Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ పరిచయం అవసరం లేని పేరు. ఒక సాధారణ రైతుబిడ్డగా పొలం పనులు చేసుకుంటూ ఉన్నటువంటి ఈయన ఎన్నో రకాల వీడియోలు చేస్తూ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫేమస్ అయ్యారు. ఇలా యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ ఉన్నటువంటి ఈయనకు బిగ్ బాస్ అవకాశం రావడంతో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టారు. హౌస్ లోకి అడుగు పెట్టినటువంటి ప్రశాంత్ అనంతరం విన్నర్ గా బయటకు వచ్చారు.
ఇక గ్రాండ్ ఫినాలే రోజు ఈయన అభిమానులు చేసిన హంగామా గురించి మనకు తెలిసిందే. పెద్ద ఎత్తున కార్లు ధ్వంసం చేయడమే కాకుండా ప్రభుత్వ ఆస్తులను కూడా ధ్వంసం చేయడంతో ఈయనపై కేసులు పెట్టి జైలుకు పంపించారు. అయితే బెయిలు మీద బయటకు వచ్చినటువంటి పల్లవి ప్రశాంత్ తన రెండు రోజుల జైలు జీవితం గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
తాను రెండు రోజులపాటు జైలులో చాలా ఇబ్బంది పడ్డాను అని తెలిపారు. బాధతో భోజనం కూడా చేయలేదని కానీ తోటి ఖైదీలు చెప్పడంతో భోజనం చేశానని జైలు కూడు బాగుందని తెలిపారు. నన్ను వీఐపీ ఇలా ట్రీట్ చేసిన లేక సాధారణంగా ట్రీట్ చేసిన కూడా అక్కడ భోజనం బాగుందని ఈయన వెల్లడించారు. ఇక ఖైదీలు అందరూ కూడా నాతో మాట్లాడుతూ బిగ్ బాస్ గురించి ప్రశ్నలు వేసే వాళ్ళు విన్నర్ ఎవరంటూ కూడా అడిగేవారు.
బిగ్ బాస్ గురించి అడిగేవారు..
ఇక నేను వెళ్ళిన తర్వాత జైలుకు వచ్చిన వారు బయట జరిగిన గొడవ గురించి తెలిపే వారని ప్రశాంత్ తెలిపారు. అయితే నేను జైలులో ఉంటే ఏ మాత్రం భయపడలేదు నేను తప్పు చేయలేదు అందుకే ఎవరికి భయపడలేదని కానీ నాపై విమర్శించిన వారికి కూడా అదే గతే పడుతుంది అంటూ ఈ సందర్భంగా జైలు జీవితం గురించి ప్రశాంత చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…