Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ పరిచయం అవసరం లేని పేరు బిగ్ బాస్ 7 కార్యక్రమంలోకి ఒక కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చినటువంటి ఈయన అనంతరం ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక బిగ్ బాస్ విన్నర్ గా నిలిచిన పల్లవి ప్రశాంత్ ప్రస్తుతం సెలబ్రెటీ హోదాని అనుభవిస్తూ ఎంతో మంది అభిమానులను కూడా సొంతం చేసుకున్నారు..
ఇక ఈయన బిగ్ బాస్ కార్యక్రమంలో ఉన్నప్పుడు తాను కనుక విజేతగా నిలబడితే నాకు వచ్చే ప్రైజ్ మనీ రైతుల కోసం ఇస్తానని పేద రైతులకు ఆ డబ్బును ఇచ్చి వారికి కుటుంబాలకు అండగా నిలబడతానని తెలిపారు. ఇలా బిగ్ బాస్ కార్యక్రమం పూర్తి అయి దాదాపు మూడు నెలలు అయినప్పటికీ ఇప్పటివరకు ఈయన ఎవరికి సహాయం చేయలేదు.
ఈ విధంగా పల్లవి ప్రశాంత్ రైతులకు సహాయం చేయకపోవడంతో ఈయన గురించి పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయి. మాట ఇచ్చి మర్చిపోయారని చాలామంది ఈయన పట్ల ట్రోల్ చేశారు అయితే తాజాగా పల్లవి ప్రశాంత్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. తాను బిగ్ బాస్ కార్యక్రమంలో గెలుచుకున్నటువంటి డబ్బును రైతులకు పంచే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు.
సందీప్ మాస్టర్ సహాయం..
ఈ క్రమంలోనే గజ్వేల్ లోని కొలుగూరు గ్రామానికి చెందినటువంటి ఒక రైతు కుటుంబానికి ఏకంగా లక్ష రూపాయల సహాయం అందించారు. తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారుల కోసం ఈయన లక్ష రూపాయలు సహాయం చేయడమే కాకుండా ఏడాదికి సరిపడా బియ్యం కూడా పంపించారు. అయితే ఈయనకు తోడుగా సందీప్ మాస్టర్ కూడా 25 వేల రూపాయలను ఆ కుటుంబానికి అందించటం విశేషం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…