Tag Archives: mexico

తన ఇద్దరు బిడ్డలను తుపాకీతో కాల్చి చంపేసిన కసాయి తండ్రి.. ఎందుకో తెలుసా..

చిన్న పిల్లలను చూస్తే ఎవరికైనా ముద్దు వస్తారు. వాళ్లు మాట్లాడే మాటలు.. ఎంతో మంచిగా అనిపిస్తాయి. వాళ్లు ఎంత అల్లరి చేసినా కొట్టడానికి కూడా మనసు రాదు. ఇక వాళ్లను కన్న తల్లిండ్రులకు అయితే వాళ్ల పట్ల ఉండే మమకారం, ప్రేమ మాటల్లో చెప్పలేం. ఓ తండ్రి మాత్రం వారి పాలిట యముడిలా మారాడు. కన్నబిడ్లలనే అతి కిరాతంగా హత్య చేశారు.

తుపాకీతో కాల్చి మరీ హత్య చేశారు. ఈ ఘటన అమెరికాలోని కాలిఫోర్నియాలో చోటుచేసుకుంది. కాలిఫోర్నియాకు చెందిన మాథ్యూ టేలర్ కోలెమన్ (40) తన ఇద్దరు పిల్లలను పిక్నిక్‌కి తీసుకెళ్లాడు. అందులో ఒక పిల్లాడికి రెండేళ్లు.. మరొకరికి 10 నెలలు మాత్రమే. అయితే తర్వాత అతడు తన ఫోన్ ను స్విచ్చాప్ చేశారు. ఇంటి దగ్గర నుంచి తన భార్య ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. దీంతో కంగారు పడిపోయిన తల్లి టేలర్‌‌పై పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో పోలీసులు ఓ యాప్ ద్వారా అతడి లొకేషన్ కనుక్కున్నారు. అతడు ఎక్కడ ఉన్నాడో తెలుసా.. దేశం దాటిపోయి మెక్సికోలోని రొసారిటోలో ఉన్నట్టు లొకేషన్ చూపించింది.

మళ్లీ రెండు రోజులకు బోర్డర్ దాటి అమెరికాలోకి ప్రవేశించినట్లు ఎఫ్‌బీఐ అధికారులు గుర్తించారు. వెంటనే అలెర్ట్ అయ్యి అతడిని అరెస్ట్ చేశారు. తన ఇద్దరు పిల్లలను చంపి మెక్సికోలో డెడ్ బాడీలను వదిలేసి వచ్చినట్లు పోలీసులకు తెలిపాడు. ఎందుకు చంపావ్ అని అడిగినందుకు సమాధానం ఇలా చెప్పాడు. ఆ పిల్లల వల్ల ప్రపంచానికి ప్రమాదం ఉందన్నాడు.

ఆ సమాధానం విని షాక్ అయిన ఎఫ్‌డీఐ అధికారులు పసి పిల్లలతో ప్రపంచానికి హాని ఏంటని ప్రశ్నించగా.. వాళ్లలో తల్లి ద్వారా విషపూరిత పాముల డీఎన్‌ఏ వచ్చిందని.. పెద్దయితే రాక్షసులుగా మారుతారని ఏవేవో కథలు చెప్పాడు. ఇవన్ని అతడు ఊహించుకున్నవేనని.. పిచ్చి ఆలోచనలతో తమ పసి పిల్లలను చంపేశాడని ఎఫ్‌బీఐ అధికారులు చెప్పారు. మెక్సికో అధికారుల సహకారంతో పిల్లల మృతదేహాలను వెనక్కి తెప్పించారు. ఆఘటనతో తల్లి తీవ్రంగా కన్నీరుమున్నీరుగా విలపించింది.

మొసలితో అక్క పోరాటం.. చెల్లి కోసం భారీ సాహసం!

సాధారణంగా మనం మొసలిని చూడటానికి ఎంతో భయపడతాము. ఒకవేళ మొసలి చేతిలో చిక్కామంటే ఇక మన ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే. మనం మొసలి చేతికి దొరికిన మనల్ని రక్షించడానికి బహుశా ఎవరు సాహసం కూడా చేయలేరు. కానీ 28 సంవత్సరాల యువతి తన చెల్లెలి కోసం ముసలితో బీకరమైన పోరాటం చేసి తన చెల్లెలు ప్రాణాలను కాపాడిన ఘటన మెక్సికోలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…

బ్రిటన్‌కు చెందిన ఓ కుటుంబం మెక్సికో పర్యటన వెళ్లారు. ఈ కుటుంబంలో జార్జియా, మెలిస్సా అనే ఇద్దరూ కావలల యువతులు ఉన్నారు. వీరందరూ కలిసి మెక్సికోలోని మానియాల్టేపెక్ లాగూన్ ప్రాంతానికి వెళ్లారు. మెక్సికోలోని ప్యూర్టో ఎస్కాండిడో పట్టణానికి అది 16 కి.మీ.దూరంలో ఉంటుంది. తక్కువ లోతుండే ఆ చెరువులో దిగి అందరూ ఎంతో సరదాగా ఈతకొడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తన చెల్లి మెలిసా కనిపించకపోవడంతో ఎంతో కంగారుపడిన అక్క జార్జియా తన చెల్లెలి కోసం వెతక సాగింది.ఈ క్రమంలోనే తన చెల్లి ఓ మొసలి బారిన పడిన విషయం గ్రహించిన ఆమె ఏ మాత్రం ఆలోచించకుండా తన చెల్లెలు ప్రాణాలు కాపాడటానికి ప్రయత్నించింది.

తన చెల్లెలను బంధించిన మొసలి పై ఎంతో భయంకరంగా పోరాడుతూ దాని మొహం పై పిడుగుద్దుల వర్షం కురిపించి చివరికి తన చెల్లిని మొసలి నుంచి కాపాడింది. అప్పటికే మొసలి దాడితో ఎంతో గాయాలపాలైన ఇద్దరు అక్కాచెల్లెళ్లను మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఆ చెరువులో భయంకరమైన మొసళ్ళు ఉంటాయని తమ గైడ్ చెప్పక పోవడం వల్లే ఇలాంటి ప్రమాదం చోటు చేసుకుందని మెలిసా తల్లిదండ్రులు తెలియజేశారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరిలో జార్జియా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వైద్యులు తెలుపగా
మెలిసా మాత్రం కోమాలోకి వెళ్ళినట్లు,ఆమె ఊపిరితిత్తులు మొత్తం నీరునిండిపోయి ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని వైద్యులు తెలియజేశారు. ఈ విషయం తెలిసిన నెటిజన్లు చెల్లి ప్రాణాలను కాపాడటం కోసం ప్రాణాలకు తెగించి మొసలితో పోటీ పడిన అక్క జార్జియా పై ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు.వీరిద్దరు తొందరగా కోలుకోవాలని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.