పేపర్ బాయ్ దర్శకుడు జయ శంకర్ ప్రస్తుతం తన రెండో సినిమా అరిని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అరి చిత్రాన్ని ఇప్పటికే టాలీవుడ్ సినీ ప్రముఖులకు చూపించారు. వారంతా కూడా అరి చిత్రంపై ప్రశంసలు కురిపించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వంటి వారు కూడా అరి చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ సైతం సినిమాను చూసి మెచ్చుకున్నారు. అలా అరి చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతోన్నారు.
పేపర్ బాయ్ సినిమాను మన సమాజం నుంచి, మన నిత్యం చూసే మనుషుల జీవితాల నుంచి తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. కానీ అరి చిత్రానికి కాస్త భిన్నమైన లైన్‌ను, పాయింట్‌ను ఎంచుకున్నారు. మనిషిలో ఉండే అరిషడ్వర్గాల మీద, దానికి దైవత్వం అనే పాయింట్‌ను జోడిస్తూ ఓ ఫాంటసీ చిత్రంగా మలిచాడు దర్శకుడు జయ శంకర్. ఆరు పాత్రల చుట్టూ ఈ చిత్రం తిరుగుతుందని తెలుస్తోంది.
ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
తాజాగా అరి చిత్రంలోని మెయిన్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇక్కడ అన్ని కోరికలు తీర్చబడును అనే క్యాప్షన్‌తో రిలీజ్ చేసిన పోస్టర్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. వినోద్ వర్మకు సంబంధించిన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పుడు నెట్టింట్లో ఫుల్ ట్రెండ్ అవుతోంది. పోస్టర్‌లో కనిపిస్తున్నట్టుగా ఆ లైబ్రరీ కథ ఏంటి? ఇక్కడ అన్ని కోరికలు తీర్చబడును అంటూ కనిపించిన ఆ క్యాప్షన్ వెనుకున్న అర్థం ఏంటి? అసలు వినోద్ వర్మ పాత్ర ఏంటి? ఆ క్యాప్షన్ మధ్యలో ఓ నెమలి పించం ఎందుకు కనిపిస్తోంది? ఇలాంటి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలా ఉన్న ఈ పోస్టర్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను మేకర్లు ప్రకటించనున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…