Suma -Rajeev: సుమా కనకాల పరిచయం అవసరం లేని పేరు. ఈమె బుల్లితెర యాంకర్ గా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు. ఇక సుమ నటుడు రాజీవ్ కనకాలను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఇటీవల ఈ దంపతులు తమ 25వ పెళ్లిరోజు వేడుకలను జరుపుకున్నారు. ఈ క్రమంలోనే సుమ రాజీవ్ ఇద్దరు కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.
ఈ క్రమంలోనే కొంతమంది నెటిజన్స్ మీరు ఎప్పుడైనా సుమా ఫోన్ తీసుకొని చెక్ చేశారా అంటూ ప్రశ్నించగా రాజీవ్ మాత్రం తాను ఎప్పుడూ అలాంటి పని చేయలేదని చెప్పారు. కానీ సుమ మాత్రం నేను ఒకసారి చేశానని చెప్పగా ఒక్కసారిగా రాజీవ్ షాక్ అయ్యారు అయితే అందులో ఏమి దొరకలేదు అంటూ సుమా చెప్పగా అన్ని దొరికే లాగా పెడతామా ఏంటి అంటూ రాజీవ్ సెటైర్ వేశారు.
ఇకపోతే రాజీవ్ కనకాల కారణంగా ఎప్పుడైనా మీరు బాధపడిన సందర్భాలు ఉన్నాయా అని ప్రశ్నించడంతో సుమ ఉన్నాయి అంటూ ఈమె బాధపడ్డారు. నేను ఎప్పుడైనా ఫోన్ చేసి ఎక్కడున్నారు అంటే ఐదు నిమిషాలలో వస్తున్నాను అని చెబుతాడు. కానీ ఎప్పుడూ కూడా ఈయన రాలేదు అంటూ సుమ ఈ సందర్భంగా బాధపడగా రాజీవ్ మాత్రం తనని బాధ పెట్టినందుకు గాను ఇప్పుడు తనకు క్షమాపణలు చెప్పారు.
హర్రర్ సినిమాలకు తీసుకెళ్లాడు..
ఇక సుమ తన భర్త గురించి మాట్లాడుతూ .. తాను ఎక్కువగా హర్రర్ సినిమాలు దయ్యాల సినిమాలను మాత్రం చూస్తూ ఉంటారు. అవంటే తనకు చాలా ఇష్టం అంతేకాకుండా నేను ప్రెగ్నెంట్ గా ఉన్న సమయంలో నన్ను కూడా అలాంటి హర్రర్ సినిమాలకు తీసుకువెళ్లారు అంటూ ఈ సందర్భంగా సుమ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…