Tag Archives: Pallavi Prashanth

Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ కి పేద రైతులు దొరకలేదా.. ప్రైజ్ మనీ విషయంలో మోసం చేసినట్టేనా?

Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ పరిచయం అవసరం లేని పేరు. ఒక సాధారణం వ్యక్తిలాగా బిగ్ బాస్ కార్యక్రమంలోకి అడుగుపెట్టి అనంతరం సెలబ్రిటీగా మారినటువంటి పల్లవి ప్రశాంత్ పెద్ద ఎత్తున అభిమానులను సొంతం చేసుకున్నారు. బిగ్ బాస్ కార్యక్రమంలో ఈయన ఆట తీరుతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

ఇక ఈ కార్యక్రమానికి విన్నర్ గా నిలిచినటువంటి పల్లవి ప్రశాంత్ ఆ డబ్బును తాను వాడుకోనని పేద రైతులకు పంచుతానని మాట ఇచ్చారు. అయితే ఈయన బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చి కూడా దాదాపు నాలుగు నెలలు అవుతుంది ఇప్పటివరకు పెద్దగా సహాయ కార్యక్రమాలు చేసిన సందర్భాలు మాత్రం కనిపించలేదు దీంతో ఈయన పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.

ఈ విధంగా పల్లవి ప్రశాంత్ పట్ల విమర్శలు రావడంతో ఒక కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయంతో పాటు ఏడాదికి సరిపడా బియ్యం కూడా అందించారు. ఇందుకు సంబంధించిన వీడియోని కూడా ఈయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇకపై కూడా మరికొంతమంది రైతులకు తాను సహాయం చేస్తానని నేను చేసే సహాయానికి సంబంధించిన వీడియోలను అందరితో పంచుకుంటానని తెలిపారు.

డబ్బు పంచడం ఇష్టం లేదా..
ఇక ఈయన సహాయం చేసి కూడా చాలా రోజులు అవుతుంది. ఇప్పటివరకు మరో వీడియో షేర్ చేయలేదు. అయితే తాను పేద రైతులను గుర్తించి వారికి మాత్రమే సహాయం చేస్తానని తెలిపారు. ఇక తన ఇంటి వద్దకు ఎవరు కూడా సాయం చేయమని రావద్దని తానే పేదవారిని గుర్తించి సాయం చేస్తానని చెప్పారు. అయితే ఇప్పటివరకు ఈయన పేదవారిని గుర్తించలేకపోతున్నారా లేకపోతే డబ్బు పంచడం ఈయనకు ఇష్టం లేదా అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.

Pallavi Prashanth: ఖైదీలందరూ అలా మాట్లాడేవారు.. జైలు జీవితం పై పల్లవి ప్రశాంత్ కామెంట్స్!

Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ పరిచయం అవసరం లేని పేరు. ఒక సాధారణ రైతుబిడ్డగా పొలం పనులు చేసుకుంటూ ఉన్నటువంటి ఈయన ఎన్నో రకాల వీడియోలు చేస్తూ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫేమస్ అయ్యారు. ఇలా యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ ఉన్నటువంటి ఈయనకు బిగ్ బాస్ అవకాశం రావడంతో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టారు. హౌస్ లోకి అడుగు పెట్టినటువంటి ప్రశాంత్ అనంతరం విన్నర్ గా బయటకు వచ్చారు.

ఇక గ్రాండ్ ఫినాలే రోజు ఈయన అభిమానులు చేసిన హంగామా గురించి మనకు తెలిసిందే. పెద్ద ఎత్తున కార్లు ధ్వంసం చేయడమే కాకుండా ప్రభుత్వ ఆస్తులను కూడా ధ్వంసం చేయడంతో ఈయనపై కేసులు పెట్టి జైలుకు పంపించారు. అయితే బెయిలు మీద బయటకు వచ్చినటువంటి పల్లవి ప్రశాంత్ తన రెండు రోజుల జైలు జీవితం గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

తాను రెండు రోజులపాటు జైలులో చాలా ఇబ్బంది పడ్డాను అని తెలిపారు. బాధతో భోజనం కూడా చేయలేదని కానీ తోటి ఖైదీలు చెప్పడంతో భోజనం చేశానని జైలు కూడు బాగుందని తెలిపారు. నన్ను వీఐపీ ఇలా ట్రీట్ చేసిన లేక సాధారణంగా ట్రీట్ చేసిన కూడా అక్కడ భోజనం బాగుందని ఈయన వెల్లడించారు. ఇక ఖైదీలు అందరూ కూడా నాతో మాట్లాడుతూ బిగ్ బాస్ గురించి ప్రశ్నలు వేసే వాళ్ళు విన్నర్ ఎవరంటూ కూడా అడిగేవారు.

