సాధారణంగా మనం మొసలిని చూడటానికి ఎంతో భయపడతాము. ఒకవేళ మొసలి చేతిలో చిక్కామంటే ఇక మన ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే. మనం మొసలి చేతికి దొరికిన మనల్ని రక్షించడానికి బహుశా ఎవరు సాహసం కూడా చేయలేరు. కానీ 28 సంవత్సరాల యువతి తన చెల్లెలి కోసం ముసలితో బీకరమైన పోరాటం చేసి తన చెల్లెలు ప్రాణాలను కాపాడిన ఘటన మెక్సికోలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…
బ్రిటన్‌కు చెందిన ఓ కుటుంబం మెక్సికో పర్యటన వెళ్లారు. ఈ కుటుంబంలో జార్జియా, మెలిస్సా అనే ఇద్దరూ కావలల యువతులు ఉన్నారు. వీరందరూ కలిసి మెక్సికోలోని మానియాల్టేపెక్ లాగూన్ ప్రాంతానికి వెళ్లారు. మెక్సికోలోని ప్యూర్టో ఎస్కాండిడో పట్టణానికి అది 16 కి.మీ.దూరంలో ఉంటుంది. తక్కువ లోతుండే ఆ చెరువులో దిగి అందరూ ఎంతో సరదాగా ఈతకొడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తన చెల్లి మెలిసా కనిపించకపోవడంతో ఎంతో కంగారుపడిన అక్క జార్జియా తన చెల్లెలి కోసం వెతక సాగింది.ఈ క్రమంలోనే తన చెల్లి ఓ మొసలి బారిన పడిన విషయం గ్రహించిన ఆమె ఏ మాత్రం ఆలోచించకుండా తన చెల్లెలు ప్రాణాలు కాపాడటానికి ప్రయత్నించింది.
తన చెల్లెలను బంధించిన మొసలి పై ఎంతో భయంకరంగా పోరాడుతూ దాని మొహం పై పిడుగుద్దుల వర్షం కురిపించి చివరికి తన చెల్లిని మొసలి నుంచి కాపాడింది. అప్పటికే మొసలి దాడితో ఎంతో గాయాలపాలైన ఇద్దరు అక్కాచెల్లెళ్లను మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఆ చెరువులో భయంకరమైన మొసళ్ళు ఉంటాయని తమ గైడ్ చెప్పక పోవడం వల్లే ఇలాంటి ప్రమాదం చోటు చేసుకుందని మెలిసా తల్లిదండ్రులు తెలియజేశారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరిలో జార్జియా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వైద్యులు తెలుపగా
మెలిసా మాత్రం కోమాలోకి వెళ్ళినట్లు,ఆమె ఊపిరితిత్తులు మొత్తం నీరునిండిపోయి ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని వైద్యులు తెలియజేశారు. ఈ విషయం తెలిసిన నెటిజన్లు చెల్లి ప్రాణాలను కాపాడటం కోసం ప్రాణాలకు తెగించి మొసలితో పోటీ పడిన అక్క జార్జియా పై ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు.వీరిద్దరు తొందరగా కోలుకోవాలని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…