టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండకు రాను రాను బాలీవుడ్ లో క్రేజ్ పెరిగిపోతోంది. విజయ్ తో కలిసి నటించేందుకు బాలీవుడ్ హీరోయిన్లు కూడా ఆసక్తి చూపుతున్నారు. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కుమార్తె సారా అలీ ఖాన్ టాలీవుడ్‌కు చెందిన హీరో విజయ్ దేవరకొండపై షాకింగ్ కామెంట్స్ చేసింది.
ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ విజయ్ పై తనకున్న అభిమానాన్ని వెల్లడించింది. తాజాగా సారా నటించిన చిత్రం అటట్రాంగి రే చిత్రం డిసెంబర్ 24న ఓటీటీలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా సారా ఇటీవల ఓ ఇంటరర్య్వూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమెను దక్షిణాదిలో ఏ హీరోతో చేయాలని ఉందని అడగ్గా వెంటనే విజయ్ దేవరకొండ పేరు చెప్పేసింది సారా.
విజయ్ చాలా హాట్ గా ఉంటాడని, కూల్ గా కూడా ఉంటాడని చెప్పింది. అతనితో కలిసి నటించాలని ఉందని తెలిపింది. విజయ్ తన ఫేవరెట్ స్టార్ అని చెప్పింది. విజయ్ తో సంబంధం గురించి ఆమె అంతకముందు కూడా ఒక సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అప్పట్లో ఈ ఫొటో తెగ వైరల్ అయింది. ఇద్దరు కలిసి డేటింగ్ లో ఉన్నారనే వార్తలు కూడా అప్పట్లో వైరల్ అయ్యాయి.
ప్రస్తుతం సారా విజయ్ తో నటించాలని ఉందన చెప్పడంతో ఆమె మాటలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇక విజయ్ దేవరకొండ ‘లైగర్’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. దీని ద్వారా అతడు బాలీవుడ్ లో ఎంటర్ కానున్నాడు. దీనికి నిర్మాతగ కరణ్ జోహార్, నటి చార్మిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది.
తెలంగాణలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా సామాజిక వర్గాల మధ్య కూడా విస్తృత చర్చకు…
ప్రతి నెలా వచ్చే అమావాస్య తిథి గురించి సాధారణంగా చాలా మందిలో అశుభ భావన ఉంది. ముఖ్య పనులు, శుభకార్యాలు…
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలవేంకటేశ్వర స్వామి ఆలయలో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు గురువారం భక్తి శ్రద్ధలతో దర్శనం…
ఇటీవల అంతర్జాతీయ రాజకీయ పరిణామాల మధ్య సోషల్ మీడియాలో ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారిన పేరు నటాలీ ఎ. బేకర్.…
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వ్యక్తిగత జీవితంపై గతంలో చక్కర్లు కొట్టిన ఓ పాత గాసిప్ మరోసారి చర్చనీయాంశంగా మారింది.…
విజయవాడలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం Sri Durga Malleswara Swamy Templeలో భక్తుల నుంచి వచ్చిన హుండీ ఆదాయం గణనీయంగా…