Amalapaul: అమలాపాల్ పరిచయం అవసరం లేని పేరు. ఈమె సౌత్ ఇండస్ట్రీలో పలు భాషలలో సినిమాలు చేస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక తెలుగులో కూడా పలు సినిమాలలో నటించినటువంటి అమలాపాల్ ప్రస్తుతం అనే వ్యక్తిని వివాహం చేసుకొని కొత్త జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.
ఇక ఈమె ఇది వరకే తమిళ దర్శకుడు విజయ్ తో ప్రేమలో పడి తనని పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి వైవాహిక జీవితం ఎక్కువ కాలం నిలబడలేకపోయింది. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకొని విడిపోయిన అనంతరం ఈమె కెరియర్ పై ఫోకస్ పెట్టారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఉన్నటువంటి ఈమె ఇటీవల జగత్ దేశాయ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.
ఇలా ప్రేమించిన వ్యక్తిని రెండో వివాహం చేసుకున్నటువంటి ఈమె ప్రస్తుతం తన జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. ఇక వీరి వివాహం గత ఏడాది నవంబర్ నెలలో జరగగా పెళ్లయిన రెండు నెలలకి ఈమె ప్రెగ్నెంట్ అనే గుడ్ న్యూస్ కూడా తెలియజేశారు. ఇలా తరచూ తన బేబీ బంప్ ఫోటోలతో ఈమె పెద్ద ఎత్తున రచ్చ చేస్తున్నారు.
భర్తతో డాన్స్…
ఇదిలా ఉండగా తాజాగా ఈమె తన భర్తతో కలిసి పబ్ లో పెద్ద ఎత్తున డాన్స్ చేస్తూ కనిపించారు. ఏడు నెలల గర్భంతో ఇలా పబ్ లో అమలాపాల్ డాన్స్ చేస్తూ ఉన్నటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు ఈ ఫోటోలు పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా కడుపుతో డాన్సులు చేస్తూ సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నావు అంటూ కొందరు కామెంట్లు చేయగా మరికొందరు ఈమెకు సపోర్ట్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…