Movie News

Varun Tej: మా పెళ్లి ఇటలీలో జరగడానికి అదే కారణం.. వరుణ్ తేజ్ కామెంట్స్ వైరల్!

Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ త్వరలోనే ఆపరేషన్ వాలెంటైన్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా మార్చ్1వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి తరుణంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

ఇదిలా ఉండగా ఇటీవల వరుణ్ తేజ్ నటి లావణ్య త్రిపాఠిని ఎంతో ఘనంగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట గత ఏడాది నవంబర్ ఒకటవ తేదీ ఇటలీలో కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.

ఇలా వీరి వివాహం ఇటలీలో జరగడం పట్ల ఎంతోమంది వివిధ రకాలుగా కామెంట్లు చేశారు. అయితే తాజాగా వరుణ్ తేజ్ తమ పెళ్లి ఇటలీలో జరగడానికి గల కారణం ఏంటి అనే విషయాలను వెల్లడించారు. మా పెళ్లి కనుక ఇండియాలో జరిగే ఉంటే అమ్మానాన్నలు వచ్చే గెస్ట్ లను రిసీవ్ చేసుకోవడానికి సరిపోయేది వారు మా పెళ్లిని కన్నులారా చూడలేరు. అలాగే పెళ్లిని ఎంజాయ్ చేయలేరు అందుకే మేము ఇటలీలో వెడ్డింగ్ ప్లాన్ చేసామని తెలిపారు.

వెకేషన్ లో ఎంజాయ్ చేయాలి..

మా పెళ్లిలో మా ఫ్యామిలీ మొత్తం ఒక వెకేషన్ లా ఎంజాయ్ చేయాలన్న ఉద్దేశంతోనే ఇలా ప్లాన్ చేశామని అంతకుమించి మరే కారణాలు లేవని వరుణ్ తేజ్ తెలిపారు. ఇక ఇటలీలో తమ పెళ్లి వేడుకలను ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేశారని తక్కువ మంది ఉంటేనే పెళ్లి చాలా కూల్ గా ఉంటుందని ఈ సందర్భంగా వరుణ్ తేజ్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago