Tag Archives: netizens trolls

Pawan Kalyan: నిర్మాతల డబ్బుతో పార్టీ ప్రచారం… గ్లాస్ డైలాగ్స్ పై నెటిజెన్స్ సెటైర్స్?

Pawan Kalyan: ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలు అంటే ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసే వారు. ఇక అభిమానుల సంగతి చెప్పాల్సిన పనిలేదు పెద్ద ఎత్తున అభిమానులు పవన్ కళ్యాణ్ సినిమా వస్తే చేసే హంగామా మాటల్లో వర్ణించలేనిది అయితే ఇటీవల కాలంలో ఈయన ఫోకస్ పూర్తిగా తగ్గిపోయిందని చెప్పాలి.

పవన్ కళ్యాణ్ సినిమాలను సినిమాలుగా కాకుండా రాజకీయాలను రాజకీయాలుగా కాకుండా రెండిటిని కలిపి చేయటంతో ఎటు కాకుండా పోతున్నారు. ఈయన సినిమాలలో తన రాజకీయ పార్టీకి సంబంధించిన డైలాగ్స్ పెడుతూ ప్రజలచేత చీ కొట్టించుకుంటున్నారు. ఇలా అటు సినిమాలకు ఇటు రాజకీయాలకు కాకుండా ఉన్నారు.

ఇకపోతే ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ సినిమాలలో ఎక్కువగా రాజకీయానికి సంబంధించినటువంటి సన్నివేశాలు అధికమవుతున్నాయి. ఇటీవల బ్రో సినిమాల్లో కూడా ఈయన తన ప్యాకేజీ పాలిటిక్స్ చూపించారు అయితే తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కూడా మరోసారి ప్యాకేజీ పాలిటిక్స్ చూపించారు.

గ్లాస్ అంటే సైన్యం..
గ్లాస్ పగిలే కొద్ది పదునెక్కువ గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం అంటూ ఈయన చెప్పిన డైలాగ్స్ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నేటిజన్స్ ఈ డైలాగ్ లు వేస్తున్నారు అసలు ఇది సినిమా కోసం చేసావా లేకుంటే నీ పార్టీ ప్రచారం కోసం చేసుకున్నారా అంటూ కామెంట్లో చేస్తున్నారు. ఆయన పాలిటిక్స్ విషయంలో పవన్ కి ఎవరు సాటిరారని తన సొంత డబ్బు ఖర్చు కాకుండా నిర్మాతల చేత డబ్బు ఖర్చు పెట్టి పార్టీ ప్రచారం చేస్తున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు.

Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ బ్రెయిన్ లెస్ బిగ్ బాస్ విన్నర్… భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజెన్స్!

Pallavi Prashanth: బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ కార్యక్రమం ఇటీవల ఎంతో విజయవంతంగా పూర్తి అయింది. అయితే ఈ కార్యక్రమంలో విన్నర్ గా కామన్ మ్యాన్ రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ నిలవడం విశేషం అయితే హౌస్ లో కొన్నిసార్లు సింపతి డ్రామాలు ప్లేస్ చేసినప్పటికీ ఎంతో అద్భుతంగా ఆడటంతో టాప్ వరకు చేరుకున్నారు. అయితే గ్రాండ్ ఫినాలే రోజు పల్లవి ప్రశాంత్ అభిమానులు చేస్తున్నటువంటి పిచ్చి పనులు అందరికీ ఎంతో ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి.

గ్రాండ్ ఫినాలే రోజు తప్పకుండా ట్రాఫిక్ జామ్ అవుతుందని కొన్ని రూల్స్ పెట్టడం సర్వసాధారణమైనటువంటి అంశం కానీ పల్లవి ప్రశాంత్ అభిమానులు మాత్రం అతి ఉత్సాహం చూపెడుతూ అక్కడ ఉన్నటువంటి కంటెస్టెంట్ల కార్లపై దాడి చేయడం అలాగే ఆర్టీసీ బస్సులపై దాడి చేయడం వంటి చర్యలకు పాల్పడటంతో పెద్ద ఎత్తున ఈ చర్యలను వ్యతిరేకిస్తూ సోషల్ మీడియా వేదికగా నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

పల్లవి ప్రశాంత్ విన్నర్ కాకపోయినా బయట ట్రాఫిక్ జామ్ అవుతుందన్న కారణంతో ఎన్నో రూల్స్ పెడతారు కానీ పల్లవి ప్రశాంత్ అభిమానులు మాత్రం ఏదో తనని తొక్కేస్తున్నారన్న ఉద్దేశంతో ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని పల్లవి ప్రశాంత్ బ్రెయిన్ లెస్ బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ కామెంట్ల పై పలువురు బిగ్ బాస్ రివ్యూస్ కూడా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఈయనపై కేసు కూడా నమోదు చేశారని పోలీసులు ట్రాఫిక్ ఇబ్బందులను ఆలోచించే ర్యాలీ చేయకూడదని చెప్పినప్పటికీ ఈయన ర్యాలీ ద్వారా బయటకు వెళ్లారని ఆయన పై కేసు నమోదు చేశారు.

ఇలా కేసు నమోదు చేయడంతో అక్కడ కూడా పోలీసుల ఎదుట పల్లవి సింపతి డ్రామా ప్లే చేశారు. ఇక పోలీసులను బ్రతిమిలాడిన వినకపోవడంతో పోలీసుల పట్ల కూడా ఆర్గ్యూ చేయడమే కాకుండా వీడియోలు తీయాలంటూ కూడా రెచ్చగొట్టారు. బిగ్ బాస్ విన్నర్ అయిన తర్వాత సెలబ్రేట్ చేసుకోవడం సర్వసాధారణం కానీ ట్రాఫిక్ జామ్ అవుతుందన్న కారణంగా అక్కడ పరిస్థితులను గురించి ఆలోచించి వారికి కోపరేట్ చేయాల్సిన అవసరం ఉందని రివ్యూయర్ పేర్కొన్నారు.

ఓటు వేయమని డబ్బు ఇచ్చినట్టే..

అదేవిధంగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొనగా ఈయన ఆ ఇంటర్వ్యూకు వచ్చిన మనీని మొత్తం ముందుగానే రైతులకు ఇవ్వాలంటూ అడిగారు దీంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నార. హౌస్ లో ఉన్నప్పుడు తాను విన్ అయితే రైతులకు ఇస్తానని చెప్పారు అలాంటిది ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ వాళ్లను ఇవ్వమనడం ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు నువ్వు కూడా ముందుగానే రైతులకు డబ్బులు పంచి బిగ్ బాస్ కి రావచ్చు కదా అలా కాకుండా గెలిస్తే ఆ డబ్బును రైతులకు ఇస్తాను అని చెబితే దాని అర్థం ఏంటి నాకు ఓట్లు వేయండి మీకు డబ్బు ఇస్తానని చెప్పడమే కదా అంటూ పలువురు ఈయన మాట తీరుపై మండిపడుతున్నారు కప్పు గెలిచే వరకు ఒకలా గెలిచిన తర్వాత మరొకల ఈయన ప్రవర్తిస్తున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.