Tag Archives: narasimha movie

Ramya Krishna: ఆ సీన్ చేసే ముందు ఎంతో మంది దేవుళ్లను ప్రార్థించాను… రమ్యకృష్ణ కామెంట్స్ వైరల్!

Ramya Krishna: టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి రమ్యకృష్ణ ఒకరు. తెలుగు తమిళ భాషలలో అగ్ర హీరోలందరి సరసన నటించిన ఈమె ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించి వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన జైలర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంతో సక్సెస్ అందుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా సక్సెస్ కావడంతో ఈమె ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఎన్నో విషయాలను తెలియజేస్తున్నారు.

ఈ సందర్భంగా రమ్యకృష్ణ మాట్లాడుతూ తాను రజనీకాంత్ గారితో కలిసి నరసింహ సినిమాలో నటించాలని ఈ సినిమా అతిపెద్ద బ్లాక్ బాస్టర్ కావడం చాలా విశేషమైన తెలిపారు. అయితే ఈ సినిమాలో తాను నీలాంబరి అనే పాత్రలో నటించానని ఈ పాత్ర పూర్తిగా నెగిటివ్ షేడ్స్ఉన్న పాత్ర అని తెలిపారు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో నీలాంబరిగా నేను సౌందర్య చెంపపై కాలు పెట్టే సన్నివేశంలో నటించాను. అయితే ఈ సన్నివేశం చేసే సమయంలో తాను చాలా ఇబ్బందులకు గురయ్యాను అంటూ ఈమె తెలియజేశారు.

Ramya Krishna: నటించలేకపోయాను…


ఈ సన్నివేశం గురించి రమ్యకృష్ణ మాట్లాడుతూ సౌందర్య పై పగ తీర్చుకోవడం కోసం అహంకారం ప్రదర్శించే సన్నివేశంలో నటించాల్సి వచ్చింది అయితే ఈ సన్నివేశం విన్న తర్వాత అది నేను చేయలేనని డైరెక్టర్ గారికి చెప్పడంతో ఆయన ఈ సీన్ చాలా అవసరమని చెప్పారు. ఇక డైరెక్టర్ గారు అలా చెప్పేసరికి చేసేది ఏమీ లేక తాను ఈ షాట్ పూర్తి చేశానని తెలిపారు. అయితే ఈ షార్ట్ చేయడానికి ముందు నేను దేవుళ్లను ప్రార్థించి మరి ఈ షార్ట్ చేశానని ఈమె తెలియజేశారు. ఈ సన్నివేశం షూట్ చేయడం పూర్తి అయిన తర్వాత కూడా రెండు మూడు రోజులపాటు తాను ఎంతో కంగారుగా ఆందోళనగానే ఉన్నాను అంటూ ఈ సందర్భంగా రమ్యకృష్ణ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Ramya Krishna: జీవితంలో నేను తీసుకున్న అత్యుత్తమమైన నిర్ణయం అదే… రమ్యకృష్ణ కామెంట్స్ వైరల్!

Ramya Krishna: సీనియర్ నటి రమ్యకృష్ణ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా.నటిగా పలు సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తున్నటువంటి ఈమె తాజాగా రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి ఆదరణ సంపాదించుకుంది. ఈ క్రమంలోనే ఈమె పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలలో కూడా పాల్గొన్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా రమ్యకృష్ణ ఓ ఇంటర్వ్యూలో హాజరయ్యారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె రజినీకాంత్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం గురించి పలు విషయాలు తెలియజేశారు. ఈ సందర్భంగా రమ్యకృష్ణ మాట్లాడుతూ తాను 1999వ సంవత్సరంలో రజనీకాంత్ సరసన నరసింహ సినిమాలో అవకాశమందుకొని స్క్రీన్ షేర్ చేసుకున్నాను సుమారు 24 సంవత్సరాల తర్వాత మరోసారి అవకాశం రావడం విశేషం అని తెలిపారు.

