Tag Archives: Mint benefits

Mint Benefits: పుదీనాతో ఎన్ని ఉపయోగాలో తెలుసా..? ఆ సమస్యలు అన్నీ మాయం..

Mint Benefits: ప్రస్తుతం ఆహారపు అలవాట్లతో ఎక్కువ ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రజలు ముఖ్యంగా జంక్ ఫుడ్ తినటం ఉబకాయం, గుండె వ్యాధులకు కారణం అవుతుంది. మనం తీసుకున్న సంతులిత ఆహారం తోనే ఆరోగ్యాన్ని పొందవచ్చు.

Mint Benefits: పుదీనాతో ఎన్ని ఉపయోగాలో తెలుసా..? ఆ సమస్యలు అన్నీ మాయం..

కానీ బిజీ లైఫ్, టైం దొరకక పోవడం వల్ల ప్రజలు పిజ్జాలు, బర్గర్లు, న్యూడిల్స్ వంటి ఫాస్ట్ ఫుడ్ కు ఆహారానికి అలవాటు పడుతున్నారు. అయితే మన నిత్య జీవితంలో వాడే ఆకుకూరలు, కూరగాయలు, కరివేపాకు, పుదీనా వంటి వాటి నుంచి కూడా పోషక విలువలు పొందవచ్చు.

Mint Benefits: పుదీనాతో ఎన్ని ఉపయోగాలో తెలుసా..? ఆ సమస్యలు అన్నీ మాయం..

ముఖ్యంగా పుదీనా ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. మన పురాతన కాలం నుంచి పుదీనాను ఔషధంగా కూడా ఉపయోగిస్తున్నారు. ఏడాది పొడుగునా పుదీనా విరివిగా లభిస్తుంది. మనం తీసుకునే ఆహారంలో పుదీనాను కూడా చేర్చుకుంటే పలు పలు విటమిన్లను పొందవచ్చు. పుదీనాలో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి కానీ క్యాలరీలు తక్కువగా ఉంటాయి. వీటివల్ల శరీరానికి శక్తి లభిస్తుంది విటమిన్ ఏ, సీ,డీ, బి కాంప్లెక్స్ విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి చర్మం రక్షణకు ఎంతో తోడ్పడతాయి.

ఆస్తమాను అదుపులో పెట్టడంలో కూడా..

పుదీనాలో ఉండే మాంగనీస్, పొటాషియం, ఐరన్ వంటివి శరీరానికి చాలా అవసరం. వీటివల్ల శరీరంలో రక్తం పెరుగుతుంది. మెదడు పనితీరు మెరుగవుతుంది. ఆహారం జీర్ణం కావడం లో కూడా పుదీనా సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా ఆహారం జీర్ణం త్వరగా అవుతుంది. ఫలితంగా జీర్ణవ్యవస్థ పనితీరు బాగా మెరుగుపడుతుంది. ఆస్తమాను అదుపులో పెట్టడంలో కూడా సహకరిస్తుంది. తల నొప్పి తగ్గించడానికి పుదీనా రసంతో మసాజ్ చేస్తే నొప్పి తగ్గుతుంది. ఒత్తిడిని దూరం చేసుకోవడానికి పుదీనా వాసన చూస్తే చాలని నిపుణులు పేర్కొంటున్నారు. జీవక్రియ మెరుగుపరచడానికి అవసరమయ్యే గుణాలన్నీ పుదీనా లో ఉన్నాయని.. పుదీనా వల్ల బరువు కూడా తగ్గవచ్చనే అభిప్రాయాలున్నాయి. పుదీనాలో ఉండే సహజ ఆమ్లాలు జీవక్రియను మెరుగుపరుస్తాయి.. ఫలితంగా సహజసిద్ధంగా బరువును తగ్గించుకోవటానికి ఉపయోగపడుతాయని పరిశోధనలు తెలుపుతున్నాయి