Pallavi prashanth: పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డగా బిగ్ బాస్ కార్యక్రమంలో అందరికీ పరిచయమయ్యారు. అంతకుముందు యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ ఉన్నటువంటి ప్రశాంత్ బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా మరింత మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంట్రీ ఇచ్చినటువంటి ఈయన కప్పు గెలుచుకొని సెలబ్రిటీ అయ్యారు.
ఇక హౌస్ లో ఉన్నప్పుడు ఈయనకు అమర్ తో జరిగిన గొడవ కారణంగా గ్రాండ్ ఫినాలే రోజు ఈయన అభిమానులు అమర్ కారు పై దాడి చేశారు. ఈ దాడిలో భాగంగా పలువురు సెలబ్రిటీల కార్లు ధ్వంసం కావడమే కాకుండా ప్రభుత్వ ఆస్తులు ప్రభుత్వం కావడంతో పల్లవి ప్రశాంత్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
ఇలా రెండు రోజులపాటు జైలులో ఉన్నటువంటి ప్రశాంత్ అనంతరం బెయిల్ మీద బయటకు వచ్చారు. ఇలా విడుదలైనటువంటి ఈయన పలు కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే బిబి ఉత్సవ్ కార్యక్రమంలో కూడా పల్లవి ప్రశాంత్ పాల్గొని సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన మొదటిసారి తన అరెస్టు గురించి స్పందిస్తూ ఎమోషనల్ అయ్యారు.
నాన్న కళ్ళల్లో ఆనందం చూడాలనుకున్న…
నేను బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొని ఎలాగైనా కప్పు గెలుచుకుని తన తండ్రి కళ్ళల్లో ఆనందం చూడాలని అనుకున్నాను కానీ జైలుకు వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు. అయితే నేను జైలులో ఉన్నప్పుడు నాన్న కోర్టు దగ్గర పడుకున్న వీడియోలు చూసి ఆ క్షణం నేను ఇంకా ఎందుకు బ్రతికి ఉన్నానా అనిపించింది అంటూ ఈ సందర్భంగా పల్లవి ప్రశాంత్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…