Upasana: మెగా కోడలు ఉపాసన రాంచరణ్ భార్యగా మెగా ఇంటి కోడలుగా మాత్రమే కాకుండా ప్రముఖ బిజినెస్ ఉమెన్ గా కూడా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా వృత్తిపరమైన జీవితంలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె తనకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు.
ఈ క్రమంలోనే ఇటీవల హైదరాబాద్ లో జరిగినటువంటి గ్లోబల్ స్పిర్చువాలిటీ మహోత్సవ్ కార్యక్రమానికి హాజరైంది. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కమలేష్ దాజిని కలిసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలను ఈమె సోషల్ మీడియాలో షేర్ చేశారు.
నేడు ప్రపంచ శాంతి కోసం జరుగుతున్న గ్లోబల్ స్పిర్చువాలిటీ మహోత్సవ్ లో గౌరవనీయులైన భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ముజీ గారిని నా కుమార్తె క్లిన్ కారా కొణిదెలతో కలవడం చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్రపతిని కలిసినటువంటి ఫోటోలను షేర్ చేశారు.
అభిమానులకు దర్శనం ఎప్పుడు..
ఇలా తన ముద్దుల కూతురును ఏకంగా ఇండియన్ ప్రెసిడెంట్ కు చూపించినటువంటి ఉపాసన ఇప్పటివరకు అభిమానులకు మాత్రం చూపించలేదు. దీంతో ఈ ఫోటోలపై ఎంతోమంది మెగా అభిమానులు స్పందిస్తూ మెగా ప్రిన్సెస్ దర్శనం మాకు ఎప్పుడు వదిన ఎప్పుడు పాపను చూపిస్తారు అంటూ పలువురు ఈ ఫోటోలపై కామెంట్లు చేస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…