ఇక నరసింహ సినిమా గురించి రమ్యకృష్ణ మాట్లాడుతూ తాను రజనీకాంత్ తో నటించాలన్న ఉద్దేశంతో ఈ సినిమాలో తన పాత్ర ఏంటి అని కూడా ఆలోచించకుండా సినిమాకు కమిట్ అయ్యానని తెలిపారు.ఇందులో నాది ఫస్ట్ హీరోయిన్ పాత్రనా లేకపోతే సెకండ్ హీరోయిన్ పాత్రనా అన్న విషయాల గురించి కూడా తాను ఆలోచించలేదని తెలిపారు.

Ramya Krishna: ఎలా స్వీకరిస్తారో అనే భయం వేసింది


ఇక నాకు సినీ కెరియర్ లో నేను తీసుకున్నటువంటి అత్యుత్తమమైన నిర్ణయం ఏదైనా ఉంది అంటే అది నరసింహ సినిమాలో నటించడమేనని ఈమె తెలిపారు.ఇక ఈ సినిమాలో తాను సౌందర్య మొహంపై కాలు పెట్టే సన్నివేశం ఉంది. ఈ సన్నివేశం చేసే సమయంలో తాను ఎంతో భయపడ్డాను. ఈ సన్నివేశాన్ని ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారో అంటూ ఈ సందర్భంగా నరసింహ సినిమా విశేషాలను రమ్యకృష్ణ మరోసారి గుర్తు చేసుకున్నారు.

KS Ravi Kumar : సౌందర్య ముఖం పై రమ్యకృష్ణ కాలు పెట్టే సీన్.. షూటింగ్ లో ఆమె ఏడ్చింది, చేయనన్నారు.. కానీ చివరికి.!!

భాషా, ముత్తు, అరుణాచలం చిత్రాల అనంతరం మరొక సూపర్ హిట్ చిత్రంలో రజినీకాంత్ నటించాలనుకున్నారు. ఆ క్రమంలో.. దర్శకుడిగా కె ఎస్ రవికుమార్ అయితే బాగుంటుందని ఆయనను సంప్రదించారు. కథ ఎలాంటిదయితే బాగుంటుందనే ఆలోచనలో భాగంగా.. మాజీ ముఖ్యమంత్రి జయలలితను సూచిస్తూ.. జీవితంలో ‌ పంతాలకు, పట్టింపులకు పోయే మొండి పట్టుదలతో ఒక కథానాయిక కథ తయారు చేయమని రజినీకాంత్ దర్శకుడు రవికుమార్ తో చెప్పారు.

ఆ క్రమంలో పుట్టుకొచ్చినదే “నరసింహ” చిత్రం కథ. నరసింహ సినిమా చిత్రీకరణకు ముందు దర్శకుడు కె.ఎస్ రవికుమార్ చిరంజీవి తో తెలుగులో “స్నేహం కోసం” చిత్రాన్ని రూపొందిస్తున్నారు. పొగరు, మొండి పట్టుదల గల ఈ పాత్రకు(నరసింహ-నీలాంబరి) హీరోయిన్ ఎవరైతే బాగుంటుంది అనుకునే క్రమంలో.. హీరోయిన్స్ నగ్మా, మీనా పేర్లు తెరపైకి వచ్చాయి. స్నేహంకోసం చిత్రంలో చిరంజీవితో జోడిగా మీనా నటిస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ కొనసాగుతున్న సందర్భంలో ఒక సీన్ లో మీనా అగ్రెసివ్ లుక్ ఇవ్వాలి. ఆ సీన్ లో మీనా బాగా నటిస్తున్నారు కానీ అగ్రెసివ్ లుక్ ఆమె ఫేస్ లో రావడంలేదని దర్శకుడు కె.ఎస్ రవికుమార్ అనుకున్నారు.

