చిన్న పిల్లలను చూస్తే ఎవరికైనా ముద్దు వస్తారు. వాళ్లు మాట్లాడే మాటలు.. ఎంతో మంచిగా అనిపిస్తాయి. వాళ్లు ఎంత అల్లరి చేసినా కొట్టడానికి కూడా మనసు రాదు. ఇక వాళ్లను కన్న తల్లిండ్రులకు అయితే వాళ్ల పట్ల ఉండే మమకారం, ప్రేమ మాటల్లో చెప్పలేం. ఓ తండ్రి మాత్రం వారి పాలిట యముడిలా మారాడు. కన్నబిడ్లలనే అతి కిరాతంగా హత్య చేశారు.
తుపాకీతో కాల్చి మరీ హత్య చేశారు. ఈ ఘటన అమెరికాలోని కాలిఫోర్నియాలో చోటుచేసుకుంది. కాలిఫోర్నియాకు చెందిన మాథ్యూ టేలర్ కోలెమన్ (40) తన ఇద్దరు పిల్లలను పిక్నిక్‌కి తీసుకెళ్లాడు. అందులో ఒక పిల్లాడికి రెండేళ్లు.. మరొకరికి 10 నెలలు మాత్రమే. అయితే తర్వాత అతడు తన ఫోన్ ను స్విచ్చాప్ చేశారు. ఇంటి దగ్గర నుంచి తన భార్య ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. దీంతో కంగారు పడిపోయిన తల్లి టేలర్‌పై పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో పోలీసులు ఓ యాప్ ద్వారా అతడి లొకేషన్ కనుక్కున్నారు. అతడు ఎక్కడ ఉన్నాడో తెలుసా.. దేశం దాటిపోయి మెక్సికోలోని రొసారిటోలో ఉన్నట్టు లొకేషన్ చూపించింది.
మళ్లీ రెండు రోజులకు బోర్డర్ దాటి అమెరికాలోకి ప్రవేశించినట్లు ఎఫ్‌బీఐ అధికారులు గుర్తించారు. వెంటనే అలెర్ట్ అయ్యి అతడిని అరెస్ట్ చేశారు. తన ఇద్దరు పిల్లలను చంపి మెక్సికోలో డెడ్ బాడీలను వదిలేసి వచ్చినట్లు పోలీసులకు తెలిపాడు. ఎందుకు చంపావ్ అని అడిగినందుకు సమాధానం ఇలా చెప్పాడు. ఆ పిల్లల వల్ల ప్రపంచానికి ప్రమాదం ఉందన్నాడు.
ఆ సమాధానం విని షాక్ అయిన ఎఫ్‌డీఐ అధికారులు పసి పిల్లలతో ప్రపంచానికి హాని ఏంటని ప్రశ్నించగా.. వాళ్లలో తల్లి ద్వారా విషపూరిత పాముల డీఎన్‌ఏ వచ్చిందని.. పెద్దయితే రాక్షసులుగా మారుతారని ఏవేవో కథలు చెప్పాడు. ఇవన్ని అతడు ఊహించుకున్నవేనని.. పిచ్చి ఆలోచనలతో తమ పసి పిల్లలను చంపేశాడని ఎఫ్‌బీఐ అధికారులు చెప్పారు. మెక్సికో అధికారుల సహకారంతో పిల్లల మృతదేహాలను వెనక్కి తెప్పించారు. ఆఘటనతో తల్లి తీవ్రంగా కన్నీరుమున్నీరుగా విలపించింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…