Movie News

Samantha: ఆ ఒక్క కారణంతో మయోసైటిసిస్ గురించి అందరికీ చెప్పాను… సమంత కామెంట్స్ వైరల్!

Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగినటువంటి సమంత ప్రస్తుతం సినిమాలకు కాస్త విరామం ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. ఈమె మయూసైటిస్ అనే వ్యాధికి గురి కావడంతోనే ఈ వ్యాధికి పూర్తిగా చికిత్స తీసుకోవాలనే ఉద్దేశంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. సినిమాలకు దూరమైనటువంటి ఈమె సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను పంచుకుంటూ ఉన్నారు.

ఇకపోతే తాజాగా సమంత సోషల్ మీడియా వేదికగా తన వ్యక్తిగత విషయాల గురించి తెలియజేశారు తాను ఇండస్ట్రీలోకి వచ్చి 14 సంవత్సరాలు అయింది అని తెలిపారు. అయితే ఈ 14 సంవత్సరాల సమయంలో నేను రోజుకు పది పనులు చేసేదాన్ని కేవలం ఐదు గంటలు మాత్రమే నిద్రపోయే దానిని తెలిపారు. నేనెప్పుడూ నా శరీరానికి విశ్రాంతి ఇవ్వలేదని సమంత ఈ సందర్భంగా వెల్లడించారు.

ఇలా 14 సంవత్సరాల పాటు నిరంతరం కష్టపడిన ఎప్పుడు నేను విజయాలను ఆస్వాదించలేకపోయానని ఈమె తెలియజేశారు. ఇక తనకు మయోసైటిసిస్ వ్యాధి వచ్చింది అని చెబుతూ ఈమె అందరి దగ్గర సింపతి కొట్టేసింది అంటూ గతంలో కూడా వార్తలు వచ్చే అయితే ఈ వార్తలు గురించి స్పందించారు నేను మాయోసైటిస్ గురించి చెప్పడానికి కారణం లేకపోలేదని తెలిపారు.

చెప్పకపోతే సినిమా చచ్చిపోతుంది..
ఆ సమయంలో నేను ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా చేశాను. ఈ వ్యాధి కారణంగా ప్రమోషన్లకు దూరంగా ఉన్నాను అయితే నేను ప్రమోషన్లకు దూరంగా ఉండడంతో ఈ సినిమా చచ్చిపోతుందని నిర్మాతలు చెప్పడంతో తప్పనిసరి పరిస్థితులలో నా అనారోగ్య సమస్యలను బయట పెట్టాల్సి వచ్చిందంటూ ఈ సందర్భంగా సమంత చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago