Pallavi prashanth: పల్లవి ప్రశాంత్ పరిచయం అవసరం లేని పేరు. ఒక రైతు బిడ్డగా యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ ఉన్నటువంటి ఈయనకు భారీ స్థాయిలో అభిమానులు పెరిగిపోయారు. ఇలా సోషల్ మీడియా ద్వారా ఎంతో పాపులర్ అయినటువంటి పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు.
ఇలా బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో ఫేమస్ అవ్వడమే కాకుండా టైటిల్ విన్నర్ గా నిలిచినటువంటి ఈయనకు 35 లక్షల రూపాయల ప్రైస్ మనీతో పాటు ఒక డైమండ్ నెక్లెస్ అలాగే కారు కూడా బహుమానంగా వచ్చిన సంగతి తెలిసిందే అయితే తాను గెలిచిన ఈ డబ్బును పేద రైతులకు సహాయంగా ఇస్తానని గతంలో ప్రశాంత్ ప్రకటించారు.
ఇప్పటివరకు ఈ సహాయం చేయకపోవడంతో మాట తప్పారు అంటూ ఈయన పట్ల విమర్శలు వచ్చాయి. తాజాగా ఈ విమర్శలపై పల్లవి ప్రశాంత్ మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. తాను ప్రాణం పోయిన ఇచ్చిన మాట తప్పనని పల్లవి ప్రశాంత్ తెలిపారు. త్వరలోనే రైతులకు ఇవ్వాల్సిన డబ్బును మొత్తం ఇవ్వబోతున్నానని తెలిపారు.
ప్రాణం పోయినా మాట తప్పను..
ఈయన 35 లక్షల రూపాయలు గెలుచుకోగా టాక్స్ కట్ అవుతూ ఈయనకు కేవలం 16 లక్షల రూపాయలు మాత్రమే చేతికి అందిందని ఈ పదహారు లక్షల రూపాయలను మాత్రమే పల్లవి ప్రశాంత్ రైతులకు పంచ బోతున్నారని తెలుస్తుంది. ఇక ఈయన బిగ్ బాస్ గెలిచిన తర్వాత ఇతర బుల్లితెర కార్యక్రమాలలో బిజీగా గడుపుతూ ఉన్నారు.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…