Venkatesh: టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఎంతోమంది సినీ సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకోగా, మరికొందరు పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ ఉన్నటువంటి వారిలో నటుడు వెంకటేష్ ఒకరు. ఈయన తన రెండో కుమార్తె హయవాహిని వివాహపు వేడుకలు మార్చి 15వ తేదీ ఎంతో ఘనంగా జరిగాయి.
వెంకటేష్ కు ముగ్గురు కుమార్తెలు ఒక కుమారుడు అనే విషయం మనకు తెలిసిందే. ఇదివరకే తన పెద్ద కుమార్తె వివాహం కూడా జరిపించారు. అయితే తాజాగా తన రెండవ కుమార్తె హయవాహిని వివాహం విజయవాడకు చెందిన ప్రముఖ డాక్టర్ కుమారుడు నిషాంత్ అనే వ్యక్తికి ఇచ్చి ఎంతో అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు.
గత ఏడాది అక్టోబర్ నెలలో వీరి నిశ్చితార్థపు వేడుకలు విజయవాడలో జరిగాయి. ఈ వేడుకలకు చిరంజీవి మహేష్ బాబు నాగచైతన్య వంటి వారందరూ హాజరై సందడి చేశారు. అయితే తాజాగా వీరి వివాహం రామానాయుడు స్టూడియోలో ఎంతో ఘనంగా జరిగింది.
రామానాయుడు స్టూడియో..
ఈ పెళ్లి వేడుకలలో భాగంగా కేవలం అత్యంత సన్నిహితులు కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారని తెలుస్తోంది. తాజాగా నిషాంత్ హయవాహిని వివాహ వేడుకలకు సంబంధించినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో వెంకటేష్ అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్‌లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్‌తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…