Rakul Preeth singh: రకుల్ ప్రీతి సింగ్ పరిచయం అవసరం లేని పేరు. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె మరొక రెండు రోజులలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటుడు నిర్మాత జాకీ భగ్ననిని ప్రేమించినటువంటి రకుల్ ఆయనతో కలిసి ఏడడుగులు నడవబోతున్నారు.
వీరి వివాహానికి గోవా వేదికగా మారింది. గోవాలో వీరి వివాహం మూడు రోజులపాటు ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతుందని తెలుస్తుంది. ఇక తన పెళ్లి కోసం 45 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఒక ఫైవ్ స్టార్ రిసార్ట్ ఈమె బుక్ చేశారని తెలుస్తుంది. దాదాపు 250 గదులతో 45 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ రిసార్ట్ నుంచి బీచ్ వ్యూవ్ ఎంతో అద్భుతంగా ఉంటుందని అన్ని సౌకర్యాలతో కూడినటువంటి ఈ రిసార్ట్ ఈమె బుక్ చేశారని తెలుస్తోంది.
ఈ విధంగా రకుల్ ఎంతో అంగరంగ వైభవంగా భారీ ఖర్చులతో కూడిన వివాహం చేసుకుంటున్నారని స్పష్టంగా అర్థం అవుతుంది. ఇక ఈమె తన వెడ్డింగ్ కార్డు కూడా గోవా అందాలన్నింటినీ ప్రత్యేకంగా డిజైన్ చేయించి మరి వెడ్డింగ్ కార్డ్ సిద్ధం చేయించారు అలాగే పెళ్లిలో స్పెషల్ అట్రాక్షన్ గా కనిపించడం కోసం ఏకంగా ముగ్గురు డిజైనర్లతో డిజైన్ చేయించిన దుస్తులను ధరించబోతున్నారు. మొత్తానికి రకుల్ తన పెళ్లి కోసం భారీగా ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది.
మూడు రోజుల పెళ్లి..
తాజాగా ఈ రిసార్ట్ కి సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది. ఈ రిసార్ట్ లో మనం ఒక రోజు ఒక రూమ్ బుక్ చేయాలి అంటే సుమారు 20000 నుంచి 75 వేల రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుందట. మరి రకుల్ ప్రీత్ తన పెళ్లి కోసం ఎన్ని గదులు బుక్ చేసిందో తెలియదు కానీ ఒక్కరోజు కూడా 75 వేల వరకు రెంట్ అంటే మామూలు విషయం కాదని చెప్పాలి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…