బిగ్ బాస్ గురించి అడిగేవారు..
ఇక నేను వెళ్ళిన తర్వాత జైలుకు వచ్చిన వారు బయట జరిగిన గొడవ గురించి తెలిపే వారని ప్రశాంత్ తెలిపారు. అయితే నేను జైలులో ఉంటే ఏ మాత్రం భయపడలేదు నేను తప్పు చేయలేదు అందుకే ఎవరికి భయపడలేదని కానీ నాపై విమర్శించిన వారికి కూడా అదే గతే పడుతుంది అంటూ ఈ సందర్భంగా జైలు జీవితం గురించి ప్రశాంత చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Pallavi Prashanth: రైతులు సాయం కోసం ఎవరు మా ఇంటికి రావద్దు.. ట్విస్ట్ ఇచ్చిన పల్లవి ప్రశాంత్!

Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ ఒక కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి అనంతరం సెలబ్రెటీగా బయటకు వచ్చారు.ఈయన బిగ్ బాస్ హౌస్ లో ఆట తీరు చూసి ఎంతో మంది ఈయనకు అభిమానులకు మారిపోయి చివరికి విన్నర్ గా తనని గెలిపించారు. ఇలా విన్నర్ గా బయటకు వచ్చిన పల్లవి ప్రశాంత్ బయట మాత్రం సెలబ్రిటీ హోదా అనుభవిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

ఇక ఈయన బిగ్ బాస్ కార్యక్రమంలో ఉన్నప్పుడు వచ్చే ప్రైజ్ మనీ మొత్తం పేద రైతులకు అందిస్తానని చెప్పారు కానీ ఇన్ని రోజులపాటు ఈ పని చేయకుండా ఉండడంతో మాట తప్పారని అందరు కామెంట్ చేశారు కానీ ఇటీవల ఈయన ఒక కుటుంబానికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం ఏడాదికి సరిపడా బియ్యం బస్తాలను అందించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.

అయితే ఇంకా తన వద్ద డబ్బు ఉంది తన టీం మొత్తం పేద రైతులను పరిశీలించి వారి గురించి అన్ని తెలుసుకునే వారికే డబ్బు అందజేస్తారని పల్లవి ప్రశాంత్ తెలిపారు అందుకు సంబంధించిన వీడియోలను కూడా మీకు తెలియజేస్తానని తెలిపారు. ఇక ఈయన పేదల రైతులకు సహాయం చేస్తానని చెప్పడంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎంతోమంది తాము పేద రైతులను తమకు సహాయం చేయండి అంటూ తన ఇంటికి క్యూ కట్టారట.

డబ్బు కోసం రావద్దు..
ఇలా పెద్ద ఎత్తున రైతులు సహాయం కావాలి అంటూ తన ఇంటికి రావడంతో ఈయన వారందరిని ఒకటే వేడుకున్నారు డబ్బు సహాయం చేయమని దయచేసి ఎవరూ మా ఇంటికి రావద్దు అమ్మ నాన్నలను విసిగించవద్దు. ఎవరు పేదవారు అనే విషయాలను మేమే తెలుసుకొని స్వయంగా వారి దగ్గరకు మేమే డబ్బు తీసుకువస్తామని అంతవరకు ఎవరు మా ఇంటికి రావద్దు అంటూ ఈయన చేసినటువంటి పోస్ట్ వైరల్ అవుతుంది.

Pallavi Prashanth: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రైతుబిడ్డ.. ఏకంగా లక్ష సాయం?

Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ పరిచయం అవసరం లేని పేరు బిగ్ బాస్ 7 కార్యక్రమంలోకి ఒక కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చినటువంటి ఈయన అనంతరం ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక బిగ్ బాస్ విన్నర్ గా నిలిచిన పల్లవి ప్రశాంత్ ప్రస్తుతం సెలబ్రెటీ హోదాని అనుభవిస్తూ ఎంతో మంది అభిమానులను కూడా సొంతం చేసుకున్నారు..

ఇక ఈయన బిగ్ బాస్ కార్యక్రమంలో ఉన్నప్పుడు తాను కనుక విజేతగా నిలబడితే నాకు వచ్చే ప్రైజ్ మనీ రైతుల కోసం ఇస్తానని పేద రైతులకు ఆ డబ్బును ఇచ్చి వారికి కుటుంబాలకు అండగా నిలబడతానని తెలిపారు. ఇలా బిగ్ బాస్ కార్యక్రమం పూర్తి అయి దాదాపు మూడు నెలలు అయినప్పటికీ ఇప్పటివరకు ఈయన ఎవరికి సహాయం చేయలేదు.

ఈ విధంగా పల్లవి ప్రశాంత్ రైతులకు సహాయం చేయకపోవడంతో ఈయన గురించి పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయి. మాట ఇచ్చి మర్చిపోయారని చాలామంది ఈయన పట్ల ట్రోల్ చేశారు అయితే తాజాగా పల్లవి ప్రశాంత్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. తాను బిగ్ బాస్ కార్యక్రమంలో గెలుచుకున్నటువంటి డబ్బును రైతులకు పంచే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు.

సందీప్ మాస్టర్ సహాయం..
ఈ క్రమంలోనే గజ్వేల్ లోని కొలుగూరు గ్రామానికి చెందినటువంటి ఒక రైతు కుటుంబానికి ఏకంగా లక్ష రూపాయల సహాయం అందించారు. తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారుల కోసం ఈయన లక్ష రూపాయలు సహాయం చేయడమే కాకుండా ఏడాదికి సరిపడా బియ్యం కూడా పంపించారు. అయితే ఈయనకు తోడుగా సందీప్ మాస్టర్ కూడా 25 వేల రూపాయలను ఆ కుటుంబానికి అందించటం విశేషం.

https://www.instagram.com/reel/C4hFzPoy1FW/?utm_source=ig_embed&ig_rid=86493dee-ff8d-4225-aa50-19b92221d241

Pallavi prashanth: 35 లక్షల గెలిచిన ప్రశాంత్ రైతులకు అంత తక్కువ పంచుతున్నారా.. అసలేం జరిగిందంటే?

Pallavi prashanth: పల్లవి ప్రశాంత్ పరిచయం అవసరం లేని పేరు. ఒక రైతు బిడ్డగా యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ ఉన్నటువంటి ఈయనకు భారీ స్థాయిలో అభిమానులు పెరిగిపోయారు. ఇలా సోషల్ మీడియా ద్వారా ఎంతో పాపులర్ అయినటువంటి పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు.

ఇలా బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో ఫేమస్ అవ్వడమే కాకుండా టైటిల్ విన్నర్ గా నిలిచినటువంటి ఈయనకు 35 లక్షల రూపాయల ప్రైస్ మనీతో పాటు ఒక డైమండ్ నెక్లెస్ అలాగే కారు కూడా బహుమానంగా వచ్చిన సంగతి తెలిసిందే అయితే తాను గెలిచిన ఈ డబ్బును పేద రైతులకు సహాయంగా ఇస్తానని గతంలో ప్రశాంత్ ప్రకటించారు.

ఇప్పటివరకు ఈ సహాయం చేయకపోవడంతో మాట తప్పారు అంటూ ఈయన పట్ల విమర్శలు వచ్చాయి. తాజాగా ఈ విమర్శలపై పల్లవి ప్రశాంత్ మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. తాను ప్రాణం పోయిన ఇచ్చిన మాట తప్పనని పల్లవి ప్రశాంత్ తెలిపారు. త్వరలోనే రైతులకు ఇవ్వాల్సిన డబ్బును మొత్తం ఇవ్వబోతున్నానని తెలిపారు.

ప్రాణం పోయినా మాట తప్పను..

