బిగ్ బాస్ హౌస్ లో అనుకున్నట్లుగానే జరిగింది. 14 వ వారం అన్ అఫిషియల్ కు సంబంధించిన ఓట్లలో కాజల్ కు మొదటి నుంచి కూడా ఓట్లు తక్కువగా వస్తున్నాయి. స్ట్రాటజీలతో ముందుకు సాగిన కాజల్ ఎట్టకేలకు ఇంటి బాట పట్టేసింది. శనివారం జరిగిన ఎపిసోడ్ లో టాప్ 5 కంటెస్టెంట్లలో రెండో వ్యక్తిగా సన్నీ ఎంటర్ అయ్యాడు.
మిగిలిన వారిలో ఎవరు టాప్ 5లో ఎంటర్ అవుతారు.. ఎవరు ఎలిమినేట్ అవుతారనేది శనివారం ఎపిసోడ్ ఎండింగ్ లో నాగార్జున తెలిపాడు. కానీ విశ్వసనీయ సమాచారం ప్రకారం కాజల్ ఎలిమినేట్ అయిందనేది తెలుస్తోంది. ఇక టాప్ 5 లోకి శ్రీరామ చంద్ర, సన్నీ, షణ్ముఖ్, సిరి మరియు మానస్ ఉన్నారు.
ఇక కాజల్ విషయానికి వస్తే.. ఆమె ఎప్పుడో హౌజ్ నుంచి వెళ్లిపోవాలి కానీ.. జెస్సీ కారణంగా ఎలిమినేషన్ నుంచి తప్పించుకుపోయింది. తర్వాత 12 వ వారంలో కూడా ఆమె ఎలిమినేషన్ నుంచి తప్పించుకుందనే చెప్పాలి. ఎవిక్షన్ పాస్ ద్వారా ఆమె సేవ్ అవ్వగా.. రవి ఎలిమినేట్ అయ్యాడు. ఎంట్రీ నుంచి కూడా ప్రతీ ఒక్కరికీ ఇచ్చి పడేస్తున్న కాజల్ తనదైన శైలిలో ముందుకు సాగింది.
ఆమె ఇన్ని రోజులు హౌజ్ లో ఉండటానికి కారణం సన్నీతో స్నేహం చేయడం అనేది ఒక కారణం. సన్నీ ఫ్యాన్స్ కూడా ఆమెను చాలా రోజులు సేవ్ చేస్తూ వచ్చారు. శ్రీరామచంద్ర, రవితో ఎక్కువగా గొడవలు పెట్టుకుంటూ.. ఆమెను వివిధ రకాల పేర్లతో పిలిచినా ఏ మాత్రం వెనకడుగు వేయకుండా ముందుకు సాగింది. దీంతోనే టాప్ 6 లో ఆమె కొనసాగింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…