Manoj -Mounika: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్నటువంటి మంచు మనోజ్ గత ఏడాది భూమ మౌనికను రెండో వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా వీరి వివాహ వేడుకలు మంచు లక్ష్మి నివాసంలో ఎంతో ఘనంగా జరిగాయి. రెండో వివాహం తర్వాత మనోజ్ వృత్తిపరమైన జీవితంలో కూడా ఎంతో బిజీగా మారిపోయారు.
ఇలా కెరియర్ పరంగా వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా ఉన్నటువంటి మనోజ్ త్వరలోనే తండ్రి కాబోతున్న విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం భూమ మౌనిక రెడ్డి ప్రెగ్నెన్సీతో ఉన్నారు అయితే తాజాగా ఈమెకు కవల పిల్లలు జన్మించారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కానీ ఈ వార్తలలో ఏ మాత్రం నిజం లేదు అంటూ మంచు మనోజ్ కొట్టి పారేశారు.
ఇకపోతే తాజాగా భూమా మౌనిక సీమంతపు వేడుకలు చాలా ఘనంగా జరిగాయని తెలుస్తుంది. కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో నంద్యాలలో ఈమె సీమంతపు వేడుకలు జరిగాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
భూమా నాగిరెడ్డి వర్ధంతి..
ఇటీవల భూమా నాగిరెడ్డి వర్ధంతి వేడుకల సందర్భంగా మంచు మనోజ్ మౌనిక నంద్యాలకు వెళ్లి అక్కడ తన తండ్రికి నివాళులు అర్పించారు. అనంతరం తన కుటుంబ సభ్యులు ఈమెకు నంద్యాలలోనే సీమంతపు వేడుకలను నిర్వహించారని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారడంతో ఎంతోమంది అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలని తెలియజేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…