ఈయన 35 లక్షల రూపాయలు గెలుచుకోగా టాక్స్ కట్ అవుతూ ఈయనకు కేవలం 16 లక్షల రూపాయలు మాత్రమే చేతికి అందిందని ఈ పదహారు లక్షల రూపాయలను మాత్రమే పల్లవి ప్రశాంత్ రైతులకు పంచ బోతున్నారని తెలుస్తుంది. ఇక ఈయన బిగ్ బాస్ గెలిచిన తర్వాత ఇతర బుల్లితెర కార్యక్రమాలలో బిజీగా గడుపుతూ ఉన్నారు.

Pallavi prashanth: మొదటిసారి అరెస్టుపై స్పందించిన పల్లవి ప్రశాంత్.. చచ్చిపోవాలనిపించింది అంటూ కామెంట్స్?

Pallavi prashanth: పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డగా బిగ్ బాస్ కార్యక్రమంలో అందరికీ పరిచయమయ్యారు. అంతకుముందు యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ ఉన్నటువంటి ప్రశాంత్ బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా మరింత మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంట్రీ ఇచ్చినటువంటి ఈయన కప్పు గెలుచుకొని సెలబ్రిటీ అయ్యారు.

ఇక హౌస్ లో ఉన్నప్పుడు ఈయనకు అమర్ తో జరిగిన గొడవ కారణంగా గ్రాండ్ ఫినాలే రోజు ఈయన అభిమానులు అమర్ కారు పై దాడి చేశారు. ఈ దాడిలో భాగంగా పలువురు సెలబ్రిటీల కార్లు ధ్వంసం కావడమే కాకుండా ప్రభుత్వ ఆస్తులు ప్రభుత్వం కావడంతో పల్లవి ప్రశాంత్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

ఇలా రెండు రోజులపాటు జైలులో ఉన్నటువంటి ప్రశాంత్ అనంతరం బెయిల్ మీద బయటకు వచ్చారు. ఇలా విడుదలైనటువంటి ఈయన పలు కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే బిబి ఉత్సవ్ కార్యక్రమంలో కూడా పల్లవి ప్రశాంత్ పాల్గొని సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన మొదటిసారి తన అరెస్టు గురించి స్పందిస్తూ ఎమోషనల్ అయ్యారు.

నాన్న కళ్ళల్లో ఆనందం చూడాలనుకున్న…

నేను బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొని ఎలాగైనా కప్పు గెలుచుకుని తన తండ్రి కళ్ళల్లో ఆనందం చూడాలని అనుకున్నాను కానీ జైలుకు వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు. అయితే నేను జైలులో ఉన్నప్పుడు నాన్న కోర్టు దగ్గర పడుకున్న వీడియోలు చూసి ఆ క్షణం నేను ఇంకా ఎందుకు బ్రతికి ఉన్నానా అనిపించింది అంటూ ఈ సందర్భంగా పల్లవి ప్రశాంత్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Pallavi prashanth: ఇచ్చిన మాట మరిచి తెగ ఎంజాయ్ చేస్తున్న రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్!

Pallavi prashanth: రైతు బిడ్డగా బిగ్ బాస్ కార్యక్రమంలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో పల్లవి ప్రశాంత్ ఒకరు. ఈయన రైతు బిడ్డగా యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ ఎంతో పాపులర్ అయ్యారు. ఇలా యూట్యూబ్ వీడియోల ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ కార్యక్రమంలోకి వచ్చి మరింత మంది అభిమానులను సొంతం చేసుకోవడమే కాకుండా ఏకంగా టైటిల్ కూడా గెలుపొందారు.

ఇక తాను బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు తాను ఈ కార్యక్రమంలో విన్నర్ గా నిలబడితే బిగ్ బాస్ ద్వారా వచ్చిన డబ్బును మొత్తం పేద రైతులకు పంచుతానని ఈయన తెలిపారు. అందుకు సంబంధించిన వీడియోలను కూడా అభిమానులతో పంచుకుంటానని ప్రతి రూపాయికి తాను లెక్క చెబుతానని ప్రశాంత్ తెలిపారు.

ఇలా ప్రతి రూపాయికి లెక్క చెబుతానని పదేపదే చెప్పినటువంటి ప్రశాంత్ ఇచ్చిన మాట మర్చిపోయారని తాజాగా ఆయన వ్యవహారం చూస్తేనే అర్థమవుతుంది. డబ్బులు రైతులకు పంచుతానని చెప్పిన ప్రశాంత్ ఆ మాట మర్చిపోయారని ఇప్పటివరకు ఈయన రైతులకు డబ్బు పంచిన ఒక్క వీడియో కూడా బయటకు రాలేదని తెలుస్తుంది. అయితే ఈయన బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత రైతు బిడ్డ అనే ట్యాగ్ నుంచి సెలబ్రిటీ అనే ట్యాగ్ తగిలించుకున్నారు

పొలం పనులు చేయటం కష్టమే..

ఈయన ఇటీవల కాలంలో పొలం పనులు చేస్తూ కూడా కనిపించలేదు కానీ పెద్ద ఎత్తున పార్టీలు షోస్ అంటూ హైదరాబాద్లోనే సెలబ్రిటీ హోదాని అనుభవిస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో పలువురు ఈయన వ్యవహార శైలిపై కామెంట్లు చేస్తూ ఒకసారి లగ్జరీ లైఫ్ కి అలవాటు పడిన తర్వాత ఎండలో పొలం పనులు చేయడం కష్టమే అంటూ పలువురు ఈయన వ్యవహార శైలి పై కామెంట్లు చేస్తున్నారు.

Pallavi prashanth: బర్రెలక్కతో పెళ్లి పై స్పందించిన ప్రశాంత్… నా చెల్లి అంటూ ఎమోషనల్ కామెంట్స్!

Pallavi prashanth: బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు పొందినటువంటి పల్లవి ప్రశాంత్ ఒకరు. ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున పెళ్లి వార్తలలో నిలిచిన సంగతి మనకు తెలిసిందే. పల్లవి ప్రశాంత్ బర్రెలక్క పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వీరి గురించి పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయ్యాయి. ఇలా ఈ వార్తలపై ఇప్పటికే బరెలక్క స్పందించారు.

పల్లవి ప్రశాంత్ నాలాగే ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి అందుకే ఆయన బిగ్ బాస్ కార్యక్రమంలో ఉన్నప్పుడు నేను తనకు సపోర్ట్ చేశాను ఆయనను నాకు అన్నయ్యతో సమానం అంటూ ఈమె ఈ పెళ్లి వార్తలను ఖండించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పెళ్లి వార్తలపై పల్లవి ప్రశాంత్ కూడా స్పందించారు.

ఈ పెళ్లి వార్తలపై పల్లవి ప్రశాంత్ స్పందిస్తూ తన గురించి శిరీష గురించి వస్తున్నటువంటి పెళ్లి వార్తలలో ఏమాత్రం నిజం లేదని కొందరు ఉద్దేశం పూర్వకంగానే ఇలాంటి వార్తలను వైరల్ చేస్తున్నారని తెలిపారు. ఆమె నా చెల్లితో సమానం ఒక అన్నయ్యగా తనకు జీవితాంతం తోడుగా ఉంటానని తనకు ఏ అవసరం వచ్చిన అన్నయ్యగా నా చెల్లిని ఆదుకుంటాను అంటూ పెళ్లి వార్తలను పూర్తిగా ఖండించారు.

అన్నయ్యగా తోడుంటా…

ఇక వీరిద్దరూ సామాన్య మధ్య తరగతి కుటుంబానికి చెందినవారు. ఒకరు బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లి సెలబ్రెటీ హోదా సొంతం చేసుకోగా మరొకరు తెలంగాణ ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి వార్తలలో నిలిచారు. ఈమె ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటి చేయడంతో అందరి ఆ టెన్షన్ ఈమె పైనే ఉంది ఈ ఎన్నికలలో ఈమె గెలవలేకపోయినా సెలబ్రెటీ స్థాయిలో పాపులారిటీ సొంతం చేసుకున్నారు.

Barrelakka: బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ తో బర్రెలక్క సీక్రెట్ మ్యారేజ్.. దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన శిరీష?

Barrelakka: బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ఒకరు. ఒక కామన్ మాన్ గా హౌస్ లోకి అడుగుపెట్టి సెలెబ్రెటీ హోదా సొంతం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో విజేతగా నిలిచినటువంటి ఈయనకు విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.