తిరిగి చెన్నైలో రజనీకాంత్ ఆరగెంట్ క్యారెక్టర్(పొగరుబోతు నీలాంబరి పాత్ర)కి మీనా ను అనుకున్నాం కదా ఏమయిందని కె.ఎస్.రవికుమార్ అని అడగగా.. స్నేహం కోసం సినిమా షూటింగ్ లో ఓ డైలాగ్ చెప్తున్నప్పుడు ఎందుకో మీనా పొగరుగా కనిపించడం లేదని దర్శకుడు రవికుమార్ రజనీకాంత్ తో అన్నారు. అయితే ఆ పొగరుబోతు పాత్రకి ఎవరైతే బాగుంటుందో మీరే ఆలోచించండని రజినీకాంత్ కె.ఎస్.రవికుమార్ తో అన్నారు. ముందుగా ప్రముఖ నటి నగ్మా ను ఆ పాత్రకి ఎంపిక చేయాలనుకున్నప్పటికీ.. ఆమె ఇతర సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇకపోతే కె ఎస్ రవికుమార్, రమ్యకృష్ణతో అంతవరకు ఒక్క సినిమా కూడా రూపొందించలేదు. కానీ ఆమెతో కె.ఎస్.రవికుమార్ కి పరిచయం ఉంది. ఆ విధంగా “నరసింహా” చిత్రంలోని నీలాంబరి పాత్రకు రమ్యకృష్ణను తీసుకున్నారు.

నరసింహ చిత్రంలో రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి పాత్ర అవుట్ అండ్ అవుట్ ఆరగెంట్ క్యారెక్టర్. రజినీకాంత్ తో ఇలాంటి రోల్ చేయడానికి ముందుగా రమ్యకృష్ణ ఆలోచించి నప్పటికీ ఆ పాత్రను సవాల్ గా తీసుకుని ఆ చిత్రంలో నటించాలనుకున్నారు. సింపుల్ గా స్టోరీ అవుట్ లైన్..
నరసింహ (రజనీకాంత్) ఒక జమీందారు (శివాజీ గణేశన్) కొడుకు. పట్నంలో చదువుకుని ఊరికి వస్తాడు. తన మేనమామ కూతురైన నీలాంబరి (రమ్యకృష్ణ) గర్విష్టి. ఆమె నరసింహను పెళ్ళి చేసుకోవాలనుకుంటుంది. కానీ నరసింహకు మాత్రం ఆమె ప్రవర్తన నచ్చదు. నీలాంబరి ఇంట్లో పనిచేసే వసుంధర (సౌందర్య) ను ఆరాధిస్తుంటాడు. ఈ క్రమంలో నరసింహాను పగబట్టిన నీలాంబరి, నరసింహా ప్రేమించే వసుంధరపై తీవ్రమైన ఆవేశంతో ఉంటుంది.

అయితే నరసింహ సినిమా షూటింగ్ సమయంలో… రమ్యకృష్ణ కోపంతో సౌందర్య ముఖంపై తన కాలి పాదంతో… ఏమిటి ఏడుస్తున్నావా? నీ స్థితి ఏమిటి?. నీ పరిస్థితి ఏమిటి..? నువ్వు వెన్నెల్లో గోరుముద్దలు తినుంటావు.. కానీ నేను తలుచుకుంటే చంద్రమండలంలో తినగలను అంటూ… రమ్యకృష్ణ, సౌందర్య చెంపపై తన కాలితో అటు.. ఇటు అనే సన్నివేశం ఉంటుంది. ఈ సన్నివేశాన్ని ముందుగా రామకృష్ణకు చెప్పడంతో… సౌందర్యను అలా కాలుతో అనడం ఇబ్బందిగా ఫీల్ అయింది. కానీ దర్శకుడు ఒత్తిడి చేయడంతో అలా నేను చేయనని ఏడ్చింది.

చివరికి సౌందర్య, దర్శక నిర్మాతలు చెప్పడంతో ఆ సన్నివేశాన్ని చేయడానికి రమ్యకృష్ణ ఒప్పుకున్నారు. నీలాంబరి పాత్ర సినిమాకి హైలెట్ గా నిలిచింది. ఒక విధంగా చెప్పాలంటే తెలుగులో అద్భుత విజయాన్ని సాధించిన “బాహుబలి” చిత్రంలో రమ్యకృష్ణ శివగామి పాత్ర రావడానికి నరసింహ చిత్రంలోని నీలాంబరి పాత్ర అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. నరసింహ సినిమాలో రజనీకాంత్, రమ్యకృష్ణ కాంబినేషన్ బాగా వచ్చిందని ఆనాటి నరసింహ సినిమా ‌షూటింగ్ విశేషాలను ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు కె.ఎస్.రవికుమార్ చెప్పుకొచ్చారు.