ్ అశ్విన్ తదుపరి చిత్రంలో దీపికా పదుకొణె , బాహుబలి స్టార్ ప్రభాస్ మొదటిసారి స్క్రీన్‌స్పేస్‌ను పంచుకోనున్నారు. దీనికి తాత్కాలికంగా ‘ప్రాజెక్ట్ కె’ అనే పేరు పెట్టారు. ఈ సినిమాకు సంబంధించి నిర్మాతలు హైదరాబాద్‌లో ఒక ముఖ్యమైన షెడ్యూల్ కోసం షూట్‌ను ప్రారంభించారు.
దీపికా పదుకొణె గతవారం టీమ్‌లో జాయిన్ అవ్వగా.. ప్రభాస్ ఈరోజు నుంచి షూటింగ్‌ని ప్రారంభించినట్లు తెలుస్తోంది. మేకర్స్ రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్‌ను రూపొందించారు. దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ డ్రీమ్ ప్రాజెక్ట్‌ను గ్రాండ్‌గా మొదలు పెట్టనున్నారు. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వనీదత్ నిర్మిస్తున్నారు.
ఇంతకుముందు ఈ మెగా ప్రాజెక్ట్‌ను ప్రకటించిన సందర్భంగా.. నాగ్ అశ్విన్ ఒక ప్రకటనలో ఈ చిత్రం కథ గురించి తెలిపారు. ఈ సినిమా ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతుందని చెప్పాడు. దీపిక ఈ పాత్రలో నటించినందుకు తాను చాలా ఎగ్జైటెడ్‌గా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇంత వరకు దీపిక ఇటువంటి రోల్ చేయలేదని తెలిపారు.
దీపిక, ప్రభాస్‌ల జోడి ఈ చిత్రానికి ప్రధాన హైలైట్ అని అన్నారు. దీనిలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్రధారి. కొన్ని నెలల క్రితం ఆరంభమైన ఈ చిత్రం షూటింగ్‌లో అమితాబ్ బచ్చన్ మాత్రమే పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ లో దీపికా పదుకునేతో పాటు.. తాజాగా ప్రభాస్ కూడా ఎంటర్ అయ్యాడు. ఈ సినిమా దాదాపు రూ.500 కోట్లతో నిర్మిస్తున్నట్లు సమాచారం. మిక్కీ జె మేయర్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించగా, డాని శాంచెజ్ లోపెజ్ కెమెరా బాధ్యతలను అప్పగించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…