ఇటీవల కాలంలో అదే స్థాయిలో పాపులారిటీ సొంతం చేసుకున్నటువంటి వారిలో బర్రెలు అక్క అలియాస్ శిరీష ఒకరు. ఈమె నిరుద్యోగ ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి ఎన్నో రకాల వీడియోలు చేసేవారు. అనంతరం తెలంగాణ ఎన్నికలలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎమ్మెల్యే ఎలక్షన్లలో పోటీ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు.

ఈమె ఎన్నికలలో గెలవలేకపోయినా అందరి దృష్టిని ఆకర్షించి సెలబ్రిటీ హోదాని సొంతం చేసుకున్నారు. అయితే తాజాగా వీరిద్దరికీ సంబంధించి ఒక రూమర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీరిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నటువంటి తరుణంలో శిరీష ఈ వార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చారు.

అన్నను ఎక్కడైనా పెళ్లి చేసుకుంటారా..

తాను ఒక రైతు బిడ్డ అలాగే బిగ్ బాస్ కార్యక్రమంలోకి వచ్చిన పల్లవి ప్రశాంత్ అన్న కూడా రైతుబిడ్డ కావడంతో తనని గెలిపించాలని తనకు మద్దతుగా కొన్ని వీడియోలు చేశాను ఈ వీడియోలన్నింటిలో కూడా నేను తనని అన్నా అంటూ సంభోదించాను కానీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మాత్రం తమ స్వార్థం కోసం మా ఇద్దరికీ పెళ్లి అయినట్టు వార్తలను సృష్టించారు. ఇలాంటి తప్పుడు వార్తలను సృష్టిస్తే అసలు సహించనని ఎక్కడైనా అన్నను పెళ్లి చేసుకుంటారా ఇదే మన సంస్కృతినా అంటూ ఈమె తన స్టైల్ లో వార్నింగ్ ఇస్తూ ఈ వార్తలను పూర్తిగా ఖండించారు.

Pallavi prashanth: ఈ ప్రాణం ఉన్నంతవరకు మీరేనా అన్న.. శివాజీ పై ప్రశాంత్ కామెంట్స్!

Pallavi prashanth: బిగ్ బాస్ కార్యక్రమంలో విన్నర్ గా నిలిచినటువంటి పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ తర్వాత ప్రస్తుతం పలు బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇక సంక్రాంతి పండుగను పురస్కరించుకొని స్టార్ మా వాళ్ళు నా సామిరంగా అనే స్పెషల్ ఈవెంట్ నిర్వహించారు. నాగార్జున సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడమే కాకుండా ఈ కార్యక్రమంలో నాగార్జున కూడా సందడి చేశారు.

12

ఇకపోతే బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కంటెస్టెంట్లు కూడా ఈ కార్యక్రమంలో సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా శివాజీ పట్ల పల్లవి ప్రశాంత్ మరోసారి పొగడ్తల వర్షం కురిపించారు. నేను బిగ్ బాస్ ట్రోఫీ అందుకున్నాను అంటే అందుకు కారణం మా అన్న శివాజీ ప్రోత్సాహమే అంటూ ప్రశాంత్ మాట్లాడారు. నాకు నిజజీవితంలో అన్న లేరు కానీ నా ప్రాణం పోయేవరకు శివాజీ అన్ననే నా అన్న అంటూ శివాజీ గురించి గొప్పగా చెప్పారు.

శివాజీకి పట్టు బట్టలు..

అనంతరం పల్లవి ప్రశాంత్ శివాజీ కోసం పట్టుబట్టలను సమర్పించగా యావర్ కూడా శివాజీకి బంగారు కడియం తొడిగించి మీరే నా బ్రదర్ మదర్ అండ్ ఫాదర్ అంటూ శివాజీ గురించి గొప్పగా చెప్పారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ కార్యక్రమంలో పల్లవి ప్రశాంత్ రైతు కష్టాలను తెలియజేస్తూ ఒక పెర్ఫార్మెన్స్ చేశారు. ఈయన చేసినటువంటి ఈ పెర్ఫార్మెన్స్ అందరికీ కన్నీళ్లను తెప్పించింది.

https://www.instagram.com/reel/C17DI24hZqE/?utm_source=ig_web_